Sangareddy
-
కిరాణషాపు దగ్ధం
రూ. 3 లక్షలు ఆస్తి నష్టంచిలప్చెడ్(నర్సాపూర్): కిరాణ షాపు దగ్ధమై ఆస్తి నష్టం సంభవించింది. ఈ సంఘటన మండలంలోని జగ్గంపేటలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆదివారం బాధితుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బొలిశెట్టి ప్రభు జగ్గంపేటగేట్ వద్ద కిరాణషాపు నడుపుతున్నాడు. రోజుమాదిరిగా శనివారం రాత్రి షాపు బంద్ చేసి షాపుపై అంతస్తులో పడుకున్నాడు. అర్ధరాత్రి కిరాణాషాపులో మంటలు రావడంతో ఇరుగుపొరుగు సహాయంతో ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివరికి అగ్నిమాపక అధికారులు వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే షాపులోని సామగ్రితోపాటు పట్టాదారు పాస్బుక్కు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మూడు లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతిచిన్నకోడూరు(సిద్దిపేట): మెనూ ప్రకారం విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. ఆదివారం మండల పరిధిలోని అల్లీపూర్‌లోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. భోజనాన్ని పరిశీలించి, బియ్యం, కూరగాయల నాణ్యత ఎలా ఉందని ఆరా తీశారు. విద్యార్థినులను ఆప్యాయంగా పలకరించారు. నాణ్యమైన ఆహార పదార్థాలను వాడుతూ రుచికరంగా వండాలని సూచించారు. విద్యార్థినులు కడుపునిండా తినాలని, బాగా తింటేనే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని చెప్పారు. ఏమైనా లోటు పాట్లు ఉంటే ఎస్ఓ దృష్టికి తీసుకురావాలన్నారు. కలెక్టర్ వెంట పాఠశాల ఎస్ఓ, ఉపాధ్యాయులు ఉన్నారు. -
మొక్కజొన్న సాగుపై అవగాహన
చేర్యాల(సిద్దిపేట): మొక్కజొన్న సాగులో అధిక దిగుబడి సాధించడంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ఆదివారం పట్టణ పరిధిలోని పిల్లి నరేందర్ వ్యవసాయ బావి వద్ద ఏడీఏ రాధిక ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ బయోప్యూయల్ విధానం 2018 ప్రకారం... భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోలు కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. ఇందులో ఆయిల్ కంపెనీలు మిశ్రమ పెట్రోలును విక్రయిస్తున్నాయని తెలిపారు. 2025 నాటికి పెట్రోలులో 25 శాతం ఎథనాల్ మిశ్రమం లక్ష్యంగా నిర్ణయించారని, 2030 నాటికి 30 శాతం మిశ్రమాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ప్రాజెక్టు దేశంలోని 15 రాష్ట్రాల్లో 78 జిల్లాల్లో అమలు చేయబడుతుందని, అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పలువురు రైతులకు మొక్కజొన్న విత్తన సంచులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ భోగేశ్వర్, ఐఐఎంఆర్ ప్రతినిధులు డాక్టర్ ఎన్.సునీల్, ఎం.యాదగిరి. ఎం.కిశోర్ కుమార్, రైతులు పాల్గొన్నారు. -
వ్యాస రచన పోటీల్లో విద్యార్థి ప్రతిభ
పాపన్నపేట(మెదక్): రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీల్లో పాపన్నపేట ఉన్నత పాఠశాలకు చెందిన కరెల్ల వైష్ణవి విజేతగా నిలిచారు. ఆదివారం హన్మకొండలో జరిగిన వేడుకలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్, నగదు, మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. వైష్ణవి విజేతగా నిలవడంపై పాఠశాల హెచ్ఎం మహేశ్వర్, తెలుగు ఉపాధ్యాయులు అంజాగౌడ్, నాగరాజు, నర్సింహులు అభినందనలు తెలిపారు. క్షేమంగా వచ్చిన వృద్ధులు పోలీసులకు కృతజ్ఞతలు చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని జంగరాయి గ్రామంలో బంగారం దోపిడీకి పాల్పడిన దుండగుడి దాడిలో తీవ్రగాయాలకు గురై చికిత్స పొందిన తమ్మల అంజయ్య, సావిత్రి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఆదివారం విషయం తెలుసుకున్న సర్పంచ్ ఆవుల గోపాల్‌రెడ్డితో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వారి ఇంటికి చేరుకొని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వృద్ధులతో కలిసి సర్పంచ్ మాట్లాడుతూ.. 48 గంటల్లోనే దుండగుడిని పట్టుకొని, బంగారం రికవరీ చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధికారుల నుంచి చిన్నశంకరంపేట మండల పోలీస్ అధికారుల వరకు వేగంగా స్పందించిన తీరు తమకు మరింత ధైర్యం కల్పించిందన్నారు. త్వరలోనే గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు మద్దూరు(హుస్నాబాద్): గ్రామ పంచాయతీ కారోబార్‌ను కులం పేరుతో దూషించి, దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ ఘటన మండలంలోని లద్నూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహ్మద్ ఆసీఫ్ వివరాల ప్రకారం... గ్రామంలో కారోబార్‌గా పని చేస్తున్న మల్లారపు రమేశ్ శనివారం గ్రామంలోని కొత్త గుడిసెల కాలనీ లో నీరు పెట్టడానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కాసర్ల రమేశ్, కాసర్ల ప్రశాంత్ అతడి వద్దకు వెళ్లి మా వదినతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ కులం పేరుతో దూషిస్తూ కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కారోబార్‌ను కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో బాధితుడి కుమారుడు గిరీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రామాయణం జీవన మార్గదర్శి సిద్దిపేటకమాన్: రామాయణం మనకు జీవన మార్గదర్శిని అని కవి రఘువీర్ అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఉత్సాహ రామాయణం, శ్రీ వశిష్ట గీతామృతం పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిద్దిపేట సాహిత్యానికి ఎంతో ప్రోత్సాహకం ఇస్తుందన్నారు. ఎంతో మంది కవులు తమ సాహిత్యాన్ని ప్రజల హితంగా రాస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బాలయ్య, వెంకటేశ్వర్లు, సతీశ్, నాగలత, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రోమో రన్లో భాగస్వాములు కావాలి
హోమియోపతి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఉమేశ్ ములుగు(గజ్వేల్): గజ్వేల్‌లో నిర్వహించనున్న ప్రోమో రన్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మండల పరిధిలోని క్షీరసాగర్ హంస హోమియోపతి మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎ.ఉమేశ్ పిలుపునిచ్చారు. కళాశాలలో గజ్వేల్ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులతో కలసి ప్రోమో రన్‌కు చెందిన పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రోమో రన్లో ప్రతీ ఒక్కరు భాగస్వాములై సామాజిక చైతన్యాన్ని తీసుకురావాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, స్ఫూర్తిని పెంపొందిస్తాయని చెప్పారు. తమ కళాశాల విద్యార్థులు పూర్తిస్థాయిలో కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు నిఖిల్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, లింగారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, జనార్దన్, కరుణాకర్, నరేశ్‌గౌడ్, అజయ్, ముస్తాఫా, అఫ్రస్ తదితరులు పాల్గొన్నారు. -
సాయిసిరికి గురుబ్రహ్మ పురస్కారం
మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు సినీగీత రచయిత సాయిసిరికి రాష్ట్రస్థాయి గురుబ్రహ్మ ఉగాది జీవిత సాఫల్య పురస్కారం వరించింది. తెలుగు సాంస్కృతిక గీతాలను రాసి తెలుగు భాష సాంస్కృతిక వైభవ వారధిగా నిలిచినందుకు విశాఖపట్నానికి చెందిన మదర్ థెరిసా సామాజిక సేవ సంస్థ 2026 సంవత్సరానికి గాను గురుబ్రహ్మ ఉగాది జీవిత సాఫల్య పురస్కారం అందించారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ పురస్కారం అందుకున్నట్లు సాయిసిరి తెలిపారు. -
కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
మెదక్ కలెక్టరేట్: కరాటే పోటీల్లో మెదక్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు కరాటే మాస్టర్ దినకర్ తెలిపారు. ఆదివారం రెంజుకి షోటోకాన్ కరాటే మాస్టర్ నగేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని జీకేఆర్ గార్డెన్లో పోటీలు నిర్వహించగా 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మెదక్ పట్టణానికి చెందిన 114 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి చాంపియన్‌గా నిలిచినట్లు తెలిపారు. బాలికల విభాగంలో దక్షిక, సహస్ర, సాయిశమీక్ష, అనన్య, జయశ్రీ, సాన్విక, విలసిని, బాయ్స్ విభాగంలో విహాన్, ఈశ్వర్ చంద్ర, నాగాక్షిత్, కతిక్, కౌషిక్, శ్రీయస్, శివాన్న్ష్, త్రీజల్, రణవీర్, సాయి చరణ్, విహాన్ మొత్తం 20 గోల్డ్ మెడల్స్ సాధించినట్లు తెలిపారు. వీరిని కరాటే మాస్టర్ అభినందించినట్లు తెలిపారు. -
కనులపండువగా పల్లకీసేవ
కౌడిపల్లి(నర్సాపూర్): రాములోరి పల్లకీసేవను కనుల పండువగా నిర్వహించారు. మండల కేంద్రం కౌడిపల్లిలోని శ్రీఅభయ సీతారామాలయం 33వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం పల్లకీసేవ గ్రామ సర్పంచ్, జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాకారులు వివిధ రూపాల్లో నిర్వహించిన కళాప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్వేతమల్లికార్జున్గౌడ్, శ్రీనివాస్‌గుప్తా, ఆలయ కమిటీ సభ్యులు, భజన మండల సభ్యులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కంగ్టి(నారాయణఖేడ్): యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చౌకన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై దుర్గారెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మ గణపతి (28) మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి మద్యం తాగిన మత్తులో గొర్ల కొట్టంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. సైబర్ బాధితులకు రూ. 27లక్షలు అందజేత మెదక్‌జోన్: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా సైబర్ నేరస్తుల నుంచి రికవరీ చేసిన రూ.27,57,454 జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన 86 మంది బాధితులకు అందించామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 1,188 కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించారని తెలిపారు. అదుపుతప్పి కారు పల్టీ ఐదుగురికి స్వల్ప గాయాలు అక్కన్నపేట(హుస్నాబాద్): కారు అదుపుతప్పి పల్టీ కొట్టిన ఘటనలో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని జంజారాహిల్స్ తండా సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. కరీంనగర్ నుంచి కుందనవానిపల్లి గ్రామ శివారులోని ఓ తండాలో జరుగుతున్న వార్షికోత్సవానికి వెళ్తుండగా కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. -
కనులపండువగా మల్లికార్జునుడి కల్యాణం
అధిక సంఖ్యలో హాజరైన భక్తులుదుబ్బాక: దుబ్బాక మున్సిపల్ పరిధిలోని రేకులకుంట మల్లికార్జున స్వామి, మేడాలమ్మ, కేతమ్మల కల్యాణోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఒగ్గుపూజారుల ఆధ్వర్యంలో మధ్యా హ్నం మల్లన్న, మేడాలమ్మ, కేతమ్మల కల్యాణోత్సవం భక్తుల జయజయ నినాదాల మధ్య కనుల పండువగా నిర్వహించారు. తెల్లవారుజామునే దేవతామూర్తుల ఒగ్గు ప్రార్థనలతో మేల్కొలుపు, పంచామృతాలతో మహాభిషేకం, స్వామి, అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. ఎల్లమ్మ జమదగ్నిల కల్యాణోత్సవం మల్లన్న కల్యాణోత్సవం అనంతరం అక్కడే కొలువుదీరిన రేకులకుంట ఎల్లమ్మ జమదగ్నిల కల్యాణోత్సవం జరిగింది. కల్యాణోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో ఆలయం ఈఓ మారుతి, మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్ దంపతులు, ఒగ్గు పూజారులు, కౌన్సిలర్లు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
యువతతోనే దేశ భవిష్యత్
జిల్లా యువజన అధికారి రంజిత్రెడ్డిచేర్యాల(సిద్దిపేట): యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, యువత సన్మార్గంలో నడిస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని ఉమ్మడి జిల్లా యువజన అధికారి రంజిత్‌రెడ్డి అన్నారు. ఆది వారం మేరా యువ భారత్ సిద్దిపేట జిల్లా అనుబంధ వివేకానంద విజ్ఞాన్ సొసైటీ తాడూర్ ఆధ్వర్యంలో యువ మండల వికాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చేర్యాల, కొమురవెల్లి మండలాలకు చెందిన యువజన సంఘాల సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ చురుకుగా ఉన్న యువజన సంఘాలకు క్రీడా సామగ్రి అందించారు. ఈ కార్యక్రమంలో తాడూరు సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, ప్రోగ్రాం అధికారి కిరణ్ కుమార్, బాల భాస్కర్, ఉపసర్పంచ్ నరేశ్, ఈరు పవన్, రాజశేఖర్ రెడ్డి, రాజు, స్వామి, సుజిత్, బాబు, రాజేశ్ పాల్గొన్నారు. -
మహిళకు అరుదైన శస్త్రచికిత్స
తూప్రాన్: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళకు ఆదివారం అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సుమారు రెండు కిలోల గర్భాశయ ఫైబ్రాయిడ్ కణితిని తొలగించారు. వివరాలు ఇలా.. మండలంలోని దాతర్‌పల్లికి చెందిన బోసబోయిన లక్ష్మి కొంత కాలంగా తీవ్ర కడుపునొప్పి, రక్తహీనత సమస్యలతో బాధ పడుతుంది. పట్టణంలోని సుష్మ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించగా, ఆమె గర్భాశయంలో భారీగా పెరిగిన ఫైబ్రాయిడ్ కణితి ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు. రోగికి అరుదైన ‘బి నెగిటివ్’ రక్తగ్రూప్ ఉండటం వల్ల చికిత్సలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమె ఇద్దరు కుమారుల రక్తగ్రూప్ సరిపోవడంతో అవసరమైన రక్తాన్ని సమకూర్చి శస్త్రచికిత్సకు సిద్ధం చేశారు. ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను డాక్టర్ హేమరాజ్ సింగ్, డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ తిరుపతి, డాక్టర్ ప్రదీప్ సింహ బృందం రెండు గంటలపాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స ద్వారా రెండు కిలోల బరువున్న ఫైబ్రాయిడ్ గడ్డను తొలగించినట్లు డాక్టర్ ప్రదీప్ సింహ తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకునే అవకాశముందని వైద్యులు తెలిపారు. -
తల్లిదండ్రులను చంపుతామని బెదిరింపులు
మద్యం తాగి వేధిస్తున్న కుమారులపై కేసుదుబ్బాకటౌన్: నిత్యం మద్యం తాగి వచ్చి, తల్లిదండ్రులను తిడుతూ, చంపుతామని బెదిరిస్తున్న కుమారులపై కేసు నమోదైంది. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ రాజేశ్ వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన కంచం కనకయ్య, రాజవ్వ దంపతులకు కుమారులు నరేశ్, స్వామి, ఎల్లం, ఒక కుమార్తె కవిత ఉన్నారు. వీరికి ఒక ఇల్లుతో పాటు 6 ఎకరాల భూమి ఉంది. రెండో కొడుకు స్వామి, మూడో కొడుకు ఎల్లం ప్రతిరోజూ మద్యం తాగి తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ, ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని, లేదంటే చంపుతామని బెదిరిస్తున్నట్టు తల్లిదండ్రులు వాపోయారు. గతంలో ఇలాంటి బెదిరింపులకు పాల్పడగా అప్పటి సీఐ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలో వారి వేధింపులు భరించలేక, ప్రాణభయంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం నాలుగు రోజుల క్రితం సిద్దిపేటకు వెళ్లి, అక్కడి రోడ్లపై నివాసమున్నారు. రెండు రోజుల క్రితం వారు స్థానికుల సహాయంతో సిద్దిపేట సీపీ కార్యాలయంలో కొడుకుల వేధింపులపై ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ సాధన రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు ఆదివారం దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో సీఐ రాజేశ్, ఎస్సై కీర్తి రాజు ఆధ్వర్యంలో కుమారులను పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లిదండ్రులను వారింటికి చేర్చారు. తల్లిదండ్రులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కుమారులను హెచ్చరించారు. సీపీ ఆదేశాల మేరకు ముగ్గురు కుమారులపై, కుమార్తైపె కేసు నమోదు చేశారు. -
ఎండుతున్న పంటలు
హత్నూర (సంగారెడ్డి): రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వేసిన వరి పంట కళ్ల ముందే ఎండిపోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. మండలంలో ప్రస్తుతం 23,500 ఎకరాల్లో వరి సాగు చేశారు. కాగా సుమారు 5వేల ఎకరాలకు పైగా పంటలు ఎండు ముఖం పట్టాయి. ఎండలు తీవ్రం కావడం, బోర్ల నీరు రాకపోవడంతోపాటు కరెంటు సక్రమంగా లేక తరచూ బోరు మోటార్లు కాలిపోతున్నాయి. దీంతో వరి పంటలు ఎండిపోతున్నాయి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు పంట చేతికొచ్చే సమయానికి పంట ఎండిపోతుంటే ఏమి చేయాలో తెలియక రైతన్నలు తల్లడిల్లుతున్నారు. మండలంలోని హత్నూర, పన్యాల, సిరిపురం, గిరిజన తండాలతోపాటు పలు గ్రామాల్లో పంటలు తీవ్రంగా ఎండిపోతున్నాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఎండిపోయిన పంటలను అధికారులు గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని పలు గ్రామాల అన్నదాతలు కోరుతున్నారు. అడుగంటిన భూగర్భ జలాలు ఆందోళనలో రైతన్నలు -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..
ఇద్దరికి స్వల్ప గాయాలు పటాన్చెరు టౌన్: జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనగా.. ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన పటాన్చెరు పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... ఇస్నాపూర్ శివారు సాంఘీక సంక్షేమ వసతి గృహం మలుపు వద్ద కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సును యాదగిరిగుట్టకు వెళ్తున్న సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో సంగారెడ్డి డిపోకు చెందిన బస్సులో ఉన్న ఇద్దరికి గాయాలు కాగా, కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్, పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. రైల్వే స్టేషన్ తనిఖీరామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను శనివారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, ఇతర వసతులపై సమీక్షించారు. పలు అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డా.ఆర్.గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. రాజీయే రాజమార్గం ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవిసిద్దిపేటకమాన్: లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని సిద్దిపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు రాజీ ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ..జాతీయ లోక్ అదాలత్‌లో 5,353 క్రిమినల్, 20 సివిల్, 11 మోటారు వాహన ప్రమాదం, 70 బ్యాంకు కేసులతో పాటు మొత్తం 5,454 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద కేసుల్లో రూ.92.26లక్షలు, బ్యాంకు పీఎల్సీ కేసుల్లో 30.32 లక్షలు పరిష్కరించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోష్‌కుమార్, సాధన,తరుణి, సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, లక్ష్మీబాబు, సైదా, న్యాయవాదులు పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి కల్హేర్(నారాయణఖేడ్): రోడ్డు నిర్మించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ఆరోపించారు. శనివారం సిర్గాపూర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నారాయణఖేడ్ నుంచి సిర్గాపూర్, మాసాన్‌పల్లి రోడ్డు నిర్మాణం పనుల కోసం తవ్వి అసంపూర్తిగా వదిలేశారని మండిపడ్డారు. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రోషన్‌రెడ్డి, సంజీవరావు, మాధవరావు పాటిల్, మాజీ సర్పంచ్‌లు సంజీవరెడ్డి, బసిరెడ్డి, విజయ్‌కమార్, రవీందర్రావు, బాలజీ పాల్గొన్నారు.గుర్తుతెలియని వ్యక్తి మృతి సంగారెడ్డి క్రైమ్: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 25న ఉదయం 11 గంటల సమయంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని బ్లడ్ బ్యాంకు వద్ద గుర్తుతెలియని వ్యక్తి(55), అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆస్పత్రి సెక్యూరిటీ గార్డ్ గమనించి అత్యవసర వార్డుకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. సెక్యూరిటీ గార్డ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అతడు ప్రభుత్వ ఆస్పత్రి ఆవర ణలో గల దుకాణాల్లో భిక్షాటన చేసే వ్యక్తిగా గుర్తించారు. మృతుడి వయసు 50 నుంచి 55 ఏళ్లు ఉంటుందని, వివరాలు తెలిస్తే 87126 56718 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. -
దాబాల్లో మద్యం సిట్టింగులు
వట్పల్లి(అందోల్): మండలంలో దాబా హోటళ్ల నిర్వాహకులు కాసుల కోసం యథేచ్ఛగా సిట్టింగులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాబాల్లో కేవలం భోజన సదుపాయం మాత్రమే కల్పించాలి. కానీ మద్యం సిట్టింగులు నిర్వహిస్తున్నారు. అధికారులు పట్టించకోకపోవడంతో వారి వ్యాపారం మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులుగా వర్ధిల్లుతోంది. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నాయని చెబుతున్న అధికారులే నిలువరించలేకపోతున్నారని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన వట్పల్లిలో మెటల్కుంటకు వెళ్లే రహదారి పక్కనే మూడు దాబా హోటళ్లు ఏర్పాటు చేశారు. మద్యం విక్రయాలు, సిట్టింగులకు అనుమతి లేకపోయినా ఏర్పాటు చేశారు. మందుబాబులకు హోటళ్ల నిర్వాహకులు మద్యం బాటిళ్లను తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల సమన్వయంతోనే సిట్టింగ్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సంఘటన జరిగితే హడావిడి చేసే అధికారులు వీటిని నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎకై ్సజ్ ఎస్ఐ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా... దాబాల్లో మద్యం విక్రయించడం, తాగడం నిషిద్ధమని, ఎవరైనా దాబాల్లో మద్యం సిట్టింగులను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వట్పల్లిలో గల దాబా హోటళ్లలో మద్యం సిట్టింగులకు ఎటువంటి అనుమతులు లేవని తనిఖీలు చేసి బాధిత హోటళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. బార్లను తలపిస్తున్న వైనం పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు -
పెళ్లి విషయంలో మనస్తాపానికి గురై..
తొగుట(దుబ్బాక): యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని ఘణపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ రవికాంత్‌రావు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పులగూర్ల మల్లారెడ్డి కుమారుడు నరేందర్ (33) కు ఏప్రిల్ 2న వివాహం నిశ్చయమైంది. కాగా ఈ నెల 23న తొగుటకు చెందిన యువతితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ క్రమంలో పెళ్లి పనుల కోసం 27న అన్న నాగరాజుతో కలిసి సిద్దిపేటకు వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి 9.30 గంటలకు పశువులకు మేతవేసి వస్తానంటూ ఇంట్లో చెప్పి బావి వద్దకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో అర్ధరాత్రి వరకు కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం తెల్లవారు జామున కుటుంబీకులు వెళ్లి చూడగా ఎడల దుర్గయ్య బావి వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. పెళ్లి విషయంలో మనస్తాపానికి గురై ఉరేసుకున్నట్లు తెలిపారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.ఆత్మహత్య చేసుకున్న యువకుడు -
3 నెలల క్రితం కొడుకు.. ఇప్పుడు తండ్రి
నర్సాపూర్ రూరల్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా... నర్సాపూర్ పట్టణానికి చెందిన కూరగాయల వ్యాపారి సయ్యద్ గౌసోద్దీన్(పాషా) (62) ఈనెల 17న సాయంత్రం ఈదురు గాలులతో ఇంటి గోడ కూలి అతనిపై పడింది. దీంతో తీవ్ర గాయాలు కాగా అదే రోజు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం అతడు మృతి చెందాడు. మూడు నెలల క్రితం మృతుడు గౌసోద్దీన్ (పాషా) కుమారుడు సయ్యద్ క్రముద్దీన్ (23) స్నేహితులతో కలిసి కారులో గోవాకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ జనవరి 1న మృతి చెందాడు. మూడు నెలల వ్యవధిలో తండ్రి, కొడుకులు ప్రమాదానికి గురై మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు సయ్యద్ గౌసోద్దీన్ (పాషా) కు భార్య, కూతురు ఉన్నారు.వేర్వేరు ప్రమాదాల్లో మృతి -
కూతురి అల్లుడే నిందితుడు
మెదక్‌జోన్: వృద్ధ దంపతులపై దాడి చేసి, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగారాయి గ్రామానికి చెందిన తమ్మల సావిత్రి, అంజయ్య దంపతులకు ఐదుగురు సంతానం. కాగా వారి పెద్ద కూతురు కృష్ణవేణి తన కూతురును కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాసన్పల్లి గ్రామానికి చెందిన వరిగే వెంకట నారాయణకు ఇచ్చి పెళ్లి చేసింది. ప్రస్తుతం వీరు తూప్రాన్‌లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా ఏ పని చేయకుండా వెంకట నారాయణ జులాయిగా తిరుగుతున్నాడు. కాగా ఈ నెల 25న అతడు జంగారాయికి వచ్చాడు. ఈ క్రమంలో వృద్ధ దంపతుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలపై అతడి కన్ను పడింది. దీంతో ఎవరు గుర్తుపట్టకుండా ముఖానికి మాస్కు ధరించి ఇనుప రాడ్‌తో వృద్ధ దంపతుల తల పగులగొట్టి 4.5 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. కాగా శనివారం తూప్రాన్ బస్టాండ్‌లో వెంకట నారాయణ అనుమానాస్పదంగా కనిపించటంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా తానే దాడిచేసి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి ఆభరణాలతో పాటు ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసును ఛాలెంజ్‌గా తీసుకొని మూడు రోజుల్లో ఛేదించిన పోలీసులను ఎస్పీ శ్రీనివాసరావు జ్ఞాపికలు, నగదు రివార్డుతో సత్కరించాడు. ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణం రోడ్డు ప్రమాదాలకు కారణం డ్రైవర్ల నిర్లక్షమేనని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నా రు. అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని ఓ గార్డెన్లో డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించి ఆయన మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, ఫోన్ వినియోగం వంటి కారణాల వల్లే జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రాత్రి వేళల్లో డ్రైవర్ల చూపు సమస్యల కారణంగా సైతం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. అందుకోసం డ్రైవర్లలో చూపు సమస్యలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు. అలాగే పట్టణంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను ప్రారంభించారు. వృద్ధ దంపతులపై దాడి.. ఆభరణాల చోరీ కేసులో అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ -
కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి..
