కార్డన్ సెర్చ్ .. 58 వాహనాలు సీజ్
చిత్తూరు అర్బన్ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో చిత్తూరు, పలమనే రు, కుప్పం, నగరి సబ్–డివిజన్‌లలో పోలీసు లు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డులు సరిగా లేని 57 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. 200 లీటర్ల సారాను ధ్వంసం చేసి, వారి నుంచి రూ.13,835 జరిమానా వసూలు చేశారు. చిత్తూరు టూటౌన్ పరిధిలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నేరా లను ముందస్తుగా అరికట్టాలనే ఉద్దేశం, ప్రజ ల్లో భద్రతా ప్రమాణాలకు బలపరిచేలా చేయ డం, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడమే కార్డన్‌సెర్చ్ లక్ష్యమని ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర స్థాయి
రగ్బీ పోటీలకు ఎంపిక
వి.కోట : తిరుపతిలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి రగ్బీ పోటీల్లో మండలంలోని నలంద విద్యాసంస్థల విద్యార్థి సంజయ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. స్కూల్ గేమ్స్ పెఢరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ –17 విభాగం రగ్బీ పోటీల్లో తమ పాఠఽశాలలో 9వ తరగతి చదువుతున్న సంజయ్ జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయ న పేర్కొన్నారు.
కార్డన్ సెర్చ్ .. 58 వాహనాలు సీజ్


