లక్షా 65 వేల హెక్టార్లలో తోటలు
మామిడిపై ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు ప్రతి సంవత్సరం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో సుమారు లక్షా 65 వేల హెక్టార్లలో రైతులు మామిడి సాగు చేస్తున్నారు. 21 మండలాల్లో మేజర్ క్రాప్ మామిడి ముందున్నది. ఇందులో 65 శాతం తోతాపురి సాగు చేస్తున్నారు. దీంతో పాటు నీలం, బేనిషా, ఖాదర్, మల్లిక, హిమా పసందు సాగులో ఉన్నాయి. అయితే వాతావరణ పరిస్థితుల వల్ల గతేడాది ఆశించిన స్థాయిలో దిగుబడి రాక మామిడి రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఈ ఏడాది ఆ నష్టాన్ని పూడ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నా...వాతావరణ ప్రభావంతో ఇంత వరకు మామిడిలో పూత కనిపించకపోవడంతో ఈ ఏడాది కూడా రైతులు నిరాశ చెందుతున్నారు.