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్‌లో చోటు చేసుకుంది. శనివారం ఎస్ఐ హరీశ్ తెలిపిన కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఆరుగొండ నాగార్జున (35) స్థానికంగా పంచర్ షాపు నిర్వహిస్తూ భార్య మల్లిక, కూతురును పోషిస్తున్నాడు. ఈ నెల 27న పంచర్ షాపునకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అప్పుడప్పుడు నాగార్జున రాత్రి ఫూట షాపులోనే నిద్రపోయేవాడు. అదే రోజు కూడా అక్కడే పడుకోవచ్చని కుటుంబ సభ్యులు భావించారు. శనివారం తెల్లవారు జామున నాగార్జున కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం గ్రామ శివారులోని పెద్ద చెరువులో అతడి మృతదేహం గ్రామస్తులకు కనిపించింది. కాగా నాగార్జున ప్రతి రోజు కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు దగ్గరకు వెళ్లేవాడని, ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో పడి వ్యక్తి మృతి -
యువతి అదృశ్యం
గజ్వేల్‌రూరల్: తల్లి మందలించిందని యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని బీడీ కాలనీలో నివాసముండే స్పందన ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటుందని ఈనెల 24న తల్లి మందలించింది. దీంతో ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. మరుసటి రోజు 25న ఫోన్లో తన స్నేహితురాలితో మాట్లాడిన తర్వాత స్విచ్ఛాఫ్ చేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు విధులకు ఆటంకం.. అరెస్టుచేగుంట(తూప్రాన్): విధులకు ఆటంకం కల్గించి, భౌతిక దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి రైల్వేగేటు సమీపంలో రాంగ్ రూట్లో మెదక్ వైపు నుంచి వచ్చిన కారు రైల్వే గేటు వద్ద అడ్డుగా నిలుపడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఉండటంతో సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో తూప్రాన్ పట్టణానికి చెందిన కారు డ్రైవర్ ఎరువ విజయ్‌కృష్ణ కానిస్టేబుల్‌పై దుర్బాషలాడుతూ చేయి చేసుకున్నాడు. అతడి స్నేహితులు పవన్, వంజరి బాలాజీ బ్లూకోట్స్ కానిస్టేబుల్ ట్యాబ్‌ను నేలకు కొట్టి ధ్వంసం చేశారు. దీంతో ముగ్గురి నిందితులపై కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ భూమి చదును వ్యక్తిపై కేసు నమోదు జోగిపేట(అందోల్): ప్రభుత్వ భూముల కబ్జాలకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని అందోలు ఇన్చార్జి తహసీల్దార్ మధుకర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన కమిషనర్ రవీందర్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందోలు శివారులోని శ్రీరంగనాథ స్వామి ఆలయ సమీపంలోని ప్రభుత్వానికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు చదును చేస్తున్న పనులను అధికారులు అడ్డుకున్నారు. పనులు చేయిస్తున్న ఎర్ర శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి, జేసీబీని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను ఎవ్వరూ కబ్జా చేసేందుకు ప్రయత్నించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని రవాణా చేసినా ఊరుకునేది లేదన్నారు. మందుబాబులకు జరిమానా సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమానా విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి వివరాల ప్రకారం... శుక్రవారం అర్ధరాత్రి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద, బైపాస్‌లోని గుర్రపుబొమ్మ, పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని శనివారం సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా మెదటి అదనపు న్యాయమూర్తి ఇద్దరికి రూ. 1500, మిగతా ఎనిమిది మందికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. -
డంప్ యార్డులో మంటలు
మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలోని మున్సిపల్ డంప్ యార్డులో మంటలు చెలరేగడంతో శుక్రవారం రాత్రి పట్టణమంతా పొగ కమ్మేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. శనివారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు ఫైర్ సిబ్బంది మున్సిపల్ ట్యాంకర్లతో డంప్‌యార్డులో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. సుమారు ఆరు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చా రు. ప్రస్తుతం పట్టణంలో పొగ వ్యాప్తి ఆగిపోయింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ రాధిక సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. నాలు గు ఫైర్ ఇంజన్లు, 15 మంది సిబ్బందితో శ్రమించి పూర్తిగా మంటలను అదుపుచేసినట్లు అగ్నిమాపక అధికారి వేణు తెలిపారు. ప్రతి ఏడాది ఇలాగే జరుగుతున్నా అధికారులు దృష్టి పెట్టడం లేదన్న విమ ర్శలున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పొగతో ప్రజల అవస్థలు ఆరు గంటలు శ్రమించి ఆర్పిన ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది -
దుంప పంటల సాగుపై శిక్షణ
జహీరాబాద్: దుంప పంటలు సాగు చేస్తే తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. కోహీర్ మండలంలోని సజ్జాపూర్ గ్రామంలో శనివారం దుంప పంటల సాగుపై రైతులకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వీర సురేశ్, కృష్ణవేణి, కుమార్ మాట్లాడుతూ.. దుంప పంటలను సాగు చేయడం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. చేమ గడ్డ, రత్నపురిగడ్డ, కంద గడ్డ సాగులో ఆధునిక పద్ధతుల గురించి చెప్పారు. అనంతరం రైతులకు దుంప పంటల విత్తనాలను పంపిణీ చేశారు. -
రన్ ఫర్ జీసస్ పోస్టర్ ఆవిష్కరణ
జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో ఏప్రిల్ 4న క్రిష్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. మెథడిస్ట్ సెంట్రల్ చర్చి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ఎంఆర్‌హెచ్‌ఎస్ స్కూల్ గ్రౌండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రిష్టియన్ యూత్ నాయకులు ఎర్రోళ్ల శివప్ప, స్టాలిన్, మార్క్, ప్రవీణ్, లవన్, యూదా, శాంతికుమార్, నాథన్, నరేశ్, ప్రమోద్, ప్రేమ్, పవన్, బన్ను, చింటూ, ప్రవీణ్, సంఘం పెద్దలు వినయ్‌కుమార్,ఆనందం,దేవదాస్,మోజెస్,వరాలు,మోహన్, రాంచందర్,మాణిక్‌రావు, రవీందర్ పాల్గొన్నారు. -
రాజీతోనే సమస్యల పరిష్కారం
లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: కలెక్టర్‌సంగారెడ్డి టౌన్: జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల పెండింగ్ కేసులకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర, కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ వేదికగా పెండింగ్‌లో ఉన్న వివాదాలను సులభంగా, వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఇరువర్గాలు పరస్పరం చర్చించుకుని రాజీకి రావొచ్చని తెలిపారు. దీంతో కోర్టు విచారణలు, దీర్ఘకాల న్యాయ ప్రక్రియల వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. చిన్న వివాదాలపై కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవడం కంటే పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గమని సూచించారు. పెండింగ్ కేసులను గుర్తించి, ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లు ప్రజలకు త్వరితగతిన, తక్కువ వ్యయంతో న్యాయం అందించే సమర్థవంతమైన వేదికలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
రైల్వే స్టేషన్ తనిఖీ
రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను శనివారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, ఇతర వసతులపై సమీక్షించారు. పలు అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డా.ఆర్.గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతులు సత్వరమే కల్పించాలి బీసీ సంక్షేమ జిల్లాధికారి జగదీష్ కంగ్టి(నారాయణఖేడ్): మండల కేంద్రం కంగ్టి లోని వెనుకబడిన సంక్షేమ వసతి గృహంలో మౌలిక వసతులు సత్వరమే కల్పించాలని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జగదీష్ సూచించారు. శనివారం ఆయన కంగ్టిలోని బీసీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల కోసం నిర్మిస్తున్న శౌచాలయాలు, నీటి సౌకర్యాల కల్పనలో గుత్తేదారు ఆలసత్వం వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు నాణ్యతగాను, వేగవంతం అయ్యేట్లు కృషి చేయాలని సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పండరీకి సూచించారు. వంటలు మెనూ ప్రకారం వండుతున్నారా అనే విషయం అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూంలో వంటలకు వాడుతున్న సామగ్రి, కూరగాయలు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ ఎండీ రహీమోద్దీన్, ఎస్సీ హాస్టళ్ల వార్డెన్లు సంతోష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మజ్జిగ పంపిణీ వట్పల్లి(అందోల్): పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం మండల పరిధి దేవునూర్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద మండల పీఆర్టీయూ శాఖ ఆధ్వర్యంలో పరీక్ష రాసే విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు వాడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షుడు దిగంబర్‌రావు, ప్రధానకార్యదర్శి నర్సింలు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీశైలం, విపుల్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
ఎంపీ రఘునందన్ రావుసంగారెడ్డి: ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధికారులను ఆదేశించారు. శనివారం శనివారం సీఎస్ఆర్ నిధులతో ఎన్టిపిసి సౌజన్యంతో డిజిటల్ ఎక్స్‌రే మిషన్‌ను అదనపు కలెక్టర్ పాండుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని మాతా శిశు కేంద్రం ఆయా వార్డులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో అన్ని శాఖలకు సంబంధించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లయితే రోగులందరికీ సులువుగా ఉంటుందని సూచించారు. పేద ప్రజలు మాత్రమే ప్రభుత్వాసుపత్రులకు వస్తారని, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందుతూ ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, సూపరింటెండెంట్ మురళీకష్ణ, సంబంధిత అధికారులు బీజేపీ నాయకులు కొండాపురం జగన్, డాక్టర్ రాజు గౌడ్, రమేష్, పట్టణ శాఖ అధ్యక్షుడు ద్వారక రవి తదితరులు పాల్గొన్నారు. కవిత, కాంగ్రెస్ ఒకటే.. కవిత కాంగ్రెస్ ఒకటేనని, ఆమె నూతన పార్టీ ఏర్పాటు చేస్తారని తాను ఏడాది క్రితమే చెప్పానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శనివా రం ఆయన సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడు తూ అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవుతుందని తాను అప్పుడే జోస్యం చెప్పానన్నారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని విమర్శించారు. -
ఆధునిక సాగుతో అధిక లాభాలు: వీసీ
ములుగు(గజ్వేల్): రైతులు ఆధునిక పరిజ్ఞానాన్ని సాగులో ఉపయోగించడం ద్వారా ఖర్చులు తగ్గి అధిక దిగుబడిని పొందవచ్చని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ రాజిరెడ్డి అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం పరిధిలోని షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కింద శనివారం రైతు విజ్ఞాన యాత్రను ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో ఉద్యాన పంటలకు మరింత ఆదరణ ఉంటుందని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా మేలైన వర్షాలతో రైతులు పత్తి, వరి పంటలను అధికంగా సాగు చేస్తున్నారని, ఎల్‌నినో నేపథ్యంలో అన్ని పంటలతో పోలిస్తే కూరగాయల సాగే తక్కువ నీటితో సాధ్యమన్నారు. గోదావరి, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పరిధిలోని భూములు సారవంతంగా, నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో కూరగాయల సాగు ఇంకా లాభదాయకమని వివరించారు. రైతులు రసాయనాలు తగ్గించి జీవన ఎరువులు తయారు చేసుకోవాలని సూచించారు. బిందు సేధ్యంతో తక్కువ నీటితో వేసవిలో సైతం ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేసుకోచ్చునని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో ముందుండాలి
మునిపల్లి(అందోల్): గ్రామాలు, కాలనీల అభివృద్ధిలో ముందుండాలని ఎంపీడీఓ ఆయా గ్రామాల ఉపసర్పంచ్, వార్డు సభ్యులను ఇన్చార్జి ఎంపీడీఓ అంజయ్య కోరారు. శనివారం మండలంలోని కంకోల్ రైతు వేదికలో వార్డు సభ్యుల హక్కులు, విధులు, బాధ్యతలు గ్రామాల అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు అవసరమయ్యే తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. కాలనీలలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ అండాళ్లు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
590 డబుల్ బెడ్రూం ఇళ్లు రద్దు..?
● ఈ గృహాల్లో నివాసముందడటం లేదని గుర్తింపు ● కొందరు అద్దెకు ఇచ్చినట్లు అధికారుల దృష్టికి.. ● రద్దు చేస్తామంటూ నోటీసులు ఇచ్చిన అధికారులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో లబ్ధిదారులకు కేటాయించిన సుమారు 590 డబుల్ బెడ్రూం గృహాలను రద్దు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఆయా లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ గృహాలను తీసుకున్నప్పటికీ ఆ లబ్ధిదారులు అందులో నివాసం ఉండటం లేదని, చాలా మటుకు తాళాలు వేసి ఖాళీగా ఉంచారని గుర్తించారు. అలాగే కొందరు లబ్ధిదారులు వీటిలో నివాసం ఉండకుండా ఇతరులకు అద్దెకు ఉంటున్నట్లు తేలింది. దీంతో వీటిని ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు పొందిన లబ్ధిదారుల వివరణను బట్టి రద్దుపై ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. రద్దు అయ్యే అవకాశాలున్న ఈ డబుల్బెడ్రూం గృహాల్లో అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం. వివిధ కారణాలతో నివాసముండని లబ్ధిదారులు గత ప్రభుత్వం డబుల్బెడ్రూం గృహాల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన విషయం విదితమే. అయితే ఇందులో భాగంగా కొల్లూరు–1లో 2,050 గృహాలు, కొల్లూరు –2లో 16,500 గృహాలను నిర్మించారు. భారీ టౌన్‌షిప్‌లోని గృహాలను గతంలో లాటరీ పద్ధతి ద్వారా అర్హులైన లబ్దిదారులకు గృహాలను కేటాయించారు. అయితే వివిధ కారణాలతో ఈ గృహాల్లో చాలా మంది నివాసం ఉండటం లేదు. ప్రధానంగా అక్కడ మౌళిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో ఈ గృహాల్లో ఉండటం లేదు. అలాగే హైదరాబాద్ నగరానికి దూరంగా ఉన్నాయి. దీంతో చిన్నాచితక ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు, కూలీ పనులకు వెళ్లే వారు నిత్యం కొల్లూరుకు వచ్చి వెళ్లడం ఇబ్బందిగా మారుతోంది. అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కూడా సమయానికి లేకపోవడంతో కొందరు అర్హులైన లబ్దిదారులు రాకపోకలు ఇబ్బందికి గురై ఈ గృహాల్లో ఉండటం లేదు. కొందరు అద్దెకు ఇచ్చారు. ఇలా నివాసముండని, అద్దెకు ఇచ్చిన ఇండ్లను రద్దు చేసి, అర్హులైన లబ్దిదారులకు కేటాయించాలని భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో విచారణ ఈ డబుల్బెడ్రూం గృహాల్లో కేటాయించిన లబ్ధిదారులే నివాసం ఉంటున్నారా? లేదా.? గుర్తించేందుకు విచారణ చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారుల బృందాలను నియమించారు. ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇలా నివాసముండని ఇండ్లు, అద్దెకు ఇచ్చిన ఇండ్లను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. అయితే సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే నివాస ముంటామని లబ్ధిదారులు వాపోతున్నారు. నిరుపేదలమైన తమకు ఇచ్చిన రద్దు చేయవద్దని కోరుతున్నారు. -
అమ్మకు అక్షరమాల శిక్షణ
● మహిళా సంఘాల సభ్యులకు నేడు పరీక్ష ● హాజరు కానున్న 28929 మంది సభ్యులు ● ఉదయం 9:30 నుండి సా.5 గం వరకు ● 480 పరీక్ష కేంద్రాల ఏర్పాటు సంగారెడ్డి జోన్: మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా అమలు పరుస్తున్నారు. చదువు రాని మహిళలను గుర్తించి చదువు నేర్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కొన్ని నెలలపాటు శిక్షణ కార్యక్రమాలు అందించి సాధారణ విద్యార్థుల మాదిరిగానే పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలలో 1,60,128 మంది సభ్యులు ఉన్నారు. 55,816 మంది మహిళలను నిరక్షరాస్యులుగా గుర్తించారు. మొదటగా 28,929 మంది మహిళలను ఎంపిక చేసి అక్షరాస్యులుగా మార్చేందుకు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసిన మహిళా సభ్యులు ఆదివారం నిర్వహించే ఎన్ఐఓఎస్ పరీక్షకు హాజరు కానున్నారు. పంచాయతీలకు చేరుకున్న మెటీరియల్ పరీక్ష కొరకు అవసరమయ్యే మెటీరియల్‌ను జిల్లా కార్యాలయం నుంచి గ్రామ పంచాయతీలకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 480 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, మహిళా సంఘాల భవనాలలో ఉన్న మౌలిక వసతుల ఆధారంగా కేంద్రాలను గుర్తించారు. పరీక్షకు హాజరయ్యే వారి వివరాలు నమోదు చేసుకొని అనంతరం పరీక్ష రాస్తారు. చదవడం, రాయడం, గణితంలలో ప్రశ్నలు ఉండగా.. వీటన్నింటికీ 150 మార్కులు కేటాయించారు. నాలుగు రూట్లుగా విభజించి జిల్లా ప్రాజెక్టు మేనేజర్లను రూట్లకు ఇన్చార్జిలుగా నియమించారు. డీఆర్డీఏ, విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షా నిర్వహణ ఉంటుంది. -
తల్లీ, ఇద్దరు పిల్లల అనుమానాస్పద మృతి
కంది(సంగారెడ్డి): తల్లీ, ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని జుల్కల్లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జుల్కల్కు చెందిన పట్నం ప్రవీణ్ (30)తో అల్లూరుకు చెందిన మమత(27) వివాహం 8 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి మణికంఠ (5), ప్రళయశ్రీ (2) అనే పిల్లలు ఉన్నారు. కాగా, గత జనవరి 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందాడు. దీంతో పిల్లల పోషణ భారం మమతపై పడింది. అప్పటినుంచి మమత మానసికంగా బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇరుగు పొరుగువారు పిలిచినా పలకక పోవడంతోపాటు తలుపులు తెరవలేదు. అనుమానం వచ్చి వారు తలుపులను బలవంతంగా తెరిచి చూడటంతో మమత చీరతో దూలానికి ఉరివేసుకొని మృతి చెందగా, పిల్లలు ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు. పిల్లల గొంతు భాగాల్లో గాయాలు ఉన్నట్లు గుర్తించారు. భర్త మరణంతో కలిగిన మానసిక వేదనతో మమత తన పిల్లలను గొంతు నులిమి చంపి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీ సత్యయ్య గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. -
సెల్ ఫోన్ దొంగల ముఠా అరెస్ట్
● 25 ఖరీదైన ఫోన్లు స్వాధీనం అనంతగిరి: జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్లలో ఖరీదైన సెల్ ఫోన్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను జిల్లా సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.3.75 లక్షల విలువ చేసే 25 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ చోరీ కేసులు ఎక్కువ కావడంతో ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశాలతో సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వికారాబాద్, బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సెల్ ఫోన్ దొంగతనం కేసులపై దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుల కదలికలను గుర్తించారు. చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని సభ్యుడు కే.రవి అలియాస్ గౌరి(డోన్ మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్)ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రవితోపాటు ఐదుగురు పెద్దరు, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలతో దొంగతనాలు చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ ముఠా సభ్యులు ఆటోలు, బైక్‌లపై తిరుగుతూ, రద్దీ మార్కెట్లలో ఖరీదైన సెల్ ఫోన్లను మైనర్లతో దొంగతనం చేయించేవారు. చోరీలకు పాల్పడుతున్న కే.రవితోపాటు బి.మహేష్, వడ్డె మురళి, వడ్డె వెంకటేష్ (మహబూబ్ నగర్ జిల్లా), ఆకుల కార్తీక్, సంపంగి తిరుపతి(హైదరాబాద్)ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ మాట్లాడుతూ.. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ టీం, వికారాబాద్ పోలీసులను అభినందించారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ టౌ న్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్, సీసీఎస్ ఎస్ఐ రమేష్, సిబ్బంది రాజు, రామకృష్ణ, రవీందర్, రమేష్, మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే..
