కాళ్లుమొక్కుతాం.. సమస్యలు పరిష్కరించండి
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా మీ కాళ్లుమొక్కుతాం.. మా సమస్యలు పరిష్కరించి న్యాయం చేయండి’ అంటూ అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు పాల్గొని ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో నమోదైన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలన్నారు. డీఆర్‌వో మోహన్‌కుమార్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్‌ఎస్ ఆన్‌లైన్ సర్వర్ మొరాయించడంతో ఆఫ్‌లైన్ విధానంలో అర్జీలను నేరుగా స్వీకరించారు.
ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
రాష్ట్రంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి కోరారు. ఈ మేరకు ఆ పరిషత్ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైజాగ్ గ్రామీణ, వేములవాడ తదితర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 500 ఎకరాలకు పైగా ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాళ్లుమొక్కుతాం.. సమస్యలు పరిష్కరించండి


