ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు
–త్రుటిలో తప్పిన ప్రమాదం
కార్వేటినగరం : చెరకు ట్రాక్టర్‌ను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన మండల పరిధిలోని చిన్నకనుమ వద్ధ చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ గోవిందస్వామి కథనం మేరకు వివరాలిలా.. బెంగళూరు నుంచి కేఎస్ ఆర్టీసీ బస్సు పుత్తూరుకు వెళుతుండగా ఎస్‌ఎన్‌జే షుగర్ ఫ్యాక్టరీకి చెరకు లోడ్‌తో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. బస్సు డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయట పడ్డారు. ప్రయాణికులు, ట్రాక్టర్ డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనపై ఇంత వరకు ఫిర్యాదు అందలేదని ఏఎస్‌ఐ గోవిందస్వామి తెలిపారు.
తప్పిన ప్రమాదం
అసలే ప్రమాదాలకు నిలయంగా ఉన్న చిన్న, పెద్ద కనుమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో కూడా అదే కనుమపై ఇటుక ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన చోటు చేసుకుంది. కనుమకు ఎడమ వైపు సుమారు 30 అడుగుల లోతు లోయ ఉంది. కానీ చెరకు ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో బస్సు ఎడమ వైపు వాలకుండా చెరుకు లోడ్డు ఆనుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


