షార్ట్‌ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం

Dec 26 2025 8:28 AM | Updated on Dec 26 2025 8:28 AM

షార్ట

షార్ట్‌ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం

శ్రీరంగరాజపురం : విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని పాతపాళ్యం దళితవాడలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. గ్రామానికి చెందిన వరప్రసాద్‌తోపాటు కుటుంబ సభ్యులు గురువారం క్రిస్మస్‌ సందర్భంగా చర్చికి వెళ్లారు. అదే సందర్భంలో అకస్మాత్‌గా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అతని పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రూ.30 వేల నగదు, 40 గ్రాముల బంగారు ఆభరణాలు, వరి ధాన్యం, బియ్యం, దుస్తులు కాలిబూడిదయ్యాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితుడు కోరారు.

దౌర్జన్యంగా ఇల్లు కూల్చివేత

శాంతిపురం: పంచాయతీ కేంద్రమైన నడింపల్లిలో తన ఇంటిని దౌర్జన్యంగా కూల్చివేయడంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు మారప్ప తెలిపారు. భూ వివాదంపై కుప్పం కోర్టులో వ్యాజ్యం నడుస్తుండగానే జేసీబీతో ఇంటిని కూలదోశారని వాపోయాడు. కోర్టు తీర్పు వచ్చేంత వరకూ ఆగాలని కోరినా వినిపించుకోకుండా ప్రత్యర్థి పక్షం వారు కూల్చివేశారని చెప్పాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, కోర్టు వివాదంలో ఉన్న ఆస్తిలో ఎవరూ ప్రవేశించ కుండా చూడాలని కోరారు.

ప్రభుత్వ కుంట ఆక్రమణ

చంద్రగిరి: మండలంలోని ఏ.రంగంపేట సమీపంలో సుమారు రూ.40 లక్షల విలువైన ప్రభుత్వ కుంటను స్థానిక టీడీపీ నేత ఆక్రమించుకుంటున్నాడు. ఆరేపల్లి లెక్క దాఖల సర్వే నంబర్‌ 142/6లో 30 సెంట్ల కుంట ఉంది. ఇక్కడ గతంలో పురాతన కోనేరు ఉండేది. కాలక్రమేణ కోనేరు పూడిపోవడం, రెవెన్యూ రికార్డుల్లో కుంట భూమిగా నమోదైంది. ఇదే అదునుగా భావించిన పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఆ భూమిపై కన్నేశాడు. రెండు రోజులుగా నిరంతరం మట్టిని తరలించి, కుంటను చదును చేసే పనిలో నిమగ్నమయ్యాడు. విలువైన భూములు ఇలా అన్యాక్రాంతం కావడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రగిరిలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు చేస్తే, నామమాత్రంగా పనులను అడ్డుకుంటున్నారన్నారు. జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

60 సవర్ల బంగారం, రూ1.5 లక్షల నగదు చోరీ

వెంకటగిరి రూరల్‌: కుమార్తె ఉన్నత చదువులు కోసం ఇంట్లో దాచి ఉంచిన నగదు, బంగారం ఎవరు లేని సమయం చూసి దుండగలు చోరీ చేశారు. ఈ ఘటన పట్టణంలోని తోలిమిట్టలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కథనం మేరకు..తోలిమిట్టకు చెందిన చీమల కృష్ణమూర్తి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన కుమార్తె ప్రస్తుతం తిరుపతిలో విద్యనభ్యసిస్తూ అక్కడే ఉంది. కుమార్తె బాబోగులు చూసుకునేందుకు బుధవారం తిరుపతికి వెళ్లిన కృష్ణమూర్తి గురువారం ఇంటికి వచ్చి చూసేసరికే గుర్తు తెలియని దుండగలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో వస్తువులు చిందర వందరగా చేసి ఉన్నారు. అనుమానంతో తాను దాచి ఉంచిన బంగారం, నగదును చూడగా కనిపించలేదు. బాధితుడు ఈ విషయమై పోలీసుల కు సమాచారం అందించాడు. స్థానిక ఎస్‌ఐ ఏడుకొండలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, క్లూస్‌టీమ్‌ ద్వారా వేలిముద్రలను సేకరిస్తున్నట్లు తెలిపారు. బాఽధితుడి ఫిర్యాదు మేరకు 60 సవర్ల బంగారం, రూ.1.50 లక్షల నగదు చోరీ జరిగినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

దగ్ధమైన వస్తువులు

షార్ట్‌ సర్క్యూట్‌తో  పెంకుటిల్లు దగ్ధం 
1
1/3

షార్ట్‌ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో  పెంకుటిల్లు దగ్ధం 
2
2/3

షార్ట్‌ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో  పెంకుటిల్లు దగ్ధం 
3
3/3

షార్ట్‌ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement