ఆదర్శంగా ఉండాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు ఆదర్శంగా ఉండాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో జిల్లా సమాఖ్య మహాజన సభ నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాల జీవన ప్రమాణాల పెంపునకు అనేక సంక్షేమ పథకాలున్నాయన్నారు. మన డబ్బులు మన లెక్కలు పైన ప్రతి సంఘ సభ్యురాలికి సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో 58 వేల మందిని అక్షరాసులుగా తీర్చిదిద్దేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలుగా అముద, కార్వేటినగరం, కార్యదర్శిగా పూతలపట్టుకు చెందిన ప్రసన్న, కోశాధికారిగా కుప్పానికి చెందిన గౌతమి, ఉపాధ్యక్షురాలుగా యాదమరి చెందిన రజియా, ఉప కార్యదర్శిగా గుడిపాలకు చెందిన సరళాను ఎన్నుకున్నారు. డీపీఎం రవి, ఏపీడీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