మెదక్‌జోన్: ఈ రెండు ప్రమాదాల్లోనూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడంతోనే తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా జరుగుతున్న ప్రమాదాల తీరును గమనించిన పోలీసులు ఓవైపు నుంచి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎంత మొత్తుకుంటున్నా వాహనదారుల చిన్నపాటి నిర్లక్ష్యం వారి ప్రాణాల పాలిట యమపాశంగా మారుతోంది. దీంతో ప్రమాదాలు జరిగినా ప్రాణం పోకూడదనే లక్ష్యంతో జనవరి నుంచి ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు కొనసాగే ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు ఆరురోజుల పాటు రోడ్డు ప్రమాదాల నివారణపై ‘అరైవ్–అలైవ్’కార్యక్రమాలు నిర్వహించాలని పోలీస్, రవాణశాఖ అధికారులకు షెడ్యూల్‌ను ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 31 బ్లాక్స్పాట్లు గుర్తింపు జిల్లా మీదుగా వెళ్లే నాలుగు జాతీయ రహదారుల్లో 31 చోట్ల ట్రాఫిక్ పోలీసులు బ్లాక్స్పాట్లను గుర్తించారు. అందులో ఎన్‌హెచ్ 44పై 16 చోట్ల, ఎన్‌హెచ్ 161పై 3 చోట్ల, ఎన్్హెచ్ 161 ఏఏపై రెండుచోట్ల, ఎన్‌హెచ్ 765డీపై 10 చోట్ల మొత్తం 31 ప్రమాద స్థలాలను గుర్తించారు. ఆ ప్రదేశాల్లో ప్రమాదాల నివారణ కోసం రేడియం స్టిక్కర్లు వేయటం, లైటింగ్ ఏర్పాటు, రోడ్డు కనిపించకుండా అడ్డుగా ఉన్న చెట్లను తొలగించటంతోపాటు ఆ ప్రాంతంలో ప్రమాదాల నివారణకు పోలీస్, ఎన్హెచ్శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నారు. డ్రైవర్లకు నేత్ర పరీక్షలు..కళ్లద్దాల పంపిణీ భారీ వాహనాలు, బస్సులు, లారీలు, ఇతర గూడ్స్ వాహనాలు నడిపే 491 మంది డ్రైవర్లకు పోలీసులు కంటిపరీక్షలు నిర్వహించారు. వారిలో 193 మందికి కంటి సమస్య ఉన్నట్లు గుర్తించి చికిత్సలు చేయించారు. మరో 73 మందికి కళ్లజోళ్లను అందించారు.ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ.. విస్తృత అవగాహన కల్పిస్తున్న పోలీస్‌శాఖ ఫిబ్రవరిలో మెదక్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి తన స్నేహితుడితో కలిసి కారులో మెదక్ వస్తుండగా రాంపూర్ శివారులో చెట్టును ఢీకొట్టడంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతను సీటు బెల్టు పెట్టుకుని ఉంటే ప్రమాదం జరిగిన వెంటనే బెలూన్ ఓపెన్అయి బతికే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నెల 14న హవేళిఘనాపూర్ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన ఓ తండ్రి, అతడి కొడుకు, అల్లుడు ఒకే ద్విచక్రవాహనంపై మెదక్–నర్సాపూర్ జాతీయరహదారిపై ప్రయాణిస్తూ కొల్చారం మండలం రాంపూర్ శివారులో ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ హెల్మెట్ ధరించి ఉన్నా ప్రాణాలతో బయటపడేవారు.రూల్స్ పాటించకే ప్రమాదాలు రోడ్డు ప్రమాదాల్లో 95% ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవటం వల్లే జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకోవాలి. ఇప్పటికే పలుదఫాలుగా అవగాహన కల్పించాం. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు మరో 6 రోజులపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం. శ్రీనివాస్‌రావు, ఎస్పీ మెదక్ -
ఇక్రిశాట్ సందర్శించిన ఉత్తమ మహిళా రైతులు
జహీరాబాద్: జిల్లాకు చెందిన 50 మంది ఉత్తమ మహిళా రైతులు శుక్రవారం పటాన్‌చెరులోని ఇక్రిశాట్ను సందర్శించారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జహీరాబాద్ ప్రాంతానికి చెందిన మహిళా రైతులు క్షేత్రపర్యటనకు వెళ్లారు. ఇక్రిశాట్ ఫౌండేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ఆహ్వానం మేరకు రైతులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ హిమాంశు పాఠక్ మాట్లాడుతూ...వ్యవసాయంలో మహిళా రైతుల పాత్ర కీలకమైందన్నారు. తమ సంస్థ మహిళా రైతుల అభ్యున్నతికి చాలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమం ద్వారా వ్యవసాయంలో అనేక నూతన వంగడాలు, ఆధునిక పద్ధతుల గురించి ఇక్రిశాట్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిశోధనల గురించి మహిళా రైతులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్, సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్ ఉద్యాన విస్తరణ అధికారులు సునీత, రవి, విఠల్, అరణ్య, ప్రతినిధి కిష్టయ్య, బిడకన్నె, రాయిపల్లి, సింగితం, జహీరాబాద్ ప్రాంత మహిళా రైతులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి సందర్శనలో పరిశోధనలపై అవగాహన -
మెథడిస్ట్ చర్చి ఆస్తులను పరిరక్షిస్తాం
● కమిటీ సభ్యుల స్పష్టీకరణ ● లీజుకు ఇచ్చే ప్రయత్నాలకు అభ్యంతరం జహీరాబాద్: మున్సిపల్ పరిధిలోని అల్లీపూర్లో గల మెథడిస్ట్ చర్చి ఆస్తులను పరిరక్షించుకుంటామని బీజీ గార్డెన్ మెమోరియల్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చి సొసైటీ సభ్యులు స్పష్టం చేశారు. శుక్రవారం చర్చి ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మిషనరీ ప్రతినిధుల జోక్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మెథడిస్ట్ చర్చి కింద 65 ఎకరాల భూమి ఉందని, ఈ భూమిని లీజు పేరిట అక్రమాలకు చోటు కల్పించేందుకు మిషనరీ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లీజుకు సమ్మతించబోమన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో పేదరికంతో అనేక మంది విద్యకు దూరం అవుతున్నందున బీజీ గార్డెన్దొర 1931లో పాఠశాలను ప్రారంభించారన్నారు. ఎందరో విద్యనభ్యసించి ఉన్నత స్థితికి చేరారని గుర్తు చేశారు. విదేశీ నిధులతో విద్యాసంస్థను నిర్వహించారన్నారు. అంతే కాకుండా ఆస్తులను సైతం సమకూర్చారన్నారు. మిషనరీ ప్రతినిధులు దీన్ని మిషనరీల కిందకు చేర్చి ఆస్తులను 60 నుంచి 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే స్థానిక కమిటీ సభ్యులు అడ్డుకోడం జరిగిందన్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో లీజు పేరిట ఆస్తులన్నీ కరిగిపోయినట్లు గుర్తు చేశారు. ఇక నుంచి కూడా చర్చి వ్యవహారంలో మిషనరీ ప్రతినిధులు జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. అన్ని కార్యకలాపాలు, వ్యవహారాలన్నింటిని స్థానిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలోనే సాగుతాయన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు టి.వినయ్‌కుమార్, ఎన్.మోసెస్, ఎం.శాంతికుమార్, ఎ.సత్యానందం, బి.దేవిదాస్, ఇజ్రాయిల్ బాబీ, ఎన్.జనార్దన్, జోసెఫ్ స్టార్లిన్, జేమ్స్, ఉల్లాస్, జగన్నాథ్, ప్రమోద్ పాల్గొన్నారు. -
జూదం ఆడుతున్న ఏడుగురిపై కేసు
నగదుతోపాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం పాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటలో జూదం ఆడుతున్న ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారివద్ద నుంచి రూ.18,500 నగదుతోపాటు ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేటలోని రామారపోల్ల తోటలో కొందరు బొమ్మ బోరుసు ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా జూదం, బెట్టింగులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ● తాళం వేసిన ఏడు ఇళ్లలో చోరీ ● నగదు, బంగారం, వెండి అపహరణ ● ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తాండూరు రూరల్: మండలంలోని చింతమణిపట్నం గ్రామంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. తాళం వేసిన ఏడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. నగదు, బంగారం, వెండి అపహరించారు. బైక్‌పై వచ్చిన దొంగలు మూతికి మాస్క్‌లు ధరించినట్లు సీసీ టీవీ ఫుటేజీలో నమోదైంది. ఘటనా స్థలాన్ని పోలీసులు, క్లూస్ టీం సభ్యులు సందర్శించి వివరాలు సేకరించారు. ఎస్ఐ వినోథ్ రాథోడ్, బాధితుల కథనం మేరకు.. గ్రామ శివారులో గోవర్ధన్‌రెడ్డికి చెందిన కిరాణా దుకాణం ఉంది. దొంగలు షాపు తాళం పగులగొట్టి ఫ్రిడ్జ్‌లోని బీర్లు తాగారు. ఆ తర్వాత కుర్వ పెద్ద మల్లప్ప, కుర్వ చిన్న మల్లప్ప, కప్పలి లాలమ్మ ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. అనంతరం గౌడి విజయమ్మ ఇంట్లో వెండి అపహరించారు. బొంబాయి రామామ్మ, హరిజన్ వెంకటప్ప, జీవికొండ లక్ష్మప్ప ఇళ్ల తాళాలు విరగొట్టి వస్తువులు చిందరవందరగా పడేశారు. గోవర్ధన్‌రెడ్డి ఇంట్లో రూ.7 వేల నగదు, హరిజన్ వెంకటమ్మ ఇంట్లో అర తులం బంగారం ఎత్తుకెళ్లారు. క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేశారు. -
చికిత్స కోసం వస్తే చితకబాదారు
పరిగి: కుమారుడి వైద్యం కోసం వస్తే ఆస్పత్రి యాజమాన్యం తండ్రిపై దాడి చేసింది. ఈ ఘటన పరిగి పట్టణంలోని బాలాజీ హాస్పిటల్లో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సయ్యద్‌పల్లికి చెందిన నవీన్ కుమారుడు నిహాన్ష్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఈ నెల 19న చికిత్స నిమిత్తం పరిగి పట్టణంలోని బాలాజీ ఆస్పత్రికి వచ్చారు. నిహాన్ష్ను పరీక్షించిన వైద్యులు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యిందని అడ్మిట్ చేసుకున్నారు. చికిత్స అనంతరం ఇంటికి పంపారు. శుక్రవారం చికిత్స నిమిత్తం మళ్లీ ఆస్పత్రికి వచ్చారు. టోకెన్ తీసుకొని లైన్లో ఉండగా నిహాన్ష్కి మూడు సార్లు వాంతులు అయ్యాయి. దీంతో తండ్రి నవీన్ డాక్టర్ వద్దకు పంపాలని అక్కడి సిబ్బందిని కోరాడు. వాళ్లు నిరాకరించారు. మెడికల్ షాపులో ఉన్న యాజమాన్యాన్ని ప్రాధేయపడ్డాడు. మేము మందులు ఇస్తాము లైన్లోనే వెళ్లాలని వారు సూచించారు. దీంతో బాధితులు.. యాజమాన్యం మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో రోగి తండ్రి నవీన్‌పై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఈడ్చుకెళ్లి రూమ్‌లో బంధించి చితకబాదారు. బూతులు తిడుతూ చంపేస్తామని బెదిరించారు. దీంతో నవీన్ గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. వారు ఆస్పత్రికి చేరుకొని యాజమాన్యాన్ని నిలదీశారు. అనంతరం ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. తమపై దాడి చేసిన ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
ఆదర్శ రాజు శ్రీరాముడు
మాధవానంద సరస్వతి స్వామి తొగుట(దుబ్బాక): మండలంలోని పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాంపురం కోటిలింగాల దేవాలయంలో ఆలయ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ధర్మానికి కట్టుబడిన మహానుభావుడని కొనియాడారు. సత్యం, కర్తవ్యమే పరమావధి అని చాటిన ఆదర్శరాజు శ్రీరాముడని చెప్పారు. ప్రతిఏటా నిర్వహించే సీతారాముల కల్యాణం ఆధ్యాత్మిక ఉత్సవమని తెలిపారు. ప్రజలు భక్తి నైతిక విలువులు ధర్మబద్దత పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం స్వామి వారి పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. 5న హిందూ సమ్మేళన్ తాండూరు టౌన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాల విజయగాథను గుర్తు చేసుకునేందుకు ఏప్రిల్ 5న పట్టణంలోని ఆదర్శ తులసీ నగర్, సాయిపూర్లలో హిందూ సమ్మేళన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు ముదెళ్లి అశోక్ తెలిపారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. హిందూ సమాజం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకితభావం వంటివి వికసించేందుకు హిందూ బంధువులందరినీ సమ్మేళనం చేస్తున్న ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా తరలిరావాలని కోరారు. 5వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి పాతకుంటలోని పెద్ద పార్కుల స్థలంలో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. బైక్‌పై వెంబడించి.. గోవులను కాపాడి షాద్‌నగర్‌రూరల్: అక్రమంగా గోవులను తరలిస్తు న్న కంటైనర్లను హిందూవాహిని, బజరంగ్దళ్ సభ్యులు పట్టుకున్నారు. బైక్‌పై వెంబడించి గోవు లను అక్రమంగా తరలిస్తున్న మూడు కంటైనర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. శ్రీరామనవమి సందర్భంగా హిందూవాహిని సభ్యులు గురువారం అర్థరాత్రి పట్టణంలోని ముఖ్యకూడలిలో తోరణాలు కడుతున్నారు. అదే సమయంలో మూడు కంటైనర్లు వెళ్తున్నాయి. అనుమానం వచ్చిన వారు కంటైనర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా డ్రైవర్లు వాహనాలను ఆప కుండా అతివేగంగా వెళ్లారు. దీంతో అనుమానం వచ్చిన హిందూవాహిని, బజరంగ్దళ్ సభ్యులు ద్విచక్రవాహనాలతో వెంబడించి రెండు కంటైనర్లను పట్టుకోగా ఒక కంటైనర్ వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. పట్టుకున్న రెండు కంటైనర్లలో చూడగా అందులో 48 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. గోవులను వెంటనే చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలోని శ్రీకృష్ణ గోశాలకు తరలించారు. విషయం తెలియడంతో మరో వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు గోశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ సీతారాం తెలిపారు. హత్నూర(సంగారెడ్డి): ప్రమాదవశాత్తు చెరువులో పడి మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన హత్నూరలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామే సత్యనారాయణ (46) బుధవారం సాయంత్రం గ్రామ శివారులోని చాకిచెరువు వద్ద చేపల కావలికి వెళ్లాడు. గురువారం తిరిగి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం తెల్లవారుజామున చాకిచెరువులో సత్యనారాయణ శవమై తేలాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. -
పెళ్లి రద్దు అయ్యిందని..
వెల్దుర్తి(తూప్రాన్): నిశ్చితార్థం జరిగినా పెళ్లి రద్దు కావడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఏదులపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి సుగుణ, శ్రీహరి దంపతుల కుమారుడు విజయ్‌కుమార్‌కు మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ఓ యువతితో ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబసభ్యులు కలిసి ఏప్రిల్ 10న పెళ్లి నిర్ణయించి లగ్నపత్రికలు రాసుకున్నారు. కాగా కొద్దిరోజుల నుంచి అమ్మాయి ఫోన్ తీయకపోవడంతో రెండు రోజుల క్రితం ఆమె పనిచేస్తున్న మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్దకు వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో మాటామాట పెరగడంతో గురువారం ఇరు కుటుంబాల మధ్య పంచాయితీ జరిగింది. అమ్మాయి కుటుంబీకులు పెళ్లికి నిరాకరించి రద్దు చేశారు. దీంతో కలత చెందిన విజయ్‌కుమార్ గురువారం మధ్యాహ్నం వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. పెళ్లీడుకొచ్చిన కొడుకు జీవచ్ఛంలా మారడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మద్యం మత్తులో పెట్రోల్ తాగి.. దుబ్బాక: మద్యం మత్తులో పెట్రోల్ తాగి యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.దుబ్బాక మండలం పెద్దచీకోడ్కు చెందిన ఎండీ.ఫయాజ్(22) అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 16న మద్యం మత్తులో తన బైక్‌లో ఉన్న పెట్రోల్‌ను తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దుబ్బాక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. మృతుడి బాబాయ్ ఫరూక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
స్మార్ట్ ఫోన్ల పాత్ర కీలకం
● సెంటర్ ఫర్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ తేజస్విని నిరంజన పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని ఆంగ్లం, ఇతర భారత విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ సాన్నిహిత్యం, అంతర్–ఆసియాలో యువతులు అనే అంశంపై శుక్రవారం ప్రత్యేక ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని గీతంలోని సెంటర్ ఫర్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ తేజస్విని నిరంజన అందించారు. ఆసియా నగరాలైన హాంగ్ కాంగ్, సింగపూర్, గ్వాంగ్జౌ, బెంగళూరులలో ఆమె ఇటీవల జరిపిన బహుళ–ప్రాంతీయ పరిశోధన ఆధారంగా, నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల సంస్కృతులచే రూపుదిద్దుకున్న డిజిటల్ మాధ్యమం, యువతులు తమ గుర్తింపు, సంబంధాలు, ఆత్మీయతను నిర్వహించుకునే విధానాలను ఎలా మారుస్తుందో ప్రొఫెసర్ నిరంజన అన్వేషించారు. ప్రజా, వ్యక్తిగత జీవితాల మధ్య సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ, డిజిటల్ మాధ్యమాల ద్వారా సామాజికత ఆవిర్భావం, రోజువారీ అనుభవంలో స్మార్ట్ ఫోన్ల పాత్ర కీలకంగా మారడం వంటి అంశాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. -
శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026
అంతా రామమయంశ్రీ రామనవమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి రామ మందిరంలో మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కల్యాణం కనుల పండువగా జరిగింది. సంగారెడ్డి రామ్ మందిర్ ఆలయానికి రూ.2.50 కోట్ల విలువ చేసే ఆభరణాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు సమర్పించారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవంలో ఎమ్మెల్యే గూడెం యాదమ్మ మహిపాల్‌రెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థుల ఆశాకిరణం కొల్లూరి సత్తయ్య..
ఆదర్శంగా ‘అమృత సత్తయ్య కొల్లూరి’ ఎడ్యుకేషన్ సొసైటీ● వేలాది మందికి విద్యను అందిస్తూ.. ● దేశం వ్యాప్తంగా విద్యార్థుల ఎంపికరామచంద్రాపురం(పటాన్చెరు): పేదరికంతో చదువుకోలేని పరిస్థితి, కష్టాన్ని నమ్ముకుని ఎదిగిన మనిషి. కష్టానికి ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థ భెల్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తూ కార్మిక సంఘ నేతగా వారి సంక్షేమాన్ని కృషి చేశారు. అదే సమయంలో పేదరికంతో విద్యకు దూరమవుతున్న నిరుపేద విద్యార్థులకు అండగా నిలవాలనుకున్నారు కొల్లూరి సత్తయ్య. దాంతో తెల్లాపూర్ శివారులోని తన సొంత పొలంలో అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ(ఆస్క్)ను స్థాపించారు. కులమతాలకు అతీతంగా నిరుపేద విద్యార్థులను దేశవ్యాప్తంగా ఎంపిక చేసి వారికి అన్ని మౌలిక సదుపాయాలతో ఉచిత శిక్షణ అందిస్తూ విద్యాదాతగా ఆదర్శంగా నిలుస్తున్నారు.ఆంగ్ల భాషపై ప్రత్యేక శిక్షణ.. నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషలో పట్టుసాధిస్తేనే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందన్న లక్ష్యంతో కొల్లూరి సత్తయ్య పేద విద్యార్థులకు ఉచితంగా ఆంగ్ల భాషపై పట్టు సాధించే విధంగా నిపుణులతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. దాంతో విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి సంస్థలలో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఆధునిక సదుపాయాలతో విద్యాబోధన.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువునే విధంగా అన్ని వసతులను కల్పించారు. ప్రధానంగా కంప్యూటర్ ల్యాబ్,డిజిటల్ క్లాస్ రూమ్, ఓపెన్ థియేటర్, గ్రంథాలయం వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు విద్యతో పాటు వ్యక్తిగత వికాసం, ఆహార అలవాట్లు, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. సొంత పొలంలోనే విద్యాకేంద్రం నిరుపేదల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం తన వంతు బాధ్యతగా తన సొంత పొలంలో జనవరి 2022లో అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ(ఆస్క్) ఏర్పాటు చేశారు. విద్యార్థులకు విశాలమైన తరగతి గదులు, వసతి గదులు ఏర్పాటు చేసి దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రత్యేక శిక్ష ణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పేదరికం కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇక్కడ శిక్షణ అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఎంపిక.. కుల మతాలకతీతంగా దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ప్రధానంగా పేరుగాంచిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించే విధంగా ఇక్కడి అధ్యాపకులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఉల్లాసంగా ఉండేందుకు.. శిక్షణ పొందే విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. నిర్వాహకులు అందులో భాగంగా 5:30 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ప్రత్యేక షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నారు. విద్యార్థుల కోసం వ్యాయామశాల ఏర్పాటు చేశారు. యోగాపై శిక్షణ అందిస్తున్నారు. ప్రత్యేకంగా మెనూ ఏర్పాటు మనం వివిధ స్థాయిలలో ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పెంపొందించాలని నేను నమ్ముతాను. తద్వారా, బాధ్యతగల పౌరులుగా మనం రాజ్యాంగ విలువలను మరింత ప్రోత్సహించి, అమలు చేయగలం. అన్ని అసమానతలకు అతీతమైన సమాజాన్ని నిర్మించాలనే సామాజిక దృక్పథంతో నా చివరి శ్వాస వరకు దీనిని కొనసాగించాలనే లక్ష్యంతో నేను, నా కుటుంబ సభ్యులు, ఇక్కడున్న ఫాకల్టీలు కలసి పని చేస్తున్నాం. దేశ నిర్మాణం, సామాజిక మార్పుతోనే మొదలవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను, మరియు ఈ ప్రక్రియలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉంది. యువతరం సామాజిక సమస్యలతో ఎంతో చైతన్యవంతంగా బాధ్యతాయుతంగా మమేకమవుతుందనే దానిపైనే సమాజం మరియు దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. – కొల్లూరి సత్తయ్య, ఆస్క్ వ్యవస్థాపకులునేను ఇక్కడికి రాక ముందు పశ్చిమ బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ గురించి విన్నాను. కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. మా మణి సార్ చెప్పినట్టుగా, నిజమైన శాంతినికేతన్ మాత్రం మన అమృతవనమే. అమీర్‌పేట్ మైత్రివనం దిశలేని విద్యార్థి జీవితమైతే, ఈ అమృతవనం దిశ చూపించే ప్రేరణ, ఇక్కడ నేను ప్రకృతి మధ్య స్వేచ్చగా ఆలోచించడం నేర్చుకోవడం నేర్చుకున్నాను. జ్ఞానంతో అమృతమ్మ కుటుంబం చూపించిన ప్రేమ, ఆప్యాయతలు మా జీవితానికి విలువైన సంపద. వాటిని ఆచరించడం మా బాధ్యత. – స్వాతిక ద్యాగలి, విద్యార్ధిణిఆస్క్ బాధ్యతలు.. 1) కొల్లూరి సత్తయ్య అధ్యక్షులు 2) ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ ఉపాధ్యక్షులు 3) కొల్లూరి భరత్ ప్రధాన కార్యదర్శి 4) కొల్లూరి సౌజన్య కోశాధికారి 5) విజయ్, ఆర్.ఈశ్వర్ ప్రసాద్, యాదగిరి బోర్డు సభ్యులు 6) డా.బాలబోయిన సుదర్శన్ ఫ్యాకల్టీ, డైరెక్టర్ 7) పల్లికొండ మణికంఠ ఫ్యాకల్టీ, అకాడెమిక్ కోఆర్డినేటర్ 8) డా.నైనాల సతీష్, ప్రశాంత్ తివారీ ఇంగ్లిష్ ఫ్యాకల్టీలుఇది నిజమైన మరో శాంతినికేతన్సామాజిక మార్పుతోనే దేశ నిర్మాణం -
గొడవపడి ..బయటకు వెళ్లి..
కొండపాక(గజ్వేల్): రాజీవ్ రహదారి ప్రక్కన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన కుకునూరుపల్లి పోలీస్టేషన్ పరిధిలోని రాంచంద్రాపూర్ గ్రామపంచాయితీ శివారులో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మిరుదొడ్డి మండలంలోని పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన తలారి అంజయ్య(44) కుటుంబీకులు బతుకుదెరువు కోసం 7 నెలల కిందట హైదరాబాద్‌కు వెళ్లారు. కుటుంబపోషణ విషయంలో తరచుగా భార్యాభర్తలు గొడవపడుతుండేవారు. ఈ క్రమంలో భర్త అంజయ్య ఇంట్లో చెప్పాపెట్టకుండా బయటకు వెళ్లి రెండు మూడు రోజుల తర్వాత వచ్చేవాడు. ఈనెల 24న భార్యభర్తల మధ్య గొడవ జరగ్గా ద్విచక్ర వాహనంపై ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదన్నారు. కాగా, బుధవారం ఉదయం రాజీవ్ రహదారి ప్రక్కన మృతదేహం పడి ఉందని స్థానికుల నుంచి సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. పక్కనే ఉన్న పండ్ల విక్రయ దుకాణ దారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడు రాత్రి పూట ఎప్పుడో వచ్చి మక్క కంకుల విక్రయ కోసం వేసిన గుడిసెలో పడుకోగా ఉదయం గుడిసె యజమానురాలు వచ్చి నిద్రలోంచి లేపగా లేచిన కొద్దిసేపటికే అంజయ్య మృతి చెందాడు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు కుటుంబీకులకు సమాచారం అందించి మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ, ట్రైనీ ఐపీఎస్ అయేషా ఫాతిమా పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంవర్గల్(గజ్వేల్): వర్గల్ మండలం నాచారంగుట్ట ప్రాంతంలో పోలీసులకు గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గౌరారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నాచారంగుట్ట సమీపంలోని ఓ పాత ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 50 నుంచి 60ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నాచారంగుట్ట ప్రాంతంలో భిక్షాటన చేస్తున్నట్లు స్థానికులు పోలీసులకు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తు పట్టినట్లయితే గౌరారం పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతివెల్దుర్తి(తూప్రాన్): చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందిన ఘటన మండలంలోని అందుగులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నడిపొల్ల గోపాల్(40) మంగళవారం రాత్రి తన కుమారుడు మహేశ్‌తో కలిసి గ్రామ శివారులోని పెద్ద చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. కుమారుడి ద్వారా విష యం తెలుసుకున్న గ్రామస్తులు బుధవారం ఉద యం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టగా చెరువులో మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి -
ఒకేసారి మూడు రేషన్లు
సంగారెడ్డి క్రైమ్/హత్నూర (సంగారెడ్డి): మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో పనులు దొరకక ఇబ్బందులకు గురవుతున్న నిరుపేదలకు ఏప్రిల్ 1 నుంచి ఒకేసారి మూడు నెలల బియ్యం ఇచ్చేందుకు అధికారులకు ఏర్పాటు చేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ పరిధిలోని 855 రేషన్ దుకాణాల ద్వారా 4,42,746 మంది లబ్ధిదారులకు రేషన్ దుకాణాలకు సన్నబియ్యం అందనున్నాయి. బియ్యం నిల్వ చేసేందుకు అవసరమయ్యే భవనాలను సిద్ధం చేసుకోవాలని డీలర్లకు ఇప్పటికే అధికారులు సమాచా రం ఇచ్చా రు. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుండటంతో చాలామంది లబ్ధిదారులు బియ్యాన్ని తప్పకుండా తీసుకుని వాడుకుంటున్నారు. మూడు నెలల బియ్యం కోట సుమారు 28457.358 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. గ్రామాల్లో తలెత్తనున్న సాంకేతిక సమస్య ఒకేసారి మూడు నెలల కోట తీసుకోవాలంటే లబ్ధిదారుల నుంచి ఈ పాస్ మిషన్‌పై మూడుసార్లు బయోమెట్రిక్ లేదా ఓటీపీ ద్వారా బియ్యం ఇవ్వనున్నారు. సర్వర్ సమస్యలు తలెత్తితే ఒక కార్డు పూర్తి కావడానికి 10 నుంచి 15 నిమిషాల సమ యం పట్టే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారులు రెండు వారాలపాటు రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.ఇబ్బందుల్లేకుండా పంపిణీ చేస్తాం గతంలోలా కాకుండా ప్రస్తుతం కొత్తగా 64,235 కొత్త రేషన్ కార్డులు మంజూరు కావడంతో బియ్యం సరఫరా కోటాను పెంచాల్సి వచ్చింది. ముందుగా లబ్ధిదారులు ఈ కేవైసీ నమోదు చేసుకోవడం మరవద్దు. ఏప్రిల్ 1 నుంచి ప్రతీరోజు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి. ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీ ఒకరికి నెలకు 6 కిలోల చొప్పున మూడు నెలలకు 18 కిలోలు తీసుకోవాలి. – బాల సరోజ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఏప్రిల్ 1 నుంచి పంపిణీ లబ్ధి పొందనున్న 4,42,746 మంది -
పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన ఉండాలి
