వికసిత్ భారత్‌కు పిల్లలే పునాది
చిత్తూరు కలెక్టరేట్ : పిల్లలే వికసిత్ భారత్‌కు పునా ది అని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వీర్‌బాల్ దివస్ పోస్టర్లను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భారత భవిష్యత్తుకు మూలస్తంభాలైన బాలలను గౌరవించాలన్నారు. బాలల్లో స్ఫూర్తిని నింపేందుకు వీర్‌బాల్‌దివస్ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల వయస్సుకు అనుగుణంగా పెయింటింగ్, వ్యాసరచన, కథలు చెప్పడం, క్విజ్, గ్రూప్ చర్చలు, స్కిట్స్ వంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈనెల 30వ తేదీ వరకు ర్యాలీలు, ఇతర అవగాహన కార్యక్రమాలు మండల స్థాయిలో చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కార్వే టినగరం డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ వరలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి పాల్గొన్నారు.
శిశు మరణాలను
కట్టడి చేద్దాం
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో శిశు మరణాలు జరగకుండా చూద్దామని డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి, డీఐఓ హనుమంతరావు పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం శిశు మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు శిశు మరణాలపై సిబ్బందిని విచారించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. గర్భిణుల పట్ల నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు విధిగా వారిని పర్యవేక్షించాలన్నారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తూ..మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. టీనేజీ గర్భిణులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. హైరిస్క్ కేసుల విషయంలో అలసత్వం వద్దన్నారు. ప్రసవం జరిగే వరకు గర్భిణులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నా రు. శిశు మరణాలను కట్టడి చేయడంలో క్షేత్రస్థాయిలోని వైద్య సిబ్బందే కీలకమని వారు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, వైద్యులు లత, భార్గ వ్, యోగేష్, రమ్య, అనూష, రోజారాణి, వెంకటేశ్వరి, మోహన్‌బాబు పాల్గొన్నారు.
రేపు డయల్ యువర్ ఎస్‌ఈ
చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. జిల్లాలో మొదటిసారి కార్యక్రమాన్ని సీఎండీ ఆదేశాల మేరకు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పై వినియోగదారులు సోమవారం ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్ చేయాలని వివరించారు.
16 మంది వీఏఓలకు ఉద్యోగోన్నతులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఉమ్మడి జిల్లాలో 16 మంది వీఏఓ ( గ్రామ వ్యవసాయ సహాయకులు)లకు ఏఈఓలు(వ్యవసాయ విస్తరణ అధికారులు)గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ...జిల్లా వ్యవ సాయశాఖ అధికారి మురళీకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగోన్నతి లభించిన అధికారులు 15రోజుల్లో కేటాయించిన స్థానంలో విధుల్లో చేరాలని ఆదేశాలిచ్చారు.
వికసిత్ భారత్‌కు పిల్లలే పునాది