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పెద్దశంకరంపేట(మెదక్): గ్రామపంచాయతీ నూతన వార్డు సభ్యులు పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య సూచించారు. పెద్దశంకరంపేటలోని రైతు వేదికలో జరుగుతున్న వార్డు సభ్యుల రెండో విడత శిక్షణా శిబిరాన్ని, మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాలు అభివృధ్దిలో ముందుకు వెళ్లాలంటే వార్డు సభ్యుల పాత్ర కీలకమన్నారు. అనంతరం సిబ్బంది హాజరుశాతాన్ని పరిశీలించి, వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సూపరిండెంట్ షకీల్, ఎంపీఓ జాకీర్‌హుస్సేన్, జూనియర్ అసిస్టెంట్ కాశీరాం,మాస్టర్ ట్రైనర్లు పాషా,లింగప్ప,సోమేశ్వర్, ప్రవీణ్ తదితరులున్నారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడిహుస్నాబాద్రూరల్: జిల్లెలగడ్డ శివారులో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ముగ్గురుని పట్టుకున్నారు. ఈ దాడిలో మూడు సెల్ ఫోన్లు, బైక్, రూ.15వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి చేశారు. పట్టుబడ్డ ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి అరెస్ట్రిమాండ్కు తరలింపు అక్కన్నపేట(హుస్నాబాద్): పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కాశబోయిన రమేశ్ అనే వ్యక్తి ఓ వివాదంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులపై గొడవకు దిగాడు. పోలీసు విధులకు తీవ్ర ఆటంకం, శాంతిభద్రతలకు విఘాతం కలింగించేలా ప్రవర్తించడంతో నిందితుడు రమేశ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యక్తి బైండోవర్మిరుదొడ్డి(దుబ్బాక): ప్రభుత్వ ఉద్యోగులపై వాట్సాప్ గ్రూపులో దుర్భాషలాడటమే కాకుండా విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు మిరుదొడ్డి ఎస్ఐ సమత బుధవారం మీడియాకు వెల్లడించారు. మండల పరిధిలోని పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన అంకని బాలరాజు అనే వ్యక్తి వాట్సాప్ గ్రూపులో వ్యవసాయ అధికారులను ఉద్దేశించి దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టడంతోపాటు వారి విధులకు ఆటంకం కలిగించడంతో సదరు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలపై దాడిహుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని మేడిబావి గల్లీలో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడి చేసి గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ నింపుతున్నారనే సమాచారంతో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో అక్కన్నపేట మండలం కేశవాపూర్‌కు చెందిన వడ్డెపల్లి మోహన్ నుంచి ఫుల్ గ్యాస్ సిలిండర్, ఖాళీ సిలిండర్, 16 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పట్టణంలోని ప్రగతినగర్‌కు చెందిన ముద్రకోల శ్రీనివాస్ నుంచి రెండు నిండిన పెద్ద సిలిండర్లు, రెండు చిన్న సిలిండర్లను సీజ్ చేశారు. అనుమతుల్లేకుండా ప్రమాదకర రీతిలో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. పొదల్లో హుండీ ప్రత్యక్షంమద్దూరు(హుస్నాబాద్): మండలంలోని కూటిగల్ సమ్మక్క–సాలరమ్మ గద్దెల వద్ద గత నెలలో మాయమైనహుండీ బుధవారం స్థానిక పల్లె ప్రకృతివనంలో ప్రత్యక్షమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సమక్క–సారలమ్మ జాతర తిరుగుడువారం తర్వాత గద్దెల వద్ద ఏర్పాటు చేసిన హుండీని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కాగా,పల్లె ప్రకృతి వనంను శుభ్రం చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి హుండీ కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. ఇది దొంగల పనేన ని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. -
స్కూల్ వ్యాన్ బోల్తా
● విద్యార్థి, డ్రైవర్‌కు గాయాలు ● కర్ణాటకలో ఘటన న్యాల్కల్(జహీరాబాద్): న్యాల్కల్ మండలం సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటకలో స్కూల్‌వ్యాన్ బోల్తా పడిన ఘటనలో విద్యార్థితోపాటు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బుధవారం జరిగి ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని డప్పూర్, మల్గి తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుకునేందుకు హుస్సెళ్లి గ్రామ శివారులోని గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు వెళ్తుంటారు. యథావిధిగానే ఉదయం డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన విద్యార్థులతో వ్యాన్ పాఠశాలకు వెళ్తుంది. సరిగ్గా కర్ణాటకలోని అస్టూర్ వద్ద గల బ్రిడ్జిపైకి రాగానే అదుపు తప్పి పైనుంచి కిందికి పడిపోయింది. దీంతో ముందుభాగంలో కూర్చు న్న డప్నూర్కు చెందిన విద్యార్థి సాయిరాం(13)తోపాటు డ్రైవర్ జ్ఞానవరావుకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలో గల బీదర్ ఆస్పత్రికి తరలించారు. -
తీపెక్కిన చెరుకు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈసారి చెరుకు మరింత తీపెక్కింది. ఈ ఏడాది చెరుకు క్రషింగ్ సీజను ఆశాజనకంగా ముగిసింది. గతేడాది క్రషింగ్ సీజను కంటే ఈ సీజనులో ఏకంగా 2.55 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా క్రషింగ్ జరిగింది. 2024–25 సీజనులో 15.99 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ జరుగగా, 17.04 లక్షల క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి అయింది. 2025–26లో 18.54 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు క్రషింగ్ జరగగా 19.95 లక్షల క్వింటాళ్ల పంచదార ఉత్పత్తి అయింది. ఈమేరకు షుగర్ కేన్ కమిషనరేట్ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదికంటే ఏకంగా 15% అధికంగా చెరుకు క్రషింగ్ జరగడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 చక్కెర కర్మాగారాలున్నాయి. ఇందులో ప్రభుత్వ, సహకార రంగాల్లో ఉన్న ఐదు చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. సంగారెడ్డి, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఏడు షుగర్ ఫ్యాక్టరీల్లో ఈ సీజనులో చెరుకు క్రషింగ్ జరిగింది. ఏటా నవంబర్ మొదటి వారంలో చెరుకు క్రషింగ్ ప్రారంభమవుతుంది. మార్చి రెండో వారంతానికి ఈ సీజను ముగుస్తుంది. టన్నుకు రూ.3,826 చొప్పున ధర చెల్లింపు ఈసారి చెరుకు రైతులకు అత్యధికంగా టన్నుకు రూ.3,826 చొప్పున చెల్లించారు. చాలావరకు టన్నుకు రూ.3,600 నుంచి రూ.3,700 వరకు మాత్రమే చెల్లించాయి. అయితే ఈ చెరుకు ధరను పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సుధీర్ఘ పంట కాలానికి తోడు, పెరిగిన పెట్టుబడులు, కూలీల ఖర్చులు, కూలీల కొరత వంటి కారణంగా పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరుగుతోందని కనీసం టన్నుకు రూ.నాలుగు వేల నుంచి రూ.4,200 చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. షుగర్ రికవరీ(ఉత్పత్తి)ని బట్టి చెరుకు ధర నిర్ణయిస్తారు. ఈసారి అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలోని కొత్త షుగర్ ఫ్యాక్టరీ గోదావరి గంగా, కామారెడ్డి జిల్లాలోని గాయత్రీ షుగర్స్ 11% చొప్పున చక్కెర రికవరీ వచ్చింది. 8.25 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి షుగర్ ఫ్యాక్టరీల్లో చక్కెరతోపాటు, ఉప ఉత్పత్తుల్లో భాగంగా ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. ఈ సీజనులో సుమారు 8.25 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్‌లో కొంత శాతం ఇథనాల్‌ను కలిపి సరఫరా చేస్తున్న విషయం విదితమే. చక్కెరతోపాటు, ఇథనాల్ కూడా చక్కెర కర్మాగారాలకు కాసుల వర్షం కురిపిస్తోంది.ఈసారి 18.54 లక్షలమెట్రిక్ టన్నుల క్రషింగ్ గతేడాది కంటే 2.55 లక్షలుఎంటీలు అధికం 19.95 లక్షల క్వింటాళ్ల చక్కెర,8.25 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి రాష్ట్రంలో ముగిసిన క్రషింగ్ సీజను పంట విస్తీర్ణం పెరుగుతున్నందుకే.. ఈసారి చెరుకు సీజను ఆశాజనకంగా ఉండటానికి ప్రధాన కారణం ఈ పంట సాగు విస్తీర్ణం పెరగడమేనని షుగర్ కేన్ కమిషనరేట్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో చెరుకు సాగవుతోంది. అలాగే కామారెడ్డి, వనపర్తి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రైతులు ఈ చెరుకును సాగు చేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గతేడాది పత్తి పంట దెబ్బతింది. దీంతో చాలా మంది రైతులు పత్తికి ప్రత్యామ్నాయంగా చెరుకు వైపు మొగ్గు చూపారు. అలాగే ఆలుగడ్డ, అరటి పంటలకు ఆశించిన ధర దక్కలేదు. దీంతో ఈ పంట సాగు చేసే రైతులు కూడా ప్రత్యామ్నాయంగా చెరుకు వైపు మొగ్గు చూపారు. దీంతో ఈ పంట సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది 2024–25 సీజనులో రాష్ట్రవ్యాప్తంగా 14,102 ఎకరాల్లో ఈ పంట సాగు కాగా, ఈ ఏడాది ఈ పంట విస్తీర్ణం 18,092 ఎకరాలకు పెరిగింది. సుమారు 3,990 ఎకరాల్లో చెరుకు విస్తీర్ణం పెరిగింది. దీంతో క్రషింగ్ సీజను ఆశాజనకంగా మారిందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
కొండపాక(గజ్వేల్): గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్లే ఆరోగ్యవంతంగా ఉంటారని ఐసీడీఎస్ చేర్యాల ప్రాజెక్టు సీడీపీఓ రమాదేవి పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండలంలోని మేదినీపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో రిలయన్స్ ఫౌండేషన్, చైల్డ్ రైట్స్ అండ్ యూల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం నిర్వహించిన కళాజాత కార్యక్రమానికి రమాదేవి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్లే అలవాటును నేర్పుతున్నాయన్నారు. ఆటా పాటల ద్వారా పిల్లలు చదువుపై ఆసక్తిని పెంచుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండేలా ప్రతీ నెల బరువును తూకం వేస్తూ లోపాలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగేలా టీచర్లు కృషి చేస్తున్నారన్నారు. అంతకు ముందు కళాకారులు అంగన్వాడీ కేంద్రాల ఆవశ్యకతలు, ఫ్రీ స్కూల్ విద్య ప్రాముఖ్యతలపై నృత్యాలు, జానపద గేయాలు, నాటికల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మధుమోహన్, సీడీపీఓ రమాదేవి, సెక్టార్ సూపర్వైజర్ మాధవి, ఫౌండేషన్ ప్రతినిధులు భాస్కర్, నవత, గౌతమి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.ఐసీడీఎస్ చేర్యాల ప్రాజెక్టు సీడీపీఓ రమాదేవి -
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి
కౌడిపల్లి(నర్సాపూర్): ఉండేందుకు ఇల్లులేదు మేడం. టాపర్‌తో వేసుకున్న గుడిసెలో ఉంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ వెల్మకన్న గ్రామానికి చెందిన కయిత మహేశ్వరీ అనే మహిళ కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను ప్రాధేయపడింది. వెల్మకన్న గ్రామంలో రేషన్ దుకాణం తనిఖీ కోసం కలెక్టర్ రావడంతో విషయం తెలుసుకున్న మహేశ్వరి అక్కడకు చేరుకుని తన గోడు వెళ్లబోసుకుంది. తనకు ఇల్లులేదని భర్త శ్రీను, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ప్రస్తుతం టాపర్‌తో వేసుకున్న తాత్కాలిక గుడిసెలో ఉంటూ కూలీపనులు చేసుకుంటున్నామని వివరించింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సమయంలో తనకు రేషన్‌కార్డులేక ఇల్లు మంజూరు కాలేదన్నారు. ప్రస్తుతం కొత్తరేషన్‌కార్డు వచ్చిందని ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ తాను నివాసం ఉండే గుడిసె ఫొటో, రేషన్‌కార్డును కలెక్టర్‌కు చూపించి ప్రాధేయపడింది. దీంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించి అధికారులను వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ నవీన్, ఉపసర్పంచ్ ప్రభు ఉన్నారు.గుడిసె వద్ద భర్త, పిల్లలతో మహేశ్వరీ అప్పుడు రేషన్కార్డులేకమంజూరు కాలేదు ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది కలెక్టర్‌ను వేడుకున్న మహిళ -
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
రామాయంపేట(మెదక్): వరకట్న వేధింపులకు ఒక వివాహిత బలైన ఘటన మండలంలోని ప్రగతిధర్మారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి వడ్ల బ్రహ్మచారి, పోలీసుల కథనం మేరకు..గ్రామానికి చెందిన బ్రహ్మచారి కూతురు మమత(24)ను మూడేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం రామవరం గ్రామానికి చెందిన వడ్ల నరసింహాచారికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో తులంన్నర బంగారు ఆభరణాలతోపాటు రూ.లక్ష నగదు ఇచ్చారు. పెళ్లయిన ఏడాది వరకు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం మమతను అత్తింటివారి వేధింపులకు గురిచేస్తుండటంతో పుట్టింటికి వెళ్లగా ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పి పంపించారు. అయినప్పటికీ మమతపై వేధింపులు ఎక్కువ కావడంతో 15 రోజుల క్రితం మళ్లీ పుట్టింటికి వచ్చేసింది. అప్పట్నుంచి తరచూ తన కాపురం విషయమై బాధపడుతుండేది. ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో మమత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ బాల్‌రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్యతూప్రాన్: తల్లి మరణం తట్టుకోలేక కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘనపూర్‌లో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సబ్బని భాగ్యమ్మ అనారోగ్యంతో 15 రోజుల క్రితం మృతి చెందింది. దీంతో మనస్తాపం చెందిన కుమారుడు సబ్బని సంతోష్(40) బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలి మెదక్ కలెక్టరేట్: పెన్షన్ వ్యాలిడేషన్ చట్టంతో రిటైర్డ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం వెంటనే దానిని రద్దు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగదీష్ చంద్ర డిమాండ్ చేశారు. బుధవారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈచట్టంతో రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి 12 లక్షల మందికి భారీ నష్టం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. -
హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన
పటాన్చెరు: ప్రజావాణి ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం పటాన్చెరు, అమీన్పూర్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. పటాన్చెరు పరిధిలోని పాటి, ఘనాపూర్‌లోని ఆనందనగర్ లేఅవుట్‌ను సందర్శించారు. రహదారులు, పార్కులు, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాల ఆక్రమణలను పరిశీలించారు. ధరణి ద్వారా పాస్‌బుక్స్ సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులపై బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. లేఅవుట్ ప్రకారం పార్కులు, రహదారులను గుర్తించి ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించిన ఆయన, ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. అనంతరం బీరంగూడలోని శంభుని కుంట అవుట్లెట్లను పరిశీలించారు. వరద కాలువలను మూసివేసి నిర్మాణాలు చేపడుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద కాలువలను పునరుద్ధరించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలన్నారు. -
తీపెక్కిన చెరుకు సీజన్ ఈసారి చెరుకు మరింత తీపెక్కింది.ఈ ఏడాది చెరుకు క్రషింగ్ సీజనుఆశాజనకంగా ముగిసింది. వివరాలు 8లో u
ముందే జాగ్రత్త పడదాం..పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో కొంత జాప్యం జరుగుతుంది. దీంతో సంగారెడ్డిలో జనమంతా ఇంధన కొరత వస్తుందేమో అని భయపడుతున్నారు. అందరూ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. దీనికి తోడు అదనంగా నిల్వ చేసుకునేందుకు డబ్బాలలో తీసుకువెళ్తున్నారు. దీంతో కొంత మందికే పెట్రోల్, డీజిల్ దొరుకుతుంది. అత్యవసర పనులు ఉన్న వారు దొరకక ఇబ్బంది పడుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
ఆలు రైతులు ఆగమవుతున్నారు
జహీరాబాద్: కోహీర్, జహీరాబాద్ మండలాల్లో ఆలుగడ్డ పంటను సాగు చేసిన రైతులు పంట మార్కెట్లో అమ్ముడు పోక ఆగమవుతున్నారని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో మాట్లాడారు. ఆయా మండలాల్లో ఎర్రనేలలు అధికంగా ఉండడంతో రైతులు సాంప్రదాయంగా అత్యధిక విస్తీర్ణంలో ఆలుగడ్డ పంటను పండిస్తూ వస్తున్నారన్నారు. ప్రస్తుతం రైతులు పండించిన పంటను హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లితో పాటు పాతనగరం తదితర మార్కెట్లకు తరలిస్తున్నారని తెలిపారు. అక్కడ అమ్ముడు పోక పారవేసి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నష్టాల పాలవుతున్నారన్నారు. అల్లం పంట పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందన్నారు. మార్కెట్లో ధర లేనప్పుడు రైతులు ఆలుగడ్డ, అల్లం పంటతో పాటు పసుపు పంటను నిల్వపెట్టుకునేందుకు వీలుగా జహీరాబాద్, కోహీర్ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజీలను నిర్మించి ఇవ్వాలని కోరారు. అలాగే జహీరాబాద్ నియోజకవర్గంలో చెరకు పంటను అత్యధికంగా విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారని, అవసరం మేరకు డ్రిప్ సరఫరా కావడం లేదన్నారు. రైతాంగానికి డ్రిప్ పరికరాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.అసెంబ్లీలో ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆవేదన -
మెరుగైన విద్యాబోధన అందించాలి
జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని సంగారెడ్డి జోన్: సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందేలా చూడాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని సూచించారు. బుధవారం జిల్లా పర్యటన సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, శిశు సంక్షేమ శాఖల, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న వసతి సౌకర్యాలు, మౌలిక వసతులు, బోధన ప్రమాణాలు, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయభారతి సయాని మాట్లాడుతూ..శిథిలావస్థలో ఉన్న భవనాలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వసతి గృహాల్లో పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పోక్సో కేసులు, మానవ అక్రమ రవాణా, నేరాల నియంత్రణపై చర్చించారు. ల్యాండ్ మేనేజ్మెంట్ చట్టాల అమలు, మధ్యాహ్న భోజనానికి బియ్యం సరఫరా వంటి అంశాలపై రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అధికారులు లలితకుమారి, జగదీశ్, అఖిలేశ్‌రెడ్డి, డీఎస్పీ సత్తయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బడ్జెట్ రూ.40.31కోట్లు గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.40.31 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బుధవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్పర్సన్ గంగిశెట్టి చందన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ వివరాలను జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ విమల చదివి వినిపించారు. మున్సిపాలిటీకి అంచనా ఆదాయం రూ.40.31 కోట్లుగా, వ్యయం రూ.39.88 కోట్లుగా చూపి.. మిగులు రూ.49.63 కోట్లుగా ఉంటుందని వెల్లడించారు. బడ్జెట్ నిధులను ప్రాధాన్యత రంగాలకు ఖర్చుపెడతామని చైర్పర్సన్ తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, వైస్ చైర్పర్సన్ కళ్యన్‌కర్ పద్మాబాయి, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
హెల్త్ ప్రొఫైల్‌కు ఎర్రర్!
● అప్పుడప్పుడు మొరాయిస్తున్న వెబ్సైట్ ● అదనంగా స్కిల్డ్ సిబ్బందిని నియమించాలంటున్న వైద్యులు ● పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో అమలుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వైద్యారోగ్యశాఖ ప్రారంభించిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌కు అక్కడక్కడ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక వెబ్సైట్ ఈ–ఆరోగ్యం కొన్నిసార్లు మొరాయిస్తోందని సిబ్బంది పేర్కొంటున్నారు. అలాగే ఒక్కో రోగికి సంబంధించిన సమగ్రమ సమాచారం ఆన్లైన్లో పొందుపరిచేందుకు కనీసం 40 నిమిషాలు సమయం పడుతోందని చెబుతున్నారు. డేటాను ఎంట్రీ చేసే సమయంలో ఇంటర్నెట్ అంతరాయం కలిగితే ఎర్రర్ వస్తోందని, దీంతో కొంత ఇబ్బంది అవుతోందని అంటున్నారు. రోగుల హెల్త్ ప్రొఫైల్ అమలుకు సంగారెడ్డి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం విధితమే. ప్రయోగాత్మకంగా సంగారెడ్డి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఇందుకోసం 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, రెండు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిని ఎంపిక చేశారు. డిజిటల్ ప్రొఫైల్ అమలు చేయడం ద్వారా రోగి ఆరోగ్య చరిత్రతో పాటు, రోగనిర్ధారణ పరీక్షల ఫలితాలు, ఏఏ రోగాలు ఉన్నాయి.. ఇప్పటి వరకు తీసుకున్న చికిత్స.. ఇలా అన్ని వివరాలు ఎక్కడినుంచైనా ఆన్లైన్లో చూసుకునేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తక్షణం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులకు వీలవుతుంది. ఈ పైలెట్ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు కలెక్టర్ ప్రావీణ్యతో పాటు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టు అమలు తీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. అమలులో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వంటి వారి వివరాలను కలెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీస్తున్నారు.సిబ్బందిని పెంచితే మరింత వేగవంతం రోగుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు మరిన్ని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ వంటి పరికరాలు పెంచాలని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే వివరాల నమోదుకు స్కిల్డ్ సిబ్బందిని అదనంగా నియమిస్తే డేటా ఎంట్రీ మరింత వేగవంతమవుతుందని చెబుతున్నారు. ప్రతి రోజు ఎక్కువ సంఖ్యలో రోగుల వివరాలు నమోదు చేయడం సాధ్యమవుతుందని అంటున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. పైలెట్ ప్రాజెక్టుకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. టెక్నికల్ సమస్యలు వస్తే వెబ్సైట్ సాంకేతిక సిబ్బందితో చర్చించి సరిచేయిస్తున్నాం. ఈ పైలెట్ ప్రాజెక్టు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. – డాక్టర్ శశాంక్, ప్రాజెక్టు ఆఫీసర్ -
మౌలిక వసతుల కల్పనకు చర్యలు
సంగారెడ్డి జోన్: నిమ్జ్ ప్రాజెక్టులో మౌలిక వసతులు ప్రణాళికబద్ధంగా చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకత్, అధికారులతో కలిసి టీజీఐఐసీ భూములు, నిమ్జ్, ఎన్ఐసీడీసీ పరిధిలోని భూముల అభివృద్ధి, సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు లేఅవుట్ అభివృద్ధి కోసం త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈమేరకు రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సర్వే పనులు వేగవంతం చేసేందుకు రెవెన్యూ, సర్వే, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కొలతలతో సర్వే పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి పాల్గొన్నారు. అలాగే జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ -
నేడు డయల్ యువర్ డీఎం
నారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ డిపోలో గురువారం ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. బస్సు సౌకర్యాలు, ఇతర సమస్యలపై ప్రయాణికులు, ప్రజలు 9959223170 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలతో పాటు సమస్యలను తమ దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఇందిరమ్మ బిల్లులు వెంటనే చెల్లించాలిఅసెంబ్లీలో ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు బిల్లులను వెంటనే మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో వారు నిర్మాణ పనులు చేపట్టారని, పలువురు బేస్మెంట్స్థాయి వరకు పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదని వివరించారు. హెడ్ ఆఫీసుకు బిల్లులు పంపామని రాగానే ఇస్తామని స్థానిక అధికారులు చెప్తున్నారని, ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన మేరకు లబ్ధిదారులకు వెంటనే బిల్లులు విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వం నర్సాపూర్‌లో సుమారు 500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని సునీతారెడ్డి అసెంబ్లీలో చెప్పారు. వాటిలో కొన్ని బ్లాకులు పూర్తయ్యాయని వాటికి విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ బిగిస్తే వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉందన్నారు. డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు కొండాపూర్(సంగారెడ్డి): మద్యం మత్తులో కారును డ్రైవ్ చేస్తూ కొండాపూర్ మండలం మల్లెపల్లి చెరువుకట్టపై సీనీ నటుడు రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలి లావణ్య బుధవారం రాత్రి కారుతో ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. ఢీ కొట్టినప్పటికీ ఆగకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. దీంతో మల్లెపల్లి గ్రామస్తులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగింది. దీంతో చేసేదేమీలేక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లావణ్యకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా, ఆమె మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు తేలింది. పోలీసులు ఆమైపె మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు కౌన్సిలింగ్ కోసం నోటీసులిచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈమైపె గతంలోనూ పలు వివాదాలున్నాయి. గతేడాది నటుడు రాజ్ తరుణ్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, అబార్షన్ చేయించాడని ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ వివాదం అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఎర్రరాళ్ల ట్రాక్టర్లు స్వాధీనం జహీరాబాద్ టౌన్: అసైన్డ్ భూముల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టి ఎర్రరాళ్లను తీసుకెళ్తున్న ట్రాక్టర్లను తహశీల్దార్ దశరథ్ పట్టుకుని సీజ్ చేశారు. మండలంలోని హోతి(కె) గ్రామ శివారులో గల అసైన్డ్ భూముల్లో కొంతమంది వ్యాపారులు అక్రమంగా ఎర్రరాళ్ల తవ్వకాలు చేపడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్ఐ.రుక్మోద్దీన్ తదితరులు దాడులు జరిపి నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లు పరారీ కాగా మరో రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. నిందితులపై కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ దశరథ్ తెలిపారు. ఎర్రరాళ్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో జహీరాబాద్‌తోపాటు నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలతోపాటు కర్ణాటక రాష్ట్రానికి కూడా తరలిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. దరఖాస్తు గడువు పొడిగింపు మెదక్ కలెక్టరేట్: షెడ్యూల్ట్ కులాలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు గడువును ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 249 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దర ఖాస్తు చేసి హార్డ్ కాపీలను సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలన్నారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. -
అంగన్ వాడీలకు ఒంటిపూట
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు..సంగారెడ్డి జోన్: పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని చిన్నారుల ఆరోగ్య సంరక్షణ చర్యలో భాగంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అంగన్ వాడి కేంద్రాలలో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నుంచి ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. మే నెలలో పూర్తిగా సెలవులు ప్రకటించాయి. ఒంటిపూట తరగతుల్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు. దీంతో ఆయా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు వేసవి నుంచి ఉపశమనం కలుగనుంది. కేంద్రాల నిర్వహణలో సమయం మారినప్పటికీ, పిల్లలకు, గర్భిణిలు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారంలో ఎలాంటి మార్పు ఉండదు. నెలరోజుల పాటు సెలవులకు చాన్స్ అంగన్ వాడి కేంద్రాల సంబంధిత సంఘాల సభ్యులు ఒంటిపూట తరగతులతో పాటు వేసవి సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు నిర్వహించి అనంతరం నెల రోజులపాటు వేసవి సెలవులు రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు జిల్లాలోని అంగన్ వాడి కేంద్రాలు కేంద్రాల్లో హాజరయ్యే చిన్నారులువేలకు పైగా.. పెరుగుతున్న వేసవి దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం నెల రోజులపాటు సెలవులు టేక్ హోమ్ ద్వారాఇంటికే సరుకులు సెలవుదినాల్లో ఇంటికే పౌష్టికాహారం జిల్లా వ్యాప్తంగా ఐదు ప్రాజెక్టు పరిధిలో 1504 అంగన్వాడి కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాలలో 96 వేలకు పైగా చిన్నారులు ప్రతి రోజు హాజరవుతుంటారు. వేసవి సెలవుల్లో పౌష్టికాహారం పంపిణీ నిలిచిపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే టేక్ హోమ్ రేషన్ ద్వారా ఇంటికే పంపించేందుకు రూపకల్పన చేస్తున్నారు. పెరుగుతున్న ఎండల తీవ్రత వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్రం నిర్వాహకులతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.5150496 -
వసతులపై ఆరా
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఉత్తరాఖండ్ బృందంజిన్నారం (పటాన్చెరు): బొల్లారం డివిజన్ పరిధిలోని బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలను సోమవారం విద్యా పరిశోధన, శిక్షణ మండలి సంస్థ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయ బృందం సందర్శించింది. పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న వసతులపై ఆరా తీశారు. ఉచిత యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, విద్యా బోధన, మధ్యాహ్న భోజనం వంటి అంశాలను తెలుసుకున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బృందం సభ్యులు డాక్టర్ డీఎస్ లింగ్వాల్, శివకుమార్, భరద్వాజ్, హరిశంకర్, కిమోతి, మంతారాన, శివాని తదితరులు పాల్గొన్నారు. బురదలో కూరుకుపోయాయ్జహీరాబాద్ టౌన్: పట్టణం నుంచి అల్లనా వెళ్లే రోడ్డులో రెండు రోజుల నుంచి వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. ఆదివారం లోడుతో వెళ్తున్న లారీ బురదలో దిగపడగా.. సోమవారం కారు చిక్కుకుంది. దీంతో ఈ రోడ్డు వెంట ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గతంలో రూ. 33 లక్షలతో ర్అడ్బీ అధికారులు రోడ్డుపై బ్రిడ్జిని నిర్మించారు. కానీ రోడ్డు పనులు పూర్తి చేయలేదని విమర్శలు చేస్తున్నారు. అయితే రోడ్డుపై మొరం పోయడంతో ఇటీవల కురిసిన వర్షానికి బురదగా తయారై వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. ఇప్పటికై నా ఆర్అండ్బీ అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. తీరు మారకపోతే చర్యలు గజ్వేల్: కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్లోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వార్డు లను కలియ తిరిగారు. అటెండెన్స్ రిజిష్టర్‌ను పరి శీలించారు. అనుమతి లేనిదే ఎవరూ సెలవు తీసు కోవద్దన్నారు. గర్భిణుల్లో మనోధైర్యం నింపు తూ మంచి ఆహారపు నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. -
జోరుగా శనగ పంట కోత పనులు
మండలంలో శనగ పంట కోత పనులు తుది దశలో కొనసాగుతున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో పనులు సాగలేదు. దీంతో రెండు రోజుల నుంచి రైతులు శనగ పంట కోత పనులు, రాసులు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలో సుమారు 5,800 ఎకరాల్లో పంట సాగు చేశారు. ఎకరాకు 7 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలు శనగలకు ప్రభుత్వం రూ.5,850 మద్దతు ధరను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. త్వరలో రాయికోడ్‌లో గల శనగల కొనుగోలు కేంద్రంను ప్రారంభించనున్నారు. రాయికోడ్(అందోల్): -
త్వరితగతిన అభివృద్ధి పనులు
కలెక్టర్ ప్రావీణ్యసంగారెడ్డి జోన్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, యువజన సంక్షేమ– క్రీడాభివద్ధి, విద్యాశాఖ, శిశు సంక్షేమ, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్న్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంగారెడ్డి, నారాయణఖేడ్ స్టేడియంలలో కొనసాగుతున్న మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. స్టేడియం మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సంగారెడ్డిలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ప్రారంభానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు విద్యుద్దీకరణ, చిన్నపాటి మరమ్మతులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ లలిత కుమారి, సీపీఓ బాలశౌరి, స్పోర్ట్స్ అథారిటీ అధి కారి అఖిలేష్ రెడ్డి, అదనపు డీఆర్డీఓ బాలరాజ్, డీఈఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ ఏపీడి సూర్యరావు, ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమంతో పాటు ఆర్థికాభివృద్ధి కొరకు నిర్ణయించే లక్ష్య సాధనకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో వ్యవసాయ, ఉద్యానవన, డీఆర్డీఏ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో రైతుల ఆదాయం పెంపు, వ్యవ సాయ ఉత్పాదకతలో గణనీయమైన వృద్ధి సాధించేందుకు ఫార్మ్ మెకనైజేషన్, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి, తేనెటీగల పెంపకం పథకాలను అమలు చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటా యించిన ఫార్మ్ మెకనైజేషన్ లక్ష్యాలను వేగంగా సాధించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించాలని, రైతులను యాంత్రీకరణ వైపు మరింతగా ప్రోత్స హించాలని సూచించారు.ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా మినీ ట్రాక్టర్లు, పవర్ వీడర్స్, పవర్ టిల్లర్స్, బ్రష్ కట్టర్స్, పవర్ స్ప్రేయర్స్ వంటి యంత్రాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, జిల్లాలో ఇప్పటివరకు 97 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రజావాణిలో 49 దరఖాస్తులు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌తో పా టు అదనపు కలెక్టర్ పాండు, సబ్ కలెక్టర్ ఉమా హా రతి కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన 49 దరఖాస్తులను స్వీకరించారు. -
గోటి తలంబ్రాలు సిద్ధం
గజ్వేల్‌రూరల్: భద్రాచలంలోని సీతారాముల కల్యాణోత్సవంలో వినియోగించే గోటి తలంబ్రాలను భక్తులు సిద్ధం చేశారు. గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్తసమాజం వ్వవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ఈ బృహత్కర కార్యానికి శ్రీకారం చుట్టగా గోటి తలంబ్రాల దీక్షలో వేలాది మంది భక్తులు పాల్గొని రామనామ స్మరణతో భక్తులు గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గజ్వేల్–ప్రజ్ఞాఫూర్ మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భక్తులు గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్నారు. సోమవారం పట్టణంలోని మురళీకృష్ణాలయం నుంచి భద్రాచలంలోని సీతారాముల దేవస్థానంలో గోటి తలంబ్రాలను తరలించనున్నారు. ఈమేరకు రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాల కలశాలతో అందజేశారు. -
6.50లక్షల టన్నులు
● గణపతి కర్మాగారంలో 4.20 లక్షలు ● ‘గోదావరి గంగా’లో 2.30లక్షల టన్నుల మేర గానుగ ● పెరిగిన రికవరీ శాతం చెరుకు క్రషింగ్ జహీరాబాద్: జిల్లాలోని రెండు చక్కెర కర్మాగారాల్లో చెరుకు క్రషింగ్‌ను ముగించారు. ఆయా కర్మాగారాలు 6.50లక్షల టన్నుల చెరుకును గానుగాడించాయి. సంగారెడ్డిలోని గణపతి చక్కెర కర్మాగారం 2025–26 సీజన్‌కు గాను 4,20,076 టన్నుల చెరుకును క్రషింగ్ చేయగా.. 4,70,700 క్వింటాళ్ల చక్కెరను ఉత్పత్తి చేసింది. రాయికోడ్ మండలంలోని మాటూర్‌లో గల గోదావరి గంగా కర్మాగారం 2,29,206 టన్నుల చెరుకును క్రషింగ్ నిర్వహించగా, 2,50,914 క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి చేసింది. గణపతి కర్మాగారం గత ఏడాది కంటే 9,909 టన్నుల చెరుకును తక్కువగా గానుగాడించింది. జోన్ పరిధిలో చెరుకు పంట తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. గోదావరి గంగా మాత్రం గత ఏడాది కంటే 1,13,702 టన్నులు అధికంగా క్రషింగ్ చేసింది. ఈ కర్మాగారం గత సీజన్లో కొత్తగా ఏర్పాటైంది. దీంతో కర్మాగారం ఆలస్యంగా క్రషింగ్‌ను మొదలు పెట్టింది. ఈ ఏడాది మాత్రం ఆశించిన మేరకు క్రషింగ్ చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతం చెరుకు పంటను సమీపంలోని కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్‌లో గల గాయత్రి కర్మాగారానికి తరలించారు. ఈ కర్మాగారం 3,95,427 టన్నుల చెరుకును గానుగాడించింది. గత ఏడాది గణపతి కర్మాగారం 11.05 శాతం రికవరీ కాగా, ఈ ఏడాది 11.20 శాతం రికవరీ సాధించింది. గోదావరి గంగా గత ఏడాది 10.41 శాతం కాగా ఈ ఏడాది 11 శాతం రికవరీ చేసింది. గాయత్రి గత ఏడాది 10.90 శాతం రికవరీ సాధించగా, ఈ ఏడాది 11 శాతం రికవరీ సాధించింది. ఈ ఏడాది వేసవి ఎండలు ముదరక ముందే క్రషింగ్‌ను ముగించడంతో రికవరీ శాతం పెరిగినట్లు భావిస్తున్నారు. కాగా జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం గత మూడు సీజన్ల నుంచి మూతపడింది. వచ్చే ఏడాది క్రషింగ్‌ను చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇటీవల ట్రయల్‌రన్‌ను సైతం విజయవంతంగా నిర్వహించింది. -
ప్రజా సంక్షేమానికి అంకితం
లాంఛనంగా పామాయిల్ పరిశ్రమ ప్రారంభంసిద్దిపేటజోన్ / సిద్దిపేట కమాన్ /నంగునూరు(సిద్దిపేట): ప్రజాపాలనలో రైతు మహోత్సవం పేరిట ఆదివారం నంగునూరు మండలం నర్మేటలో నిర్వహించిన సీఎం సభ విజయవంతమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రైతులు, సిద్దిపేట జిల్లా మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రూ.300 కోట్లలో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం మంత్రులతో కలిసి వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.141 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీలో యూజీడీ పథకం, రూ.200 కోట్లతో కొండపాక మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.16.62 కోట్లతో మర్కుక్ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్‌స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. రూ.78 కోట్లతో నిర్మించిన జైల్, రూ.15 కోట్లతో నిర్మించిన 50 పడకల ఆయూష్ ఆస్పత్రి, రూ.3.60 కోట్లతో నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్, రూ.1.43 కోట్లతో గట్లమల్యాలలో నిర్మించిన పీహెచ్సీ భవనం, సిద్దిపేటలో రూ.1.43 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ భవనాలకు సీఎం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అనంతరం రూ.9 వేల కోట్ల రైతుభరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... రాజకీయాలు ఎన్నికల వరకేనని, అనంతరం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు కూడా సమానంగా కేటాయించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండున్నర గంటల పాటు సాగింది. మొదట హెలిక్యాప్టర్‌లో సీఎం నర్మేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో వెళ్లి పామాయిల్ పరిశ్రమను ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తర్వాత పరిశ్రమను పరిశీలించారు. అక్కడే కొనసాగుతున్న రైతు మహోత్సవంలోని స్టాళ్లను సందర్శించి వాటి గురించి తెలుసుకున్నారు. బ్యాటరీ వెహికిల్‌లో తిరిగారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు వర్చువల్‌గా ప్రారంభించారు. సాయంత్రం 4.11గంటలకు సభా వేదికకు సీఎం చేరుకున్నారు. రైతు భరోసాను విడుదల చేసి, బహిరంగ సభలో దాదాపు 43 నిమిషాల పాటు ప్రసంగించారు. తిరిగి సాయంత్రం 6గంటలకు హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలు దేరారు. సీఎం ప్రసంగాన్ని రాష్ట్రంలోని 1600 రైతుల వేదికల ద్వారా 4లక్షల మంది రైతులు విన్నారు. రూ.750 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన స్టాళ్లను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు సమస్యలపై సీఎంకు ఎంపీ రఘునందన్ వినతి -
వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
వెల్దుర్తి(తూప్రాన్): ఉపాధిహామీ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... ఆరెగూడెం గ్రామానికి చెందిన ఏర్పుల నాగలక్ష్మి(45) రోజూ మాదిరిగా శనివారం గ్రామ శివారులో నిర్వహించిన ఉపాధి హామీ పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చాక ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. శనివారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. వడదెబ్బ కారణంగా నాగలక్ష్మి మృతి చెంది ఉంటుందని కుటుంబసభ్యులు, గ్రామస్తులు భావిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. గుండె పోటుతో ఒకరు.. మెదక్‌జోన్: ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... బాల్నగర్ గిరిజన తండాకు చెందిన కాట్రోత్ రాజు కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సైకిల్‌పై మెదక్ పట్టణానికి వస్తూ పిల్లికొటాల్ సమీపంలో కిందపడి మృతి చెందాడు. గమనించిన కొందరు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య కాంట్రోత్ విజయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
భద్రాద్రికి గోటి తలంబ్రాలు
రామకోటి రామరాజుకు అందించిన బాలాజీ ఆలయ బాధ్యులుదుబ్బాక: భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల కల్యాణానికి దుబ్బాక నుంచి గోటి తలంబ్రాలు అందించారు. ఆదివారం దుబ్బాక బాలాజీ ఆలయంలో శ్రీరామకోటి రామరాజుకు భక్తులు రామ నామస్మరణ చేస్తూ గోటితో ఒలిచిన తలంబ్రాలను అందజేశారు. దుబ్బాకతో పాటు పలు గ్రామాల నుంచి వచ్చిన తలంబ్రాలకు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ.. రామయ్య కల్యాణానికి తెలంగాణ నుంచి ఈ సారి 3 క్వింటాళ్ల గోటి తలంబ్రాలను అందించాలన్న సంకల్ప దీక్షతో చేపట్టి దిగ్విజయంగా చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. భక్తులు భద్రాచలం వెళ్లలేకపోయిన తాము గోటితో ఒలిచిన తలంబ్రాలు రామయ్య కల్యాణానికి వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయం చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, అర్చకులు అచ్చి లక్ష్మినర్సింహ ఆచార్య, చింత నాగేందర్, సీబీ శ్రీనివాస్, రాజమౌళి తదితరులు ఉన్నారు. -
మార్కండేయులుకు ఉగాది పురస్కారం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వివిధ సేవా రంగాల్లో రాణిస్తున్నందుకు చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉగాది సేవా పురస్కారం పొందినట్లు పద్మశాలి సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ, చేనేత ఐక్యవేదిక జిల్లా సలహాదారు గోనె మార్కండేయులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని కేబీఆర్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీమంత్రి బాబుమోహన్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ పురస్కారం అందించినట్లు పేర్కొన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): శనివారం రాత్రి యువకుడు భూమిపూజ చేసిన స్థలంలో మూత్రవిసర్జన చేయగా, యువకులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా నార్సింగి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ చేసిన స్థలంలో ఆదివారం హిందూ సంఘాల నాయకులు పంచామృతాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అపవిత్రం చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, మాజీ ఉపసర్పంచ్ యోగి, నాయకులు ఆంజనేయులు తదితరులున్నారు. మెదక్‌జోన్: మెదక్ పట్టణంలో ఎనిమిది రోజుల వ్యవధిలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయని పట్టణ సీఐ మహేశ్ తెలిపారు. వివరాలు ఇలా... ఈ నెల 14న, పట్టణంలోని చర్చి గేట్ సమీపంలో 45 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సుగల వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కొన్ని రోజులుగా మెదక్‌లో భిక్షాటన చేసినట్లు గుర్తించారు. అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించగా నేటికి అతనికి సంబంధించిన వారు ఎవరు రాలేదని తెలిపారు. అలాగే మరో ఘటనలో ... ఆదివారం పట్టణంలోని జంబికుంట నాగిని చెరువు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉందని, మృతుడు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని చెప్పారు. మృతదేహంపై నల్లరంగు ప్యాంటు, తలపై ఎరుపు రంగు టవల్ ఉంది. శవాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో బద్రపరిచినట్లు చెప్పారు. చేగుంట(తూప్రాన్): మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం ప్రకారం... మండల కేంద్రానికి చెందిన మక్క నర్సింహులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య స్రవంతి ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో ఈనెల 18న ఏడాది వయసున్న చిన్నారిని తీసుకొని ఆమె బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువుల వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. సంగారెడ్డి క్రైమ్: ఈ నెల 21న లభ్యమైన గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... మృతురాలు సంగారెడ్డి పట్టణంలోని నలంద నగర్‌కు చెందిన లక్ష్మిగా(45) గుర్తించారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆమె ఈనెల 20న ఊరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో మహబూబ్ సాగర్ చెరువులో మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహం వద్ద లభించిన ఆధారాలతో సీసీ కెమెరాలను పరిశీలించి లక్ష్మిగా గుర్తించారు. -
కేసీఆర్, హరీశ్ కృషి వల్లే పామాయిల్ సాగు
ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి గజ్వేల్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, మాజీమంత్రి హరీశ్‌రావు కృషి వల్లే జిల్లా పామాయిల్‌కు హబ్‌గా మారిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం వల్లే పామాయిల్ సాగు విస్తరిస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. సొమ్ము బీఆర్ఎస్దైతే సోకు కాంగ్రెస్ చేస్తున్నదని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారని చెప్పారు. కానీ రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. రైతు భరోసా సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే అన్నదాతలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వాపోయారు. కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు సైతం రైతులకు రైతు భరోసా నిధులివ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్‌ను ఎక్కడికక్కడా నిలదీస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు కళ్యన్‌కర్ నర్సింగరావు, కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
కోతుల బెడదకు చెక్
● ఎలుగుబంటి వేషధారణతో తరిమిన గ్రామస్తులు మర్కూక్(గజ్వేల్): కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు గ్రామస్తులు వినూత్న ప్రయోగం చేపట్టారు. గ్రామంలో చాలా కోతులు ఇళ్లలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో సర్పంచ్, గ్రామ యువకులు కోతులను తరిమేందుకు శ్రీకారం చుట్టారు. మండలంలోని మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో ఆదివారం సర్పంచ్ కవిత రాంమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో సుమారు వంద కోతులను యువకులు నగేశ్, గోపిరెడ్డి ఎలుగుబంటి వేషధారణతో కోతులను భయపెట్టి గ్రామం నుంచి తరిమివేశారు. దీంతో గ్రామంలో కోతుల బెడద తగ్గిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. నాయకులు భిక్షపతి, వెంకట్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్వీ నాయకుల నిరసన
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడం సరే, మరి సిద్దిపేట నియోజకవర్గానికి రావాల్సిన నిధుల సంగతేంటని వారు ప్రశ్నించారు. గత ప్రభుత్వం సిద్దిపేటకు కేటాయించిన నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. సిద్దిపేట అభివృద్ధి పట్ల వివక్ష చూపిస్తే సహించేది లేదని, వెంటనే నిధులను విడుదల చేయాలన్నారు. -
దుబ్బాకను అభివృద్ధి చేయండి
ఎంపీ రఘునందన్‌రావు దుబ్బాక ప్రాంతం పూర్తిగా వెనకబడిందని, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని.. సీఎంను మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కోరారు. అనంతరం పలు సమస్యలపై ఎంపీ సీఎం రేవంత్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండపాక మండల పరిధిలోని ఎనిమిది గ్రామాలకు తపాస్‌పల్లి రిజర్వాయిర్ నీరు అందడం లేదని, దుబ్బాక నియోజకవర్గంలో కాల్వల ద్వారా మల్లన్నసాగర్ నీరు లేక రైతులు గోస పడుతున్నారని తెలిపారు. గజ్వేల్ రింగ్‌రోడ్డును పూర్తి చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు సందీప్‌కుమార్ సుల్తానియా, సురేంద్రమోహన్, సీనియర్ ఐపీఎస్ సౌమ్యామిశ్ర, విద్యా కమిషన్ చైర్మన్ మురళి, ఎంపీలు సుదర్శన్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్, సత్యనారాయణ, సంజీవ్‌రెడ్డి, నవీన్‌యాదవ్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
పాతనేరస్తుడి అరెస్ట్
మెదక్‌జోన్: పాతనేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సీఐ మహేశ్ కేసు వివరాలు వెల్లడించారు. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పద స్థితిలో కనిపించిన పాతనేరస్తుడు వడ్డెర కాలనీకి చెందిన వల్లెపు గోపాల్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో రెండు బైకులను దొంగిలించినట్లు నేరం ఒప్పుకున్నాడు. అతడిపై కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోరీ కేసులు ఉన్నాయి. బైకులను స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు పంపించారు. -
ట్రేడ్ లైసెన్స్‌ల గందరగోళం! జోగిపేట పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ట్రేడ్ లైసెన్స్‌ల వ్యవహారం గందరగోళంగా మారింది. వివరాలు 9లో u
ముక్క తగ్గనంటోందిజోగిపేట(అందోల్): మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పెరిగి సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ఆదివారం కిలో చికెన్ ధర రూ.360కి చేరడంతో మధ్యతరగతి కుటుంబాలు నాన్‌వెజ్ తినడమే కష్టంగా మారింది. లైవ్ చికెన్ రూ.230, స్కిన్లెస్ రూ.360, చికెన్ రూ.320 చొప్పున చికెన్ దుకాణాలలో విక్రయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా ఇంతరేటు పెరగడం గమనార్హం. గతంలో వారానికి ఒకసారైనా చికెన్ కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు ధరలు చూసి వెనక్కి తగ్గుతున్నాయి. చికెన్ ధరల పెరుగుదలకు పలు కారణాలున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పౌల్ట్రీఫారాల్లో ఉత్పత్తి తగ్గడం, పక్షుల ఆహార వ్యయం పెరగడం, రవాణా ఖర్చులు అధికం కావడం వల్ల ధరలు పెరిగినట్లు తెలిపారు. అలాగే వేసవి ప్రభావం కారణంగా కోళ్ల మరణాలు కూడా పెరిగి సరఫరా తగ్గిందని పేర్కొన్నారు. ఇక వినియోగదారులు మాత్రం ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇప్పటివరకు కుటుంబంతో కలిసి వారానికి ఒకసారి చికెన్ తినేవాళ్లం. ఇప్పుడు ధరలు ఎక్కువ కావడంతో నెలలో ఒకసారి కూడా కొనలేకపోతున్నాం’’అని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. మటన్ ధరలు ఇప్పటికే అధికంగా ఉండగా, చికెన్ కూడా అదే దారిలో నడవడం వల్ల నాన్‌వెజ్ పూర్తిగా దూరమవుతోందని అంటున్నారు. హోటళ్లలో కూడా చికెన్ వంటకాల ధరలు పెరగడంతో కస్టమర్ల రాక తగ్గినట్లు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.చికెన్ కిలో రూ.360 మధ్యతరగతికి మాంసం దూరం -
ఎస్టీపీ వద్దేవద్దు
ఎమ్మెల్యేకు అమీన్పూర్ వాసుల వినతి పటాన్చెరు: అమీన్పూర్లో స్యూవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను వెంటనే ఆపాలని స్థానికులు డిమాండ్ చేశారు. అమీన్‌పూర్‌లోని పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ సంఘాల ప్రతినిధులు ఆదివారం సమావేశం అయ్యారు. కాలనీలకు సమీపంలో మురుగు శుద్ధిని చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. సర్వే నంబర్ 993 గుట్టల్లో చక్కని పచ్చదనం ఉందని, అమీన్పూర్ జీవవైవిధ్యమున్న ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ ప్రదేశంలో పర్యావరణ అనుమతుల్లేకుండా ఎస్టీపీ నిర్మాణం చేయడం విడ్డూరంగా ఉందని వివిధ కాలనీల సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ తిరుమల్‌రెడ్డి, మోడీ కాలనీ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రమేశ్, ఇతర కాలనీ సంఘాల ప్రతినిధులు అరుణ్, విష్ణు, రవి, జయరామ్, వెంటరెడ్డి, విజయ్ పాల్గొన్నారు. -
సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లను ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆదివారం ప్రారంభించారు. మండలంలోని అల్గోల్, హుగ్గెళ్లి తండాలో, రాయిపల్లి(డి)లో, బూచినెల్లిలో రూ.5లక్షల చొప్పున సీసీ రోడ్డు నిర్మాణ పనులతోపాటు గోవింద్పూర్ గ్రామంలో రూ.25 లక్షలతో చేపట్టనున్న మురికి కాలువలు పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. దైవచింతనతో మానసిక ప్రశాంతత: సుధారాణిపటాన్చెరు టౌన్: దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాటా సుధారాణి అభిప్రాయపడ్డారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్దనూర్లో ఆదివారం జరిగిన ఎల్లమ్మతల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవంలో సుధారాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు కాటా సుధారాణిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వాస్పత్రిలో అన్నదానం సంగారెడ్డి: జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ కేతకీ సంగమేశ్వరాలయం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ పూజారులు నాగరాజు, శివపంతులు ఆధ్వర్యంలో ప్రతీ ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సీఐటీయూతోనే కార్మికులకు న్యాయంసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ రామచంద్రాపురం(పటాన్చెరు): సీఐటీయూతోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.మల్లికార్జున్ పేర్కొన్నారు. తోషిబా పరిశ్రమలో సీఐటీయూ యూనియన్ ఏర్పడి 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రామచంద్రాపురం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధనలో సీఐటీయూ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పరిశ్రమలోని కార్మికులకు బోనస్‌లు, పర్మినెంట్ చేయించడంతోపాటు డీఏ సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి కె.రాజయ్య, పాండురంగారెడ్డి, నాయకులు అనంతరావు, శ్రీధర్, బంగారురాజు, నరేందర్, వేంకటేశ్వర్లు, కృష్ణయ్య, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో బీసీలకు అన్యాయం
సంగారెడ్డి: రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం పునరాలోచన చేసి వారికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు బడ్జెట్ కేటాయింపులను పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్‌పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుగౌడ్ పాల్గొని మాట్లాడారు. బడ్జెట్లో బీసీలకు కేవలం నాలుగు శాతం నిధులను కేటాయించడం అన్యాయమన్నారు. జనాభాలో 56% పైగా ఉన్న బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కల్పించలేదని గుర్తు చేశారు. కనీసం 25 వేల కోట్ల రూపాయలు తక్షణమే కేటాయించాలని లేదంటే బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు కావేరి ఆంజనేయులు, ముఖ్య సలహాదారులు చంద్రయ్యస్వామి తదితరులున్నారు.● బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి ● బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ -
భగత్‌సింగ్ ఆశయసాధనకు కృషి చేయాలి
చుక్కా రాములు పటాన్‌చెరుటౌన్: స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్ ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని శ్రామిక్ భవన్ నుంచి బీరంగూడ కమాన్ వరకు తలపెట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ ...భగత్‌సింగ్ తన 23 సంవత్సరాల కాలంలోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ధీరుడని గుర్తు చేశారు. 1907 సంవత్సరంలో జన్మించి, 1931 మార్చి 23 న ఉరి తీయబడ్డారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజ య్య, మాణిక్యం, సీపీఎం పటాన్చెరు డివిజన్ కమిటీ కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా భవనాల పనులు చకచక
మహిళా సంఘాలకు తీరనున్న సమస్యలు హత్నూర(సంగారెడ్డి): డ్వాక్రా మహిళల సమస్యల పరిష్కారం కోసం సొంత భవనాలను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హత్నూర మండలంలో అందుకు సంబంధించిన పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మండలానికి 29 గ్రామపంచాయతీల్లో డ్వాక్రా మహిళ భవనాల నిర్మాణం కోసం రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో ఎమ్మెల్యే సునీతారెడ్డితోపాటు అధికారులు భవన నిర్మాణాల కోసం పనులు ప్రారంభించారు. మండలంలో 23 గ్రామాల్లో డ్వాక్రా భవనాల పనులు చకచకా కొనసాగుతున్నాయి. మహిళ సమాఖ్య సంఘాలు ప్రతీ సమావేశాన్ని ఈ భవనంలోనే ఏర్పాటు చేసుకునే అవకాశంతో పాటు ప్రతీనెల బ్యాంకులోన్ తీసుకున్న వాటిని సైతం ఇందులోనే సమావేశపరచుకుని బ్యాంకు రుణాలను చెల్లించేందుకు వెసులుబాటు కలుగనుందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా భవనాల నిర్మాణాల కోసం జిల్లా మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పనులను వేగిరం చేస్తున్నారు. కాసాల, రొయ్యపల్లి, కొత్తగూడెం, సాధులనగర్, సికిందలాపూర్, ఎల్లమ్మగూడ గ్రామాల్లో మాత్రం నిర్మాణం కోసం స్థలం దొరకకపోవడంతో పనులింకా ప్రారంభం కాలేదు. హత్నూర మండలానికి 29 మంజూరు 23 బిల్డింగ్‌లకు కొనసాగుతున్న పనులుచురుగ్గా కొనసాగుతున్నాయి మండలంలో 29 గ్రామాల్లో డ్వాక్రా మహిళ భవనాలు మంజూరు కాగా 23 భవనాలు నిర్మాణాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. కేవలం ఆరు గ్రామాల్లో భవన నిర్మాణానికి స్థలం లేక పనులు ఇంకా ప్రారంభించలేదు. మార్చి నెలాఖరునాటికి ఈ ఆరు గ్రామాల్లో కూడా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – రాజశేఖర్, ఏపీఎం -
నేడు సిద్దిపేటకు సీఎం రాక
సమీక్షించిన ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సాక్షి, సిద్దిపేట: సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత రెండో సారి సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారం భోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు నర్మేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారు. అక్కడే వర్చువల్‌గా పలువాటికి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఐజీ చంద్రశేఖర్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభ ఏర్పాట్లను ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కలెక్టర్ హైమావతి, ఐజీ చంద్రశేఖర్, సీపీ రష్మీ పెరుమాళ్ పర్యవేక్షించారు. 900 మంది పోలీస్ సిబ్బంది, అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పటిష్ట బందోస్తు నంగునూరు(సిద్దిపేట): నర్మేటలోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి తోపాటు ఇంటెలిజెన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఫ్యాక్టరీని సందర్శించి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరిమాళ్ తోపాటు భద్రతా సిబ్బంది, పోలీస్ అధికారులతో సమాలోచన చేశారు. -
బురద ఆరక
మురుగు పారక.. పాత మున్సిపల్ పరిధిలోని ఆర్యనగర్, రాంనగర్, గాంధీనగర్, శాంతినగర్, బాగారెడ్డిపల్లి, గడి, వతన్బాగ్, రహమత్‌నగర్, తమ్మడ్‌పల్లి, భరత్‌నగర్, గడిహరిజనవాడ, మాణిక్ ప్రభువీధి, ఫరీద్నగర్, కాంతారెడ్డి నగర్, డ్రైవర్స్ కాలనీలతోపాటు తదితర కాలనీలు సమస్యలకు నిలయంగా మారాయి. పలు వార్డుల్లోని ఆయా కాలనీల్లో ఇప్పటికీ పక్కా డ్రైనేజీ కాలువల నిర్మాణం లేకపోవడంతో మురికి నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి బురద మేటలు వేస్తోంది. ఆక్రమణల ద్వారా ఇండ్ల నిర్మాణాలు జరిగిన ప్రాంతాల్లో అయితే సమస్యలు ఎక్కడికక్కడే తిష్టవేసినట్లు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. వీటితోపాటు దోమలు కూడా స్వైరవిహారం చేస్తుండటంతో రోగాల బారిన పడుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం గురించి ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కనీసం రోడ్ల సౌకర్యం కూడ లేకపోవడంతో వర్షం పడితే రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టి డ్రైనేజీ కాలువలే ఉన్నాయి. వాటికి పక్కా నిర్మాణాలు చేయకపోవడంతో మురికి నీరు ఎక్కడికక్కడే స్థంభిస్తోందంటున్నారు. అవసరం మేరకు నిధుల కేటాయింపుల్లేక అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం మంజూరైన నిధుల్లో ఎక్కువ నిధులను మురికివాడల ప్రాంతాలకే కేటాయించాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్న మురికి కాలవల్లో పేరుకుపోయిన చెత్త, మురికిని తొలగించేందుకు తగిన సిబ్బంది లేకపోవడంతో వారం, పక్షం రోజుల వరకు కూడా కాలువలను శుభ్రం చేయడం లేదని పలువురు వాపోతున్నారు. పక్కా డ్రైనేజీ కాలువల నిర్మాణం కోసం తగిన నిధులు కేటాయించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.జహీరాబాద్ మురికివాడల్లో పారని డ్రైనేజీలు దుర్గంధంతోపాటుదోమల స్వైరవిహారంజహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని మురికివాడలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ కాలువల నిర్మాణం లేకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. జహీరాబాద్: -
బీహెచ్ఈఎల్ నుంచి గోవాకు బస్సు సర్వీసులు
పటాన్చెరు: బీహెచ్ఈఎల్ డిపో నుంచి కుక్కే సుబ్రహ్మణ్యస్వామి, ఉడుపి, మురుడేశ్వర, గోకర్ణ మీదుగా 25వ తేదీన గోవాకు సర్వీస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మోహన్‌రావు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వీకెండ్లలో గోవాకు ఒక్కరి రూ.6,150 టికెట్ ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక కాలనీలో కనీసం 30మంది విహారయాత్రలకు, పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బీఓసీ కింద బస్సులు నడపనున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకోసం 9063401072 సంప్రదించాలని సూచించారు. సిరిపురంలో బ్యాంకు ఏర్పాటుకు హామీ హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండలం సిరిపురం గ్రామంలో నూతనంగా బ్యాంకు ఏర్పాటుకు ఎంపీ రఘునందన్‌రావు సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు నాగప్రభుగౌడ్ తెలిపారు. హత్నూర మండలంలోని పలు గ్రామాల బీజేపీ నాయకులు పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నాగప్రభుగౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఎంపీ రఘునందన్‌రావును కలిసినట్లు తెలిపారు. సిరిపురం గ్రామంతోపాటు పరిసర గ్రామాల ప్రజలకు బ్యాంకు లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్న విషయం ఎంపీ రఘునందన్‌రావు దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే బ్యాంకు ఏర్పాటు చేసేందుకు అధికారులతో మాట్లాడతానని ఎంపీ హామీనిచ్చినట్లు వెల్లడించారు. సంగమేశ్వర బసవేశ్వరకు కేటాయింపులేవి?నియోజకవర్గంలో అధ్వానంగా రోడ్లు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జోగిపేట(అందోల్): బడ్జెట్లో అందోల్ నియోజకవర్గం చెందిన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. జోగిపేటలో ఆయన శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ...గత బీఆర్ఎస్ హాయాంలో సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నాలు చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రెయిన్బో స్కూల్‌పై చర్యలు తీసుకోవాలిఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అర్జున్ పటాన్‌చెరుటౌన్: అధిక ఫీజులు వసూలు చేస్తున్న రెయిన్ బో ఇంటర్నేషనల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అర్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణం లోని శ్రామిక్ భవన్లో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ...అమీన్పూర్ డివిజన్ బీరంగూడ లోని రెయిన్ బో ఇంటర్నేషనల్ స్కూల్లో యాజమాన్యం అధిక ఫీజులు వసూళ్లు చేయటం దారుణమన్నారు. అధిక ఫీజుల వసూళ్లపై తల్లిదండ్రుల ఆందోళనే ఇందుకు నిదర్శనమన్నారు. -
పారిశ్రామిక ప్రగతి పరుగులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : తలసరి ఆదాయం (పర్ క్యాపిటా ఇన్‌కం) పెరుగుదలలో సంగారెడ్డి జిల్లా దూసుకుపోతోంది. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాను సైతం వెనక్కినెట్టి రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. తొలి, రెండో స్థానాల్లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఉండగా, సంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో ఉంది. అలాగే జిల్లా స్థూల వస్తుత్పత్తిలోనూ సంగారెడ్డి రాష్ట్రంలోనే నాలుగోస్థానంలో ఉండటం గమనార్హం. ఒక ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందో సూచికల్లో తలసరి ఆదాయం ప్రధానమైనది. ఈ తలసరి ఆదాయం పెరుగుదలలో జిల్లా ప్రగతి వైపు పయనించడం శుభసూచికమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సోషియో ఎకనమిక్ అవుట్ నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో ఈ తలసరి ఆదాయంతోపాటు పారిశ్రామిక ప్రగతిలో సంగారెడ్డి జిల్లా దూసుకుపోతున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లా ఒక్కోవ్యక్తి తలసరి ఆదాయం రూ.3.94 లక్షలుగా ప్రభుత్వం ప్రకటించింది. మొదటి స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లా రూ.11.29 లక్షలు ఉండగా, రెండోస్థానంలో ఉన్న హైదరాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం రూ.4.79 లక్షలు, నాలుగోస్థానంలో ఉన్న మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా తలసరి ఆదాయం రూ.3.81 లక్షలు ఉంది. ఫార్మా, రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులే కారణం సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా దూసుకుపోతోంది. ఫార్మా, ఇంజనీరింగ్మ్యాన్ఫ్యాక్చరింగ్, రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల్లోని ఉత్పత్తులు దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ప్రధానంగా ఫార్మా, బల్క్‌డ్రగ్ ఉత్పత్తులు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఈ ఎగుమతులు ఏటా పెరుగుతుండటంతో జిల్లా స్థూల ఉత్పత్తి పెరుగుతోంది. తద్వారా తలసరి ఆదాయం పెరుగుదలకు కారణమవుతోందనే అభిప్రాయం ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర మొత్తం ఎగుమతుల్లో ఐటీ, తర్వాత స్థానం ఫార్మా ఉత్పత్తులే ఉంటాయి. ఈ ఫార్మా ఉత్పత్తిల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో ఉండటంతో తలసరి ఆదాయంలో జిల్లా మూడో స్థానంలో నిలవడానికి కారణమని ఆర్థిక నిపుణులు లెక్కిస్తున్నారు. ఒక ప్రదేశంలో జరిగిన ఉత్పత్తి విలువను ఆ ప్రాంతంలో ఉన్న జనాభాతో భాగించి తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు.2.68 లక్షల మందికి ఉపాధి పరిశ్రమలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్న వారిలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో ఉంది. 2025 డిసెంబర్ నాటికి జిల్లాలో ఉన్న 2,187 పరిశ్రమల్లో 2,68,735 మంది ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్న వారు ఉన్నట్లు లెక్కగట్టింది. తొలిస్థానంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఉంది. ఈ జిల్లాలో 4,095 పరిశ్రమలుండగా, 2.96లక్షల మంది ఉద్యోగులు, ఉపాధి పొందుతున్న వారు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో మొత్తంగా 13.01 లక్షల మంది పరిశ్రమలతో ఉపాధి పొందుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.3వ స్థానంలో తలసరి ఆదాయం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాను వెనక్కినెట్టిన సంగారెడ్డి పరిశ్రమల ఉద్యోగాల్లోజిల్లా రెండో స్థానం జిల్లా స్థూల ఉత్పత్తిలోనూ పురోగతి పారిశ్రామిక ఉత్పత్తులే కారణం -
పోరాటాల ఫలితమే..
సిద్దిపేటజోన్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా వత్తిడి చేయడం వల్లే సర్కారు దిగివచ్చిందని, మా పోరాటాల ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధర ఉండగా, సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది రైతులు దళారులకు రూ.1600 నుంచి రూ.1700 అమ్మి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే 25శాతం మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇప్పటికై నా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సన్‌ఫ్లవర్ క్వింటాల్ రూ.7,721 మద్దతు ధర ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఒకప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో 8వేల ఎకరాల్లో యాసంగికి సాగు ఉండేదని, కాళేశ్వరం పుణ్యమా అని పదింతలు పెరిగి 80 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. కాళేశ్వరం వచ్చాక కరువు అనే పదం లేదన్నారు. జిల్లా వ్యవసాయ రూపురేఖలు మార్చిన ఘనత కాళేశ్వరానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మాజీమంత్రి హరీశ్‌రావు -
బావిలో పడి యువకుడి మృతి
దుబ్బాకటౌన్: మద్యం మత్తులో బావిలో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణ శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై కీర్తిరాజు వివరాల ప్రకారం... దుబ్బాక మున్సిపల్ మల్లయ్యపల్లి వార్డుకు చెందిన కోతుల స్వామి (36) కూలి పని చేస్తూ, సోదరుని కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. స్వామి ప్రతిరోజు కూలి పని చేస్తూ, వచ్చిన డబ్బులతో విపరీతంగా మద్యం తాగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి మద్యం తాగాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. మద్యం మత్తులో పట్టణ శివారులోని పాతూరి రాంరెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. శనివారం ఉదయం మృతదేహం, చెప్పులు, బట్టలు గుర్తించిన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి, శవ పరీక్ష కోసం దుబ్బాక వంద పడకల ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్న కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
గుర్తుతెలియని మహిళ మృతదేహం
సంగారెడ్డి క్రైమ్: చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్ సాగర్ చెరువులో ఈ నెల 21వ తేదీన శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో గుర్తుతెలియని మహిళ(45) మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద పలు రకాల పాసుపోర్టు సైజ్ ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వాహన దొంగ అరెస్టు
జహీరాబాద్ టౌన్: స్కూటీని అపహరించిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. శనివారం జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.వినయ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. పట్టణ సమీపంలో గల బాబుమోహన్ కాలనీకి చెందిన వినోద్ తన ఫోన్ చోరీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఈ నెల 18న టీజీ 15 ఏ9672 నంబర్ గల స్కూటీపై స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసు స్టేషన్లో సమీపంలో పార్కు చేసి ఫిర్యాదు చేసి వచ్చే లోపు వాహనం మాయమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి కదలికను కనిపెట్టారు. శనివారం బీదర్ చౌరస్తాలో స్కూటీపై వెళ్తున్న దొంగను పట్టుకున్నారు. నిందితుడు మండలంలోని సత్వార్కు చెందిన ఏర్పుల శ్రీనివాస్‌గా గుర్తించారు. అతని వద్ద ఉన్న స్కూటీని స్వాధీనం చేసుకొని కోర్టులో రిమాండ్ చేశారు. వాహనాలు పార్కింగ్ చేసే సమయంలో డబుల్ లాక్ లేదా అలారం సిస్టంను ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
రెడ్డి సంక్షేమానికి నిధులేవీ?
హుస్నాబాద్‌రూరల్: ప్రభుత్వం రెడ్డి సంక్షేమానికి బడ్జెట్లో పైసా నిధులు కేటాయించలేదని రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి కార్పొరేషన్ ఊసే లేదని, కనీసం సంక్షేమానికి నిధుల కేటాయింపులు కూడా చేయలేదన్నారు. రాష్ట్రంలో రెడ్డి జనాభాను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మండలంలోని కానుకుంట రామ్ రెడ్డి బావి గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను సీపీఎం పార్టీ డివిజన్ నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో డివిజన్ పార్టీ కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడారు. పథకంలో పని చేస్తున్న కూలీలకు రూ.800 చెల్లించాలని, ప్రతిరోజు రెండు సార్లు ఫొటో క్యాప్చర్ విధానాన్ని ఎత్తివేయాలన్నారు. పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ రవీందర్, కూలీలు పాల్గొన్నారు. -
కస్తూర్బా విద్యార్థులకు వరం
జేఈఈ మెయిన్స్, నీట్‌కు కార్పొరేట్ తరహా కోచింగ్● మెదక్, సంగారెడ్డి జిల్లాలో కేజీబీవీల ఎంపిక ● ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశాలు ● ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు రెండు జిల్లాల్లో 6 కేజీబీవీల ఎంపికకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో మూడు కేజీబీవీలను శిక్షణకు ఎంపిక చేశారు. మెదక్‌లోని కేజీబీవీలో ఐఐటీ, జేఈఈ, నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి కేజీబీవీలో నీట్, అల్లాదుర్గ్ మండలం కేంద్రంలోని కేజీబీవీలో న్యాయవిద్య(క్లాట్)లో శిక్షణ ఇవ్వనున్నారు. సంగారెడ్డి జిల్లాలో మూడు కేజీబీవీలను ఎంపిక చేయగా... జిన్నారంలో జెఈఈ, నీట్, సదాశివపేట్‌లో ఐఐటీ, అందోల్‌లో క్లాట్‌లో విద్యార్థినులకు శిక్షణ ఇవ్వనున్నారు. -
విద్యాభివృద్ధికి పెద్దపీట
● రూ.16.62కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనాల నిర్మాణం ● పరిశీలించిన రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ మురళి మర్కూక్(గజ్వేల్): విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందించాలనే ఏకై క లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి విద్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం సుమారు రూ.16.62 కోట్లతో భవనాలు నిర్మించి, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం పోలీస్ క్వార్టర్స్, పక్కనే ఉన్న 5 ఎకరాల స్థలాన్ని క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించారు. అనతరం చైర్మన్ మాట్లాడుతూ... పోలీస్ క్వార్టర్స్‌లో ఉన్న భవనాలను ప్రీ ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకు కేటాయించి, పక్కనే ఉన్న ఐదెకరాల్లో మూడెకరాలు 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు భవనాల నిర్మాణం, మిగతా రెండెకరాల్లో క్రీడా స్థలానికి కేటాయించనున్నట్లు తెలిపారు. మర్కూక్ మండల కేంద్రంలోని 603 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని ఈ పాఠశాలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కస్తూర్భా గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. పదవ తరగతి విద్యార్థినులతో మాట్లాడి.. మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో టీడబ్ల్యూడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ సరిత, మండల విద్యా ధికారి వెంకట్ రాములు, అధికారులు పాల్గొన్నారు. -
కారు ఢీకొట్టడంతో హమాలీ మృతి
కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రంలోని మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ మైనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చిన్నఘనాపూర్ గ్రామానికి చెందిన నాగం నగేశ్(36) గ్రామ శివారులోని ఐఎంఎల్ డిపోలో హమాలీగా పని చేస్తున్నాడు. డిపోకు సెలవు దినం కావడంతో పనిపై కౌడిపల్లికి తన బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మెదక్ వైపు నుంచి నర్సాపూర్ వెళ్తున్న కారు వెనక నుంచి నగేశ్ బైకును అతివేగంగా ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతునికి భార్య పదేళ్లలోపు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ మేసీ్త్ర.. కౌడిపల్లి(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మేసీ్త్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అమరేందర్‌రెడ్డి వివరాల ప్రకారం... ఈనెల 19న కౌడిపల్లిలో జాతీయ రహదారిపై రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా మృతుడు అనీల్ స్వగ్రామం సూర్యపేట కాగా కౌడిపల్లిలో మేసీ్త్రగా కూలీపనులు చేస్తున్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం తరలించారు. -
భారీ వాహనాల రాకపోకలు మళ్లించాలి
జిన్నారం (పటాన్చెరు): ప్రధాన రోడ్డు నుంచి కాకుండా పట్టణంలో నుంచే భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. గడ్డపోతారం పట్టణ కేంద్రంలోని శివాజీ చౌరస్తా నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని , పట్టణవాసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. పట్టణంలోని రోడ్డును కాకుండా పారిశ్రామిక వాడకు వెళ్లే ఇతర మార్గాల నుంచి భారీ వాహనాలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రింబవళ్లు పట్టణ రోడ్ల నుంచి గృహ సముదాయాల మధ్య నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో శబ్ద, వాయుకాలుష్యంతో పాటు ఆదమరిస్తే ప్రమాదాలు జరిగే అవకా శాలు ఉన్నాయని వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు భారీ వాహనాలను పారిశ్రామిక వాడకు సంబంధించిన రోడ్ల నుంచి తరలించే ఏర్పాట్లు చేయాలని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
బడ్జెట్లో దివ్యాంగులకు అన్యాయం
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయమని ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కవిత పేర్కొన్నారు. శనివారం మెదక్‌లో ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్‌పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జె ట్లో దివ్యాంగుల సంక్షేమానికి నిధుల కేటాయింపులో తీవ్రమైన నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం బడ్జెట్లో దివ్యాంగుల కోటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు విస్మరించిందన్నారు. సంక్షేమ రంగాన్ని విస్మరించి ప్రజా పాలన గురించి ప్రభుత్వం మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, యాదగిరి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆయిల్, కాపర్ చోరీ శివ్వంపేట(నర్సాపూర్): గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని ఆయిల్, కాపర్‌ను చోరీ చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మండల పరిధిలోని శభాష్‌పల్లి గ్రామంలోని మంగళి పెంటయ్య వ్యవసాయ పొలం వద్దఉన్న 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని ఆయిల్, కాపర్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో బోరుబావులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంటలకు నిత్యం నీరు అందించాల్సిన సమయంలో ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం కావడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో కూడా ఈ గ్రామంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి కొండపాక(గజ్వేల్): రైతులు పామాయిల్ సాగు చేయాలని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. నంగునూర్ మండలంలోని నర్మేటలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్న కమ్రంలో దుద్దెడలో మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మంచాల చిన్న శ్రీనివాస్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. చాలా ఏళ్లుగా ఎక్కువ శాతం రైతులు, మొక్కజొన్న, వరి పంటను సాగు చేయటం వల్ల లాభాలు పొందడం లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నిర్మించారని తెలిపారు. రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వచ్చేలా ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. సాగు చేసే రైతులకు ప్రభుత్వం డ్రిప్పు, ఇతర సామగ్రితో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోవిందరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు లింగారావు, నాయకులు కనకరాంలు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ిఫిల్టర్లపై దాడులు
వాహనాలు, ఇసుక డంపులు సీజ్తూప్రాన్: అక్రమంగా కొనసాగుతున్న ఇసుక ఫిల్టర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ గంగరాజు కథనం ప్రకారం... అక్రమంగా ఇసుక ఫిల్టర్లు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కిష్టాపూర్ శివార్లలో 2 ట్రాక్టర్లు, గౌడిగూడెం శివార్లలో ట్రాక్టర్, జేసీబీ యంత్రంను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే ఇసుక డంపులను గుర్తించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా కృత్రిమ ఇసుక తయారు చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నూతన సాగు పద్ధతులకు వేదిక
నంగునూరు(సిద్దిపేట): నర్మేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో నిర్వహిస్తున్న రైతు మహోత్సవానికి శనివారం పది జిల్లాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జనగాం, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల నుంచి సుమారుగా 10 వేల మంది రైతులు హాజరయ్యారు. మహోత్సవానికి వస్తున్న రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు భోజన వసతి, మంచి నీటి సౌకర్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలతో పాటు యువ రైతులు వచ్చి అన్ని స్టాళ్లలో తిరుగుతూ విత్తనాలు, తేనె, కూరగాయలు, పండ్లు, పువ్వులతో తయారు చేసిన సబ్బులు, సెంటు, కొనుగోలు చేయడంతో స్టాల్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యానవన, ఇరిగేషన్, పట్టు పరిశ్రమ, పశుసంవర్థక శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు. ఆకట్టుకున్న యంత్రాలు స్టాల్లో వివిధ ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యయసాయ యంత్రాలు, మినీ వరి కోత మిషన్లు, ట్రాక్టర్లు, స్ప్రే చేసే వాహనాలు రైతులను ఆకట్టుకున్నాయి. యంత్రం ద్వారా ఐదు మీటర్ల వరకు పురుగుల మందు పిచికారీ చేసే పని తీరును ఆసక్తిగా గమనించారు. అలాగే డ్రైవర్ లేకుండా కొత్త టెక్నాలజీతో ముందుకు, వెనకకు నడిచే ట్రాక్టర్‌ను చూస్తూ పని తీరును నిర్వాహకుడు న్యాలకొండ శ్రీనివాస్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నూతన వంగడాలు, కూరగాయల స్టాల్ వద్ద మహిళలు తేనె ఉత్పత్తులను పరిశీలిస్తున్న రైతులు పది జిల్లాల నుంచి 10 వేలకు పైగా హాజరు స్టాల్స్ సందర్శించి వివరాలు తెలుసుకున్న రైతులు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ రైతులను ఆకట్టుకుంది. పువ్వులు, పండ్లు, కూరగాయలతో తయారు చేసిన సబ్బులు, సెంటు, వైన్, జ్యూస్, అగరుబత్తులు, చర్మ వ్యాధులు, నొప్పుల నివారణ మందులు ప్రదర్శించారు. వీటి తయారీ విధానంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకరస్వామి అవగాహన కల్పించారు. ఉత్పత్తులకు రైతులు, మహిళల నుంచి మంచి స్పందన రావడంతో కొనుగోలు చేశారు. తేనె ఉత్పత్తిపై అవగాహన అపీస్ కల్చర్ జాతీయ తేనె ఉత్పత్తి కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌కు మంచి ఆదరణ లభించింది. కంపెనీ ఆధ్వర్యంలో తేనె టీగల పెంపకం, నాణ్యమైన తేనె ఉత్పత్తి విధానంపై అవగాహన కల్పించారు. రోజ్, గ్రీన్, ఆమ్లా ప్లేవర్లతో తేనె తయారు విధానాన్ని నిర్వాహకులు వివరించారు. దీంతో చాలా మంది రైతులు కొనుగోలు చేశారు. -
కేంద్రీయ విద్యాలయం పిలుస్తోంది
సంగారెడ్డి జోన్: కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లకు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోటీ ప్రపంచంలో కార్పొరేట్ స్థాయిలో అధునాతన సాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ సిలబస్‌ను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ద్వారా అందిస్తుంది. నోటిఫికేషన్ విడుదల కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలతో పాటు రెండు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 19న నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు అర్హుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. 3, 4, 5వ తరగతులకు ఏప్రిల్ 2 వరకు, 2, 6, 7, 8, 9 తరగతులకు వచ్చే నెల 2 నుంచి 8వ తేదీ వరకు సంబంధిత విద్యాలయంలో ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకటో తరగతిలో సెక్షన్‌కు 40 మంది చొప్పున 80 మందికి ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. మిగతా తరగతులలో ఆయా తరగతుల ఖాళీల లభ్యత ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యం మొదట కేంద్ర, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు ప్రాధాన్యత కల్పిస్తారు. ఇందులో ఎస్సీ కుటుంబాల పిల్లలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27శాతం, దివ్యాంగులకు మూడు శాతం, ఇతరులకు మిగతా సీట్లు కేటాయిస్తారు. జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం, వాటి మార్గదర్శకాలను అనుసరిస్తూ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాలో రెండు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండల పరిధిలోని మాచ్నూర్, ఓడీఎఫ్ ఎద్దు మైలారంలో ఉంది. వీటిలో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో సీట్లకు పోటీ ఉంటుంది. అన్ని రకాల వసతులతో నాణ్యమైన విద్య, క్రమశిక్షణ కలిగి ఉండటంతో ప్రాధాన్యత నెలకొంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో స్వీకరణ ఏప్రిల్ 2వరకు చివరి గడువు 2 నుంచి 9 తరగతులకు ప్రవేశాలు ఖాళీల ఆధారంగా భర్తీ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ జారీ చేసిన ప్రత్యేక వెబ్సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. httpr//admirrion.kvr.gov.in, htt pr//jhararanfam.kvr.ac.in వెబ్ సైట్ ద్వారా నిర్ణీత తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల మేరకు ప్రవేశాలు 1వ తరగతితో పాటు మిగితా తరగతులలో ప్రవేశాలకు నోటిఫికేన్ విడుదలైంది. అర్హులైన వారు గడువు తేదీలను గమనించి దరఖాస్తు చేసుకోవాలి. కేవీ నిబంధనల మేరకు ప్రవేశాలు కల్పిస్తాం. సద్వినియోగం చేసుకోవాలి. –మహేశ్, కేవీ ప్రిన్సిపాల్, గ్రామం మాచ్నూర్, ఝరాసంగం -
పిచ్చుకలతో పంటలకు రక్షణ
సిద్దిపేటఎడ్యుకేషన్: పట్టణీకరణ, పారిశ్రామీకీకరణ, ఫెస్టిసైడ్స్ వాడకం తదితర పరిస్థితుల మూలంగా ప్రస్తుతం పిచ్చుకలు అంతరించిపోయే దశలో ఉన్నాయని, వాటిని కాపాడుకోవాలని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పేర్కొన్నారు. కళాశాల జంతుశాస్త్ర విభాగం, ఎకో క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పిచ్చుకలు పంటలకు హాని కలిగించే కీటకాలను ఆహారంగా తీసుకొని, పైరును రక్షిస్తాయన్నారు. పిచ్చుకలను రక్షించుకునేందుకు వాటికి కావాల్సిన నీరు, గూడు, ఆహారాన్ని కల్పించాలని సూచించారు. పిచ్చుకలను, ప్రకృతిని కాపాడేందుకు విద్యార్థులు ముందుకు రావాలని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి కోరారు. అనంతరం కళాశాల అవరణలో చెట్లకు పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేసి, ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏకోక్లబ్ కన్వీనర్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చందంపేట గ్రామసభలో ఉద్రిక్తత
● పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు వద్దు ● గ్రామసభలో చర్చపై గ్రామస్తుల ఆగ్రహం చిన్నశంకరంపేట(మెదక్): నూతన పరిశ్రమకు అనుమతి ఇవ్వొద్దని గ్రామస్తులు తేల్చి చెప్పారు. శుక్రవారం మండలంలోని చందంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ప్రవీణ్‌కుమార్, గ్రామ కార్యదర్శి పద్మ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంహెచ్ ప్యాక్ టెక్ పరిశ్రమ అనుమతి కోసం గ్రామసభలో అభిప్రాయాలు కోరారు. గతంలో పరిశ్రమ వద్దని తీర్మానం చేశామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే పాలకవర్గం డబ్బులు తీసుకున్నదని ఎన్నికల సమయంలో ప్రచారం చేసి, ఆ పరిశ్రమ గూర్చి ఎందుకు చర్చ పెట్టారని మాజీ ఎంపీటీసీ శివకుమార్ నిలదీశాడు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. పరిశ్రమ ఏర్పాటుకు తాను వందశాతం వ్యతిరేకమన్నారు. తాజాగా పరిశ్రమ యజమాన్యం ఇన్చార్జి మంత్రిని కలిసి వినతిపత్రం అందించారని, దీంతో డీపీఓ జీపీ వివరణ కోరుతూ నోటీసులు పంపించడంతో గ్రామసభలో ప్రజల అభిప్రాయం కోరినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగి ఉద్రిక్తత నెలకొంది. దాడి చేసుకునేందుకు సిద్ధపడగా సముదాయించారు. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేసిన తీర్మానంపై సర్పంచ్, గ్రామ కార్యదర్శి ప్రకటించి గ్రామసభను ముగించారు. -
అరెస్టులు పోరాటాలను ఆపలేవు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని ఆశ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహ ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ...సమస్యలు పరిష్కరించమంటే ఆశా వర్కర్లను అరెస్టులు, నిర్బంధాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్లపై పనిభారం పెంచింది కానీ వేతనాలు మాత్రం పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయాలిః సాయిలు ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందని ఆశా వర్కర్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆశాలకు నెలకు రూ.26వేలు కనీస వేతనం ఇవ్వాలని, 20 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పీఏ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.యాదగిరి, అధ్యక్షురాలు శశికళ, యశోద, నాయకులు మంజుల, హైమావతి ప్రశాంతి, గంగా, వరలక్ష్మి, వీరమణి, నందమ్మ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
సమతుల్యతకు ప్రతిబింబం బడ్జెట్
● డా.మురళీకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ సదాశివపేట (సంగారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ సంక్షేమం అభివృద్ధి సమతుల్యతకు ప్రతిబంబమని సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పి.మురళీ కృష్ణ శుక్రవారం పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అర్థికాభివృద్థి, సమాన అవకాశాలు, అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా రూపొందించిన సమతుల్య బడ్జెట్ ఇది. రూ 3,24,324కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఈ బడ్జెట్ రాష్ట్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని సంక్షేమం ఆర్థిక పురోగతికి సమాన ప్రాధాన్యం ఇచ్చి సమగ్ర ప్రణాళికగా నిలిచిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరుకోవడం ఆర్థిక స్థిరత్వాన్ని, వృద్ధి సామర్థ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. -
మంజీరాలో చేపల మృత్యువాత
● కాలుష్య జలాలే కారణం ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన హత్నూర (సంగారెడ్డి): మంజీరా నదిలోని చేపలు మృత్యువాత పడ్డాయి. వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున మృతి చెందుతున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా... నక్క వాగు నుంచి వస్తున్న కాలుష్య జలాలు మంజీరా నదిలో కలవడం వల్ల నీరు కలుషితమై చేపలు మృతి చెందుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. చుట్టుపక్కల పరిశ్రమలతో పాటు పటాన్చెరు, పాషా మైలారం, ఎగువనున్న ప్రాంతం నుంచి కాలుష్య జలాలు నక్క వాగు ద్వారా రావడంతో నది జలాలు కలుషితమవుతున్నాయి. అలాగే చేపలతోపాటు మూగజీవాలు నీరు తాగి మత్యువాత పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చేపలు మృతి చెంది కొట్టుకుపోవడంతో పాటు ఎక్కడపడితే అక్కడ మంజీరా నదిలో కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. కాగా పరివాహక ప్రాంతాల ప్రజలు కాలుష్య జలాలతో పంట పొలాలు సైతం పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మంజీరా నదిలో నక్క వాగు కాలుష్య జలాలు కలవకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు. -
మల్లన్నసాగర్ కాలువ గండికి మరమ్మతులు
దుబ్బాక: దుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్ శివారులో మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు పడిన గండికి శుక్రవారం మరమ్మతులు చేపట్టారు. కాగా మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు భారీ గండి అనే శీర్షికన సాక్షి ప్రధాన సంచికలో వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీంతో ఇరిగేషన్ డీఈఈలు శ్రీకాంత్, హరికిషన్ గండి పడిన కాలువకు దగ్గరుండి మరమ్మతులను స్వయంగా పర్యవేక్షించారు. గండిపడిన చోట టిప్పర్లతో మట్టిని తెప్పించి నింపుతున్నారు. ఇసుక, సిమెంట్ బస్తాలతో గండిని శనివారం మధ్యాహ్నంలోపు పటిష్టంగా మరమ్మతులు చేస్తామని అధికారులు తెలిపారు. భారీ గండి పడటంతో రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంతో పాటు దుబ్బాక మండలంలోని పలు గ్రామాలకు నీటిని అధికారులు నిలిపివేశారు. కాలువకు గండిపడి భారీగా నీరు సమీపంలోని కుందుల చెరువులోకి చేరింది. దీంతో కాలువపై ఆధారపడ్డ రైతులు పంటలకు నీరు ఎలా అని ఆందోళన చెందుతున్నారు. కాగా కాలువకు యాదృచ్చికంగా గండి పడలేదని, కావాలనే కొంత మంది గండి పెట్టినట్లు అనుమానాలు ఉన్నట్లు డీఈ శ్రీకాంత్ తెలిపారు. గండి పడిన సంఘటనపై పలు కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. -
ఇంటర్ విద్య బలోపేతం
● మధ్యాహ్న భోజనం అమలు నిర్ణయం హర్షణీయం ● జీజేసీపీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి సిద్దిపేట ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సంఘం(జీజేసీపీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించడాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ విద్య బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను అందించడం సంతోషించాల్సిన అంశమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఎంతో మంది పేద విద్యార్థుల ఆకలి తీరుతుందన్నారు. ఫలితంగా విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కూచంగారి శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ జ్యోతి, గంగాధర్, దేవస్వామి, శివకోటి, నాయకులు శశిధర్‌రెడ్డి, శ్రీనివాస్, దేవయ్య, సదానందం, మధుసూదన్‌రావుతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగుల్లో నిరాశ
సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్ హత్నూర(సంగారెడ్డి): రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27 ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా నిరాశ పరిచిందని ఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్ తెలిపారు. హత్నూరలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ..గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్లో 33,043 కోట్లు (11.34%) పెరిగినప్పటికీ, తెలంగాణ ఉద్యోగులు ఎదురుచూసిన పీఆర్సీ, పెండింగ్ డీఏలు ఇతర పెండింగ్ బకాయిలు లేకపోవడం బాధాకరమన్నారు. విద్యారంగానికి రూ.26,674కోట్లు మాత్రమే కేటాయించారని ఇది బడ్జెట్లో కేవలం 8.2% మాత్రమేనని..రేవంత్ సర్కార్ ఇప్పటివరకు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో ఈ రంగానికి కనీసం 10% నిధులు కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
డీహెచ్పీ అమలు దిశగా అడుగులు
● వైద్య సిబ్బందికి శిక్షణ ● హాజరైన కలెక్టర్ ప్రావీణ్యసంగారెడ్డి జోన్/ సంగారెడ్డి ఎడ్యుకేషన్/ సంగారెడ్డి : జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (డీహెచ్పీ) అమలుకు శ్రీకారం చుట్టగా, సంబంధిత సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రోగుల పూర్తి వైద్య వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. జిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు సంబంధించి డేటాఎంట్రీ ఆపరేటర్లు, మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం సంగారెడ్డి జిల్లా మెడికల్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ...సంగారెడ్డి డివిజన్లో పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను ప్రారంభిస్తున్నామని, జీజీహెచ్, జోగిపేట్, పటాన్చెరు ఏరియా ఆస్పత్రులు, సదాశివపేట సీహెచ్‌సీతోపాటు సంగారెడ్డి డివిజన్ పరిధిలోని 15 పీహెచ్సీలలో సోమవారం నుంచి ఈ ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వసంతరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, డాక్టర్ శశాంక్, స్పెషలిస్ట్ డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని కలెక్టర్ పి.ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లు, ఎంఈఓలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...అధికారులు నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. పదోతరగతి పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి ముందు ప్రతీ హాలును క్షుణ్ణంగా పరిశీలించి చూడాలని సూచించారు. -
సింగూరుకు రూ.45.39 కోట్లు
హెచ్ఎండీఏ రేడియల్ రోడ్లకు నిధులు బడ్జెట్ ప్రసంగంలో మహిళా పెట్రోల్‌బంక్‌ల ప్రస్తావన సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు రూ.45.39 కోట్లు కేటాయించారు. సాగునీటి రంగానికి రూ.22 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని ఏకై క మధ్యతరహా ప్రాజెక్టుకు అత్తెసరు కేటాయింపులే దక్కాయి. సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ జంటనగరాలతోపాటు, ఉమ్మడి మెదక్ జిల్లాకు తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం రూ.60 కోట్లతో కట్టబలోపేతం పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరికల మేరకు కట్టబలోపేతం పనులు చేస్తున్నారు. దీంతోపాటు ఈ ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులు కూడా సాగుతున్నాయి. రూ.143 కోట్లు ఈ పనులకు మంజూరయ్యాయి. ఈ పనులకు కలిపి 2026–27 సంవత్సరానికి మొత్తం రూ.45.39 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. అలాగే ఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టు నిర్వహణ, కాలువల ఆధునీకరణ పనులకు రూ.4.51 కోట్లు కేటాయించినట్లు నీటిపారుదలశాఖవర్గాలు పేర్కొంటున్నాయి. నిమ్జ్ భూసేకరణకు నిధులు జహీరాబాద్ నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు, మాన్‌ఫ్యాక్చరింగ్ జోన్)కు ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు జరపడం గమనార్హం. జాతీయ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో భాగంగా ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తోంది. ఈ నిమ్జ్ భూసేకరణకు ఈ బడ్జెట్లో రూ.96.50 కోట్లు కేటాయించింది. ఈ నిమ్జ్ కోసం మొత్తం 3,245 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విడతలవారీగా భూసేకరణ ప్రక్రియ చేపట్టగా, ఇప్పటికే సుమారు 1,400 ఎకరాల భూమిని సేకరించారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, మౌలిక సదుపాయాల కల్పన పనులకు ఈ బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు జరపడం గమనార్హం. కాగా, గతేడాది 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ నిమ్జ్‌కు రూ.125.47 కోట్లు కేటాయించినప్పటికీ పూర్తిస్థాయిలో నిధుల విడుదల జరగలేదని నిమ్జ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పెట్రోల్‌బంక్ ప్రత్యేక ప్రస్తావన రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న మహిళా పెట్రోల్‌బంక్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళా సాధికారతకు తమ ప్రజాప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పిన భట్టి సంగారెడ్డి బైపాస్ రోడ్డులో మహిళలు నిర్వహిస్తున్న పెట్రోల్బంక్తోపాటు, నారాయణపేటలో మహిళలు పెట్రోల్‌బంక్‌లను విజయవంతంగా నడుపుతున్నారని పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు.. ఈ బడ్జెట్లో రీజనల్ రింగ్ రోడ్డుకు రూ.1,525కోట్లు కేటాయించారు. సంగారెడ్డితోపాటు, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో నిర్మిస్తున్న ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుకు నిధుల కేటాయింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా ఈ పనులకు శ్రీకారం చుడతారా అనేది వేచి చూడాల్సిందే.హెచ్ఎండీకు భారీగా నిధులు ఈ బడ్జెట్లో హెచ్ఎండీఏ పరిధిలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో రూ.43వేల కోట్లు కేటాయించారు. సంగారెడ్డితోపాటు, ఎనిమిది మండలాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కాగా, ఇప్పటికే హెచ్ఎండీఏ నిధులతో సంగారెడ్డి మున్సిపాలిటీలో బైపాస్‌రోడ్డు విస్తరణ, పట్టణంలో సీసీరోడ్లు వంటి పనులు జరుగుతున్నాయి. అలాగే ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ఆర్కు కలుపుతూ సంగారెడ్డి మీదుగా గ్రీన్‌ఫీల్డ్, రేడియల్‌రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ఈ బడ్జెట్లో భారీ కేటాయింపుల నేపథ్యంలో ఈ పనులకు అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రికార్డులు మార్చేసి స్థలం కబ్జా
న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు సిద్దిపేటఅర్బన్: రికార్డులను తారుమారు చేసి అక్రమంగా తమ స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారని రంగాధాంపల్లికి చెందిన రైతులు ఆరోపించారు. శుక్రవారం వివాదంలో ఉన్న భూమి వద్ద విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు. 65 ఏళ్లుగా తమ కుటుంబమే భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోందన్నారు. తమ కుటుంబానికి చెందిన కొంతమంది కొన్నేళ్ల క్రితం భూమిని అమ్ముకొని వెళ్లి, ఇప్పుడు మళ్లీ స్థలం కోసం తమతో గొడవకు దిగుతున్నారని తెలిపారు. సర్వే నం.974, 975, 978, 979, 988, 1005, 1006లో సుమారు 8 ఎకరాల స్థలంలో తమ కుటుంబమే కబ్జాలో ఉందన్నారు. తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. తమ వద్ద స్థలానికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయని, ఈ మధ్యకాలంలో తమ పేరుపై ఉన్న భూ రికార్డులను తొలగించారని అన్నారు. కొద్దిరోజుల క్రితం రియల్ ఎస్టేట్ చేస్తున్న కొంతమంది అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారని, దీనిపై న్యాయ విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. -
సీఎం సభ ఏర్పాట్లపై సమీక్ష
● భద్రతా ఏర్పాట్లు చేయాలని అదనపు డీజీపీ ఆదేశం ● అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్ నంగునూరు(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా నర్మెటలో ఈనెల 22న సీఎం రేవంత్‌రెడ్డి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం అదనపు డీజీపీ మహేశ్ భగవత్, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాళ్లను పరిశీలించి బహిరంగ సభా వేదిక, హెలీప్యాడ్, వీఐపీ పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితోపాటు పలువురు అధికారులతో ఆరా తీశారు. సీఎం పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల ని అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో హాజరయ్యే రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.అనంతరం కలెక్టర్ రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, టాయిలెట్లు తదితర పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అదిరిన రైతు మహోత్సవం
నంగునూరు(సిద్దిపేట): వ్యవసాయ ఆధారిత పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవకు అనూహ్య స్పందన లభించింది. గురువారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేటలో నిర్వహించిన రైతు మహోత్సవం ఏర్పాటు చేశారు. నాలుగు జిల్లాల రైతులు తరలివచ్చి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా చూశారు. వ్యయసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, ఇరిగేషన్, మార్కుఫెడ్, మత్స్యశాఖ, యంత్ర పరికరాలు, విత్తనాలు కలిపి మొత్తం 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో స్టాల్ వద్ద ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఆయిల్‌పామ్ పంటలను ఆసక్తిగా గమనిస్తూ పంట సాగు, లాభాలు, తమ ప్రాంతంలో పంట అనుకూలంగా ఉంటుందా అంటూ ఆరా తీశారు. ఆదర్శ రైతుకు సన్మానం నంగునూరు మండలం అక్కేనపల్లిలో మొదట పామాయిల్ పంట సాగు చేసి, మొట్ట మొదట నర్మేట ఫ్యాక్టరీలో అమ్మిన మహిళా రైతు భాగ్యలక్ష్మి, నాగేంద్రం లను మండలి చైర్మన్, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. తాను ఇప్పటి వరకు రూ.13 లక్షల లాభ గడించానని చెప్పడంతో స్పందించిన తుమ్మల నాగేశ్వర్రావు.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి పంట సాగు చేయాలని చెప్పమనడంతో నవ్వులు విరిశాయి.అనూహ్య స్పందన -
మరుగున పడేశారు!
ప్రజలకు ఉపయోగపడని శౌచాలయాలు జహీరాబాద్ టౌన్: అత్యవసర సమయాల్లో ప్రజలు మల మూత్రవిసర్జనకు వీలుగా ప్రజా మరుగుదొడ్లను నిర్మించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో శౌచాలయాలు నిర్మించి వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేశారు. దీంతో పలు చోట్ల నిరుపయోగంగా మారాయి. వినియోగంలో ఉన్న చోట శుభ్రత, వసతులు కరువయ్యాయి. స్వచ్ఛభారత్ పథకం కింద పట్టణంలోని నాలుగేళ్ల క్రితం ప్రజామరుగుదొడ్లను కట్టించారు. వీటి నిర్వహణ బాధ్యతలను పొదుపు సంఘాల సభ్యులకు అప్పగించారు. జనావాసాలకు దూరంగా పట్టణ సమీపంలో బీదర్ చౌరస్తాలో నిర్మించిన మరుగుదొడ్లు వాడుకలో లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో మరుగుదొడ్లు దెబ్బతిని లక్ష్యం నీరుగారింది. దీంతో ప్రజాధనం వృథా అయింది. పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్దనున్న మరుగుదొడ్ల నిర్వహణ కూడా సరిగ్గాలేదు. జన సంచారం తక్కువగా ఉన్నందున మరుగుదొడ్లను ఉపయోగించుకునే వారు కరువయ్యారు. అవసరమున్న చోట అరకొర జహీరాబాద్ పట్టణంలో 1.25 లక్షల జనాభా ఉండగా..పట్టణానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రతీరోజు సుమారు 25 వేలమంది వస్తుంటారు. ప్రధాన రహదారులు, వీధులు ప్రజలతో కిక్కిరిపోతుంది. రోడ్ల ప్రక్కన సరిపడా మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమున్న చోట అరకొర..జన సంచారం లేని ప్రాంతంలో మరుగుదొడ్లు నిర్మించారని విమర్శలు వస్తున్నాయి. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని టాయిలెట్లు కట్టాలని కోరుతున్నారు. -
వేప.. కనిపించని పూత
నర్సాపూర్: వేప చెట్లకు చీడ తగ్గినా పూర్తి స్థాయిలో పూత పూయలేదు. సుమారు ఏడాది క్రితం వేప చెట్లకు చీడ పట్టడం మొదలైంది. వేప చెట్లు ఎండిపోవడానికి ఫోమాప్సిస్ అజాడిరక్టె అనే ఫంగస్ కారణమని, దీనిని డైబ్యాక్ వ్యాధి అంటారని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాగా, వేప చెట్టుకు ఆయూర్వేదంలో సర్వరోగ నివారిణిగా పేర్కొంటారు. అలాగే.. వ్యవసాయంలో పలు రకాల పంటలకు పట్టె చీడను వదిలించేందుకు వేప ఆకులు, గింజలతో తయారు చేసే కషాయం వాడి చీడను వదిలించే అవకాశం ఉండగా.. అలాంటి వేపకు చీడ పట్టడం గమనార్హం. సుమారు ఏడాది క్రితం నుంచి వేప చెట్లకు చీడ పట్టి వాటి ఆకులకు తెల్లటి చుక్కలాంటి మచ్చలు ఏర్పడడంతో పాటు ఆకులు ఎండిపోయి రాలిపోయాయి. ఆకులన్ని రాలిపోవడంతో దశాబ్దాల నాటి వయస్సున్న వేప చెట్లు సైతం ఆకులు రాలి కొమ్మలుగా మారి ఎండుముఖం పట్టాయి. ఇటీవల వేప చెట్లకు చీడ తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆకులు చిగురించి చెట్లు నిండుగా కన్పిస్తున్నప్పటికి కొన్ని కొమ్మల ఆకులు ఎండుముఖంతోనే ఉన్నాయి. కాగా, వేప చెట్లకు చీడ పట్టి ఎండిపోయి ఇటీవల చిగురిస్తున్నా. చాలా చెట్లకు పువ్వు పూయ లేదు. -
నాణ్యమైన విత్తనాలు
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కూరగాయల పంటలను స్టాల్లో ఏర్పాటు చేశారు. అలాగే వాటి నుంచి సేకరించిన విత్తనాలను తక్కువ ధరకు అమ్మారు. యంత్రాల పనితీరుపై.. స్టాల్లో వివిధ కంపెనీల అందిస్తున్న అధునాతన యంత్రాలు, ట్రాక్టర్లు, రొటోవేటర్లు, పిచికారీ యంత్రాలను ప్రదర్శించారు. డ్రిప్, స్పీంక్లర్ల ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలో ఆయా కంపెనీల ప్రతినిఽధులు రైతులకు వివరించారు. ఆకట్టుకున్న విదేశీ కోళ్లు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దేశవాళి ఆవులు, గేదెలు, గొర్రెలు, విదేశీ కోళ్ల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అందిస్తున్న సబ్సిడీలను వివరించారు. పేడతో జీవామృతం, బీజామృతం, సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలో వివరించారు. ఆయిల్‌పామ్ సాగు.. ఆయిల్‌ఫెడ్ అధికారులు ఆయిల్‌పామ్ మొక్కలు, గెలలు, గింజలు, వాటి నుంచి వచ్చిన నూనె, పిప్పిని స్టాల్లో ప్రదర్శించారు. తెలంగాణ లోని అన్ని జిల్లాల నుంచి క్రూడ్ ఆయిల్‌ను సేకరించి విజయ బ్రాండ్ పేరిట నూనె ప్యాకెట్లు తయారు చేస్తామని రైతులకు వివరించారు. అలాగే ఆయిల్ తీసిన తరువాత వచ్చిన పిప్పితో ఫ్యాక్టరీకి అవసరమయ్యే విద్యుత్‌ను ఏలా ఉత్పత్తి చేస్తారో వివరించారు. -
బడ్జెట్లో సింగూరుకు ఎన్ని?
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు పటిష్టతకు మరమ్మతు పనులు ప్రారంభంకావడంతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు ఏ మేరకు కేటాయిస్తారోనని నీటిపారుదల శాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్టు జాతీయ భద్రత అధికారుల సూచనమేరకు డ్యామ్ మట్టికట్ట లోపలి భాగంలో రాతికట్ట (రివిట్మెంట్)పనులను చేపట్టారు. తొలుత 800 మీటర్ల మేరకు మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించి రూ.16 కోట్లను కేటాయించారు. ఐతే పనులు చేపట్టడానికి నీరు అడ్డంకిగా మారడంతో నీటిని దిగువకు వదిలిపెట్టారు. తాగునీటికి ఈ వేసవిలో సరిపోను నీరుంచి మిగతా నీటిని వదిలిపెట్టారు. నీటిని దిగువకు వదిలిపెట్టడం, పైగా ప్రాజెక్టు ఆయకట్టుకు పంట విరామం ప్రకటించడంతో డ్యామ్ రాతికట్ట మొత్తం మరమ్మతు చేయాలని నిర్ణయించారు. దీంతో మరమ్మతుల అంచనావ్యయం పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. మంత్రి ప్రత్యేక చొరవ మంత్రి దామోదర నియోజకవర్గంలోనే సింగూరు డ్యామ్ ఉండటంతో ప్రాజెక్టు పనులపై ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 వేల ఎకరాలకు సాగునీటి కాలువలు మంజూరు చేయించారు. దశాబ్దం నుంచి రైతులకు సాగునీరు పారిస్తున్న కాలువలకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో కాలువల్లో పూడిక నుంచి చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. దీంతో మంత్రి దామోదర రాజనర్సింహ పంటకాలువలకు సిమెంట్ లైనింగ్ చేయించాలని రూ.180 కోట్లను మంజూరు చేయించారు. సిమెంట్ లైనింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. డ్యామ్ రాతికట్ట రివిట్మెంట్ పనులు, పంట కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు ఏకకాలంలో ప్రారంభం కావడంతో ఎక్కువగా నిధులు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖకు పంపించారు. మంత్రుల ప్రత్యేక సమీక్ష సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ నీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. డ్యామ్ మిషన్ భగీరథ, సాగునీటి అంశాలతో కూడుకున్నది కావడంతో పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.పెద్దారెడ్డిపేట లిఫ్టుకు అంకురార్పణ ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువల ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నందున ఎగువభాగంలోని ఖాదిరాబాద్, రేగోడ్, వట్పల్లి, టేక్మాల్ ప్రాంతాలలోని రైతులకు సాగునీరు అందిచాలని సంకల్పించి పెద్దారెడ్డిపేట వద్ద లిఫ్టును ఏర్పాటుకు సంకల్పించారు. ఈ లిఫ్టు సర్వే కోసం ఈ బడ్జెట్లోనే నిధుల కేటాయింపులుంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ బడ్జెట్లో సింగూరు ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తారని ఆశిస్తున్నారు. -
పైసా వసూల్!
వికారాబాద్: సీఎం సొంత జిల్లాలో అవినీతి వ్యవస్థీకృతం అయ్యిందనే వాదన వినిపిస్తోంది. కీలక శాఖల్లో విధులు నిర్వహించే మెజార్టీ అధికారులు లంచావతారమెత్తుతున్నారు. తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గతంలో కలెక్టరేట్లో విధులు నిర్వహించే ఓ మహిళా ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కి ఆరు నెలలు తిరక్కుండానే అదే రెవెన్యూ శాఖలో చేరి మరోసారి పట్టుబడింది. తాజాగా పెద్దేముల్ ఆర్ఐ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. గతంలో ఎస్పీ కార్యాలయంలో ఓ డీఎస్పీ, తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఓ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. పెద్దేముల్ ఆర్ఐ హైదరాబాద్‌లో ఓ రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకున్నారు. అయితే అధికారుల తీరు దొరికితే దొంగ లేకుంటే దొర అన్న చందంగా తయారైంది. ప్రధానంగా రెవెన్యూ ఖాఖలో ఆర్ఐలు మొదలుకుని డీటీలు, తహసీల్దార్లు, ఇతర ఉన్నతాధికారుల వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ ఫైలు కదలాలన్నా..? నివేదిక ఇవ్వాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఏదైనా పని పడితే కింది స్థాయి ఉద్యోగులను కూడా వదలడం లేదు. వారి రిపోర్టు ఇవ్వటానికి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, భూ భారతి ఆపరేట్లర్లు, సర్వేయర్లు ఇలా ప్రతి ఒక్కరూ అదే దారిలో నడుస్తున్నారు. నేతల అండదండలు అవినీతి అధికారులకు నేతలు, ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు ముడుపులు చెల్లించి పోస్టింగులు వేయించుకొని ఆయా ప్రాంతాలకు వస్తున్న అధికారులు ఆ తర్వాత వసూళ్లకు పాల్పడుతున్నారు. నేతల అండదండలున్నాయనే ధైర్యంతో ఉన్నతాధికారులను కూడా లెక్కచేయడం లేదు. కొంతమంది పర్యవేక్షణాధికారులు కింది స్థాయి అధికారుల అవినీతిలో భాగస్వాములు అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు ఏసీబీ అధికారుల నిఘాలో ఉన్నట్లు సమాచారం. ప్రతి పనికీ డబ్బు డిమాండ్ చేస్తున్న అధికారులు మెజారిటీ శాఖల్లో..ఆరు నెలల క్రితం కలెక్టరేట్లోని ఓ ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఎనిమిది నెలల క్రితం పోలీసు శాఖలో పనిచేసే ఎస్ఐ, అతని డ్రైవర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. 11 నెలల క్రితం తాండూరులో ఇద్దరు రెవెన్యూ అధికారులపై కేసులు నమోదయ్యాయి. -
అలరించిన కుస్తీ పోటీలు
ఉగాది ఉత్సవాల నేపథ్యంలో కల్హేర్ మండలం మార్డి, సిర్గాపూర్‌లో గురువారం నిర్వహించిన కుస్తీ పోటీలు అలరించాయి. మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాలకు చెందిన మల్ల యోధులు తరలివచ్చి కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఎన్నం విజయలక్ష్మి, శ్రీనివాస్‌రావు, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవరావు, నాయకులు కల్యాణ్‌రావు పాటీల్, రవీందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. –కల్హేర్(నారాయణఖేడ్) -
చండీ రుద్రయాగానికి పదేళ్లు పూర్తి
న్యాల్కల్ (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని రాఘవాపూర్– హుమ్నాపూర్ గ్రామ శివారులోని పంచవటి క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరకాల చంఢీరుద్ర మహాయాగానికి పదేళ్లు పూర్తయ్యాయి. లోక కల్యాణార్థం, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండి దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ పంచవటి క్షేత్రం పీఠాధిపతి శ్రీ కాశీనాథ్‌బాబా పుష్కరకాల శత చండీరుద్ర మహాయాగానికి శ్రీకారం చుట్టారు. లోక కల్యాణార్థం 8 ఏప్రిల్ 2016లో ప్రారంభమైన ఈ మహాయాగం 2028లో పూర్తి కానుంది. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం క్షేత్ర ఆవరణలో నిర్వహించే యాగంలో ఇద్దరు చొప్పున దంపతులు పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 7,168 మంది దంపతులు యాగంలో పాల్గొన్నారు. పదేళ్లు పూర్తయిన సందర్భంగా క్షేత్రంలో వెలసిన దేవతలకు గురువారం కాశీనాథ్‌బాబా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పంటలు పండక ప్రజలు దుర్భిక్ష పరిస్థితుల్లో ఉంటే వారి క్షేమం కోసం ఈ యాగాన్ని 36లక్షల సంవత్సరాల క్రితం సాధువులు, శౌనకాది మహా మునులు నిర్వహించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయన్నారు. -
ఉగాది పచ్చడి వితరణ
వగరు, చేదు, కారం, ఉప్పు, పులుపు, తీపి ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఆనందోత్సాహాలు, కష్టసుఖాలు కలబోతే జీవితమని వాటన్నింటినీ సమదృష్టితో స్వీకరించేందుకు ప్రతీకగా ఈ ఉగాది పచ్చడిని తాగుతారు. గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పలు ఆలయాల్లో పచ్చడి వితరణ నిర్వహించారు. ఐబీ గెస్ట్ హౌస్ దగ్గర హిందూవాహిని ఆధ్వర్యంలో వాహనదారులకు పచ్చడిని అందించారు. అనంతరం ఒకరికొకరు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్య
కల్హేర్(నారాయణఖేడ్): పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. సిర్గాపూర్ మండలం వాసర్‌లో రూ.200 కోట్లతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల సముదాయ నిర్మాణ పనులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ఈ పాఠశాల సముదాయంలో అత్యాధునిక హంగులతో వసతులు, క్రీడా మైదానాలు ఏర్పాటు అవుతన్నాయన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం మైలురాయిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈఓ నాగరం శ్రీనివాస్, నాయకులు రమేశ్ చౌహన్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి -
ఆయురారోగ్యాలతో ఉండాలి
మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి రామచంద్రాపురం (పటాన్చెరు): పరాభవనామ సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని రాష్ట్ర శాసన మండలి మాజీప్రోటెమ్ చైర్మన్ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి ఆకాంక్షించారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని పాతరామచంద్రాపురం హనుమాన్ ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా గురువారం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి మాజీప్రోటెమ్ చైర్మన్ వి.భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు అంజయ్య, బి.పుష్ప, బీఆర్ఎస్ నియోజకవర్గ కో ఆర్టినేటర్ వి.ఆదర్శ్‌రెడ్డి, నాయకులు కుమార్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, దిలీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠాలు పూర్తికాలేదు
జహీరాబాద్ టౌన్: నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిన పాఠ్యాంశాలు కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో పూర్తికాలేదు. ఉపాధ్యాయుల కొరత వల్ల సిలబస్ పూర్తికాకపోవడంతో పాఠ్యాంశాల వర్క్షీట్లు అలాగే మిగిలిపోయాయి. దీంతో సగం పూర్తయిన సిలబస్‌తోనే విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. సర్కారు పాఠశాలల్లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కొన్నిచోట్లయితే అసలు రికార్డుల నిర్వహణనే చేపట్టలేదు. కొన్ని బడుల్లోనైతే పిల్లల దాహార్తిని తీర్చేందుకు కనీసం మంచినీటి వసతులు కూడా లేవు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా మధ్యాహ్నా భోజనం పథకం సరిగ్గా అమలు కావడం లేదు. మరికొన్ని చోట్ల అమలవుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతలోపిస్తోంది. కొన్ని పాఠశాలలకు ప్రహారీగోడల్లేక పశువులు లోపలికి వచ్చేస్తున్నాయి. అవును ఇవన్నీ పసిపిల్లల ‘సాక్షి’గా పచ్చినిజాలు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన తనిఖీల బృందం ఇచ్చిన నివేదికలో విస్మయకర అంశాలు వెల్లడయ్యాయి. వంద పాఠశాలల్లో తనిఖీ సర్కారు స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం ఉపాధ్యాయులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న వ్యవస్థకు అదనంగా ప్రత్యేక బృందాలను నియమించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన భోజనం, వసతుల కల్పన, ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాలను ఈ బృందాల్లోని సభ్యులు పరిశీలించారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలు జిల్లాలోని వంద పాఠశాలలను తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. బృందాల పనితీరు ఇలా.. జిల్లాలో 15 తనిఖీ బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యూపీఎస్, ప్రాథమిక పాఠశాలతోపాటు ఉర్దూ మీడియం బడులకు వేర్వేరుగా బృందాలను నియమించారు. ఒక్కో టీమ్‌లో ముగ్గురు టీచర్లుండగా ప్రతీ బృందంలో మొదటివ్యక్తి నోడల్ అధికారిగా మిగిలిన ఇద్దరు సభ్యులు కొనసాగారు. టీమ్ సభ్యులు పాఠశాలలను సందర్శించి విద్యా ప్రగతిని అంచనా వేశారు. ప్రతీ మూడు నెలల్లో ఒక్కో టీమ్ ప్రాథమిక, ప్రాథమికోన్నతస్థాయిలో వంద పాఠశాలలు, ఉన్నత పాఠశాలస్థాయిలో 50 స్కూళ్లను తనిఖీ చేశారు. ప్రత్యేక బృందం సభ్యులు ప్రతీరోజు రెండు చొప్పున పాఠశాలలను తనిఖీ చేస్తూ వాటి అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు అందజేశారు. పాఠశాలలకు బృందం సభ్యులు వంద పాఠశాలల తనిఖీలు విజయవంతంగా పూర్తి చేసినందుకు బృందం సభ్యులను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ మేరకు తనిఖీలు పూర్తిచేసి తయారు చేసిన నివేదికలను సభ్యులు మండల విద్యాధికారులకు సమర్పించారు. అయితే తనిఖీకి నియమితులైన టీచర్లు మంగళవారం నుంచి యథావిధిగా పాఠశాల విధులకు హాజరయ్యారు. ● ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులసంఖ్య పెంచి వాటిని బలోపేతం చేయడం ● నిరంతర సమగ్ర మూల్యాంకన సాధన ● ప్రాథమిక స్థాయిలో ఎఫ్ఎల్ఎన్, ఉన్నత పాఠశాలస్థాయిలో ఎల్ఐపీ ప్రణాళిక అమలు ● విద్యా ప్రమాణాల పెంపుదల, టెక్ట్స్‌బుక్, వర్క్‌షాపులతో విద్యార్థులకు అభ్యాసన ● క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి పరిష్కారం ● సలహాలు సూచనలివ్వడం, పాఠశాల రికార్డుల పరిశీలన తాగునీటి వసతులు కరువు బడుల్లో లోపించిన పారిశుద్ధ్యం తనిఖీల నివేదికలో వెల్లడి! ప్రభుత్వానికి అందజేత నోడల్ అధికారి ప్రదీప్ కుమార్, సభ్యుడు వహబోద్దీన్తో కలిసి డిసెంబర్ నుంచి ఇప్పటివరకు వంద పాఠశాలలను తనిఖీ చేశాం. తనిఖీల సందర్భంగా ఉపాధ్యాయులు కూడా పూర్తి సహకారం అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు పూర్తి చేసి మనూర్ మండల విద్యాధికారికి నివేదికలను అందజేశాం. –నిమ్మల కిష్టయ్య, బృందం సభ్యులు -
రూ.10 వేల కోట్లు కేటాయించాలి
సదాశివపేట(సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో గురువారం సదాశివపేటలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సింగూర్, మంజీర ప్రాజెక్టులకు నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టి కాల్వల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గంగకత్వ, నారింజ, నల్లవాగు, మల్కాపూర్ చెరువులకు నిధులు కేటాయించి కాలుష్యం బారినపడిన నక్కవాగు, మంజీర జలాలను శుద్ధి చేయడానికి నిధులు కేటాయించాలని కోరారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డిలో వందపడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించి, పారిశ్రామికవాడల్లో కనీస మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించడం కోసం నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తారా డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గుర్తింపు కోసం కృషి చేయాలని, అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వాలని, రాజీవ్ గృహకల్ప పెండింగ్ ఇళ్లను పూర్తి చేయాలని, మున్సిపాలిటీల్లో పార్కులు, ఇండోర్ స్టేడియాలను అభివృద్ధి చేయలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మల్లేశం, ఎం.నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, నర్సింహులు, కృష్ణ, రమేశ్ పాల్గొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యమివ్వాలి సింగూర్, మంజీర ప్రాజెక్టులకు నిధులివ్వాలి మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీపీఎం -
తెలంగాణ సాహిత్య శిఖరం.. సిధారెడ్డి
సిద్దిపేటఎడ్యుకేషన్: తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ఐదు దశాబ్దాలుగా సాహితీ రంగంలో అలుపెరుగని సేవచేస్తూ సాంస్కృతిక పునరుజ్జీవంలో జీవరేఖగా నిలిచాడని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ మట్టా సంపత్‌కుమార్‌రెడ్డి అన్నారు. విశ్రాంత అధ్యాపకులు సిధారెడ్డికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సోమవారం కళాశాల తెలుగు విభాగం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిధారెడ్డి సిద్దిపేట గడ్డకు గర్వకారణమన్నారు. సాంస్కృతిక వారసత్వపు బిడ్డగా, కవిగా, రచయితగా, పరిశోధకుడిగా అనేక సేవలను అందించారన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న వేదన, భయం, సంఘర్షణలను ప్రతిబింబిస్తూ ఆయన రచించిన అనిమేష కవితా సంపుటికి పురస్కారం లభించడం ఆనందంగా ఉందన్నారు. అధ్యాపకులు పిట్లదాసు, నారోజు వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణ జీవితాన్ని అక్షరీకరించిన కలానికి దక్కిన గౌరవమని కొనియాడారు. సిధారెడ్డికి అభినందనలు : జిల్లా కవులు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సిద్దిపేటకు చెందిన డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం గర్వకారణమని, జిల్లా కవులు సోమవారం పేర్కొన్నారు. అవార్డుకు ఎంపికవ్వడంపై సిద్దిపేట జాతీయ సాహిత్య పరిషత్, మంజీర రచయితల సంఘం, శ్రీవాణి సాహిత్య పరిషత్, సుగుణ సాహితీ సమితి, అక్షర సేద్యం ఫౌండేషన్, సిద్దిపేట రచయితల సంఘాలకు చెందిన కవులతో పాటు వివిధ కవులు నందిని సిధారెడ్డికి అభినందనలు తెలిపారు.సాంస్కృతిక పునరుజ్జీవంలో జీవరేఖ -
మందుబాబులకు జరిమాన
సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుపడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి వివరాల ప్రకారం... ఆదివారం అర్ధరాత్రి పట్టణంలో తదితర చోట్ల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఏడు మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపరచగా జిల్లా మెదటి అదనపు న్యాయమూర్తి ఒకరికి రూ.1500, ఆరు మందికి రూ.1000 చొప్పున జరిమాన విధించారు. నిందితుడికి 20 ఏళ్ల జైలుమెదక్ కలెక్టరేట్: చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన అటెండర్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని రేగోడ్ మండలంలో ఓ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న సారా జైపాల్(25) అదే పాఠశాలలో చదువుతున్న చిన్నారిపై 2019 జూన్‌లో లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. సోమవారం మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే బాధితురాలికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించారు. అప్పుల బాధతోరైతు ఆత్మహత్యదుబ్బాకరూరల్: అప్పులు తీర్చలేక మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని రఘోత్తంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కీర్తి రాజ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నల్ల దేవిరెడ్డి(70) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నేళ్ల నుంచి దేవిరెడ్డికి అతని సోదరుల మధ్య భూ వివాదం కొనసాగుతుంది. ఏడాది క్రితం దేవిరెడ్డి అప్పులు చేసి తన కుమారుడి వివాహం చేశాడు. అయితే అప్పులు తీర్చడానికి భూమిని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాడు. కాగా భూమి విషయంలో గొడవల కారణంగా వివాదం పరిష్కారం కాలేదు. ఇటు వివాదం పరిష్కారం కాక, చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. -
భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాలు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని వెంకటాపూర్(ఆర్) గ్రామంలో వీరవేంకట సత్యనారాయణస్వామి ఆలయంలో సోమవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా గ్రామ పురోహితుడు బాపుశర్మ, మనోజ్శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీకుమార్, ఉపసర్పంచ్ మౌనిక, నాయకులు భాస్కర్‌రెడ్డి, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి
సిద్దిపేటరూరల్: కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని నాయీబ్రాహ్మణులు డిమాండ్ చేశారు. ములుగు మండలం కొక్కొండ గ్రామంలో నాయీబ్రాహ్మణుల బొందల గడ్డను కబ్జా చేస్తూ కులం పేరుతో దూషించారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్ ఏఓకు ఆ సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు యాద నరేందర్ మాట్లాడుతూ నాయీబ్రాహ్మణుల బొందలగడ్డను కబ్జాను అడ్డుకుంటే కులంపేరుతో దూషిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మల్లేశ్, రవి, ఆంజనేయులు, నరేశ్, నవీన్, క్రాంతికుమార్, వినోద తదితరులు పాల్గొన్నారు. డీఎల్పీఓ విచారణ శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని గూడూర్ గ్రామ పంచాయతీలో సోమవారం డీఎల్పీఓ యాదయ్య విచారణ చేపట్టారు. పంచాయతీ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందిన వార్డు సభ్యుడు గొల్ల యాదయ్యపై ఓడిపోయిన అభ్యర్థి శ్రీకాంత్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. కాగా సివిల్ కాంట్రాక్టర్‌గా యాదయ్య పోటీ చేయడం ఎన్నికల నిబంధలనకు వ్యతిరేకమన్న ఫిర్యాదు మేరకు సోమవారం డీఎల్పీఓ గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి నివేదిక జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య, ఎంపీఓ తిరుపతిరెడ్డి ఉన్నారు. గాలికుంటు టీకాలు వేయించాలిజిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య కౌడిపల్లి(నర్సాపూర్): పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం తప్పనిసరిగా టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య తెలిపారు. సోమవారం మండలంలోని తునికిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి సోకడం వల్ల పాల ఉత్పత్తి తగ్గి రైతులకు ఆర్థికంగా నష్టం వస్తుందన్నారు. ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తుందని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ రామకృష్ణ, వైద్యసిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. గ్యాస్ కొరతను పరిష్కరించాలి గజ్వేల్‌రూరల్: యుద్ధం సాకుతో గ్యాస్ ధరలు పెంచవద్దని, ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణ, రాజేశం మాట్లాడుతూ యుద్ధం వల్ల మన దేశంలో ఆయిల్ కొరత ఏర్పడటంతో గ్యాస్‌కు ఇబ్బంది జరుగుతున్నట్లు ప్రభుత్వమే చెబుతున్నదన్నారు. గ్యాస్ కొరతను ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే దేశ ప్రధాని నరేంద్రమోడీ అమెరికాపై ఒత్తిడి తెచ్చి యుద్ధం ఆపేలా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు శ్రీను, చంద్రం, శంకరయ్య, నర్సింలు, రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వాహనం ఢీకొని మహిళకు గాయాలు నిజాంపేట(మెదక్): గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని కల్వకుంట క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా... నార్లాపూర్ గ్రామానికి చెందిన గాళం సంతోషకు కల్వకుంట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ప్రాథమిక చికిత్సచేసి అంబులెన్స్‌లో సిద్దిపేటకు తరలించారు. -
తెలంగాణ మట్టి సాహిత్యానికి పురస్కారం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన అనిమేషకు కేంద్ర సాహిత్య పురస్కారం వరించడం అంటే తెలంగాణ మట్టి సాహిత్యానికి వరించిన పురస్కారం లాంటిదని, మంజీర రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రంగాచారి, సిద్దంకి యాదగిరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంజీర రచయితల సంఘం సభ్యులు సోమవారం జిల్లా కేంద్రంలో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ‘‘అనిమేష’’ కావ్యం సమకాలీన భావజాలాన్ని ప్రతిబింబిస్తూ మానవ అనుభూతులను లోతుగా ఆవిష్కరించిన ప్రాముఖ్యమైన కృతి అన్నారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అభివృద్ధికి విశేష సేవలు అందించిన మహత్తర సాహితీవేత్త అని పేర్కొన్నారు. సంఘం సభ్యులు తోట అశోక్, భగవాన్ రెడ్డి, పప్పుల రాజిరెడ్డి, పొన్నాల బాలయ్య, పాపయ్య, కొమురవెల్లి అంజయ్య, రాజు, అలాజ్ పూర్ శ్రీనివాస్, తైదల అంజయ్య, తిరుపతిరెడ్డి, బుచ్చి రాజ్యం రెడ్డి పాల్గొన్నారు. -
జిల్లాలో బర్డ్‌ఫ్లూ లేదు..
పాపన్నపేట(మెదక్): మండలంలో గుర్తు తెలియని వ్యాధితో వేలాది కోళ్లు మృత్యువాత’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి జిల్లా పశు వైద్యాధికారి వెంకటయ్య స్పందించారు. ఈ మేరకు లింగాయపల్లికి తమ సిబ్బంది వెళ్లి విచారణ జరిపినట్లు తెలిపారు. ఒక షెడ్డులో సుమారు వెయ్యి కోళ్లు చనిపోగా ,మిగతా వాటిని కంపెనీ వారు తీసుకెళ్లారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదన్నారు. అయితే చనిపోయిన కోళ్లకు పరీక్షలు జరిపారా? అని ప్రశ్నించగా ఇక్కడ అలాంటి అవకాశం లేదని, వాటి అవశేషాలను బెంగళూర్ పంపాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి పరీక్షలు జరపకుండానే బర్డ్ ఫ్లూ లేదని చెప్పడం అనుమానాలకు దారి తీస్తుంది. ఇతర గ్రామాల్లో కూడా కోళ్లు చనిపోయినట్లు తెలుస్తుంది. కాగా కొక్కెర వ్యాధితో కోళ్లు చనిపోయి ఉండొచ్చన్నారు. వేసవిలో కోళ్ల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుబ్రత పాటించాలని కోరారు. కొక్కెర వ్యాధితో చనిపోయి ఉండవచ్చు జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య -
దుబ్బాక ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
దుబ్బాక: దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో మహిళకు సోమవారం అరుదైన ఆపరేషన్ చేశారు. వివరాలు ఇలా... కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన రత్నగారి లత సంవత్సరం నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంది. చాలా ఆస్పత్రుల చుట్టూ తిరిగినా తగ్గకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఆమె దుబ్బాక ఆస్పత్రికి వెళ్లింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను సూపరింటెండెంట్, డాక్టర్ హేమరాజ్‌సింగ్ పరీక్షించి కడుపులో మల్టీపుల్ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నట్లు గుర్తించారు. రక్తం తక్కువగా ఉండటంతో 3 యూనిట్ల రక్తం ఎక్కించి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసి కడుపులోంచి 7.1కిలోల గడ్డలను తొలగించారు. ప్రస్తుతం లత ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రాణాలు కాపాడిన డా.హేమరాజ్ సింగ్, వైద్యులు రాఘవేందర్ ,శ్రేయ, సనందను అభినందించారు. -
పాతాళం
జలం..అడుగంటుతున్న భూగర్భ జలాలు చిన్న శంకరంపేట మండలంలోనిచందాపూర్లో ఓ రైతుబోరు జిల్లాలో సగటున 10.67 మీటర్ల లోతులో గతేడాదితో పోలిస్తే 2.58 మీటర్లపైనప్రతీనెల మీటరున్నర పడిపోతున్న వైనంనార్సింగి మండలంలో అత్యధికంగా 19 మీటర్ల లోతుకు.. జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. కాగా మెతుకు సీమలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేకపోవటంతో నూటికి 95 శాతం రైతులు బోరుబావుల ఆధారంగానే వ్యవసాయం చేస్తున్నారు. ఈ యాసంగిలో 2.75 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా అందులో 2.33 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కేవలం 22 వేల ఎకరాల్లో మాత్రమే ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. కాగా వరి పంటకు నిత్యం నీటి తడులు పెట్టాల్సి ఉంటుంది. దీంతో నిరంతరం బోరుబావులు నడుస్తుండటంతో భూగర్భ జలాలు రోజురోజుకు పాతాళానికి పడిపోతున్నాయి. జనవరిలో 9.36 మీటర్ల లోతులో ఉండగా ఫిబ్రవరిలో 10.67 మీటర్లకు పడిపోయాయి. ఈ లెక్కన 1.31 లోతుకు పడిపోయాయి. జిల్లాలోని శివ్వంపేట మండలంలో 7.33 మీటర్లలో ఉండగా పాపన్నపేట మండలంలో 7.87 మీటర్ల లోతులో ఉన్నాయి. కాగా నార్సింగి మండలంలో మాత్రం అత్యధికంగా 19.28 మీటర్లలోతుకు పడిపోయి ప్రమాద స్థాయికి చేరుకుంది. చేగుంట, హవేళిఘనాపూర్ మండలాల్లో 8 మీటర్ల లోతులో ఉండగా మెదక్, టేక్మాల్, వెల్దుర్తి మండలాల్లో మాత్రం 9 మీటర్ల లోతులో నీరు ఉంది. జిల్లాలో భూగర్భజలాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ముఖ్యంగా మెదక్ మున్సిపాలిటీ ప్రాంతంలోని పిల్లికొటాల్ శివారులో కేవలం 3.60 మీటర్ల లోతులోనే ఉండటం గమనార్హం. అలాగే హవేళిఘనాపూర్ మండలం కూచన్‌పల్లి గ్రామ శివారులో 4.5 మీటర్లలోతులో ఉండగా అత్యధిక లోతులో తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో శివారులో ఏకంగా 25.24 మీటర్ల లోతుకు పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే.. కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడు భూగర్భ జలాలు కాస్త మెరుగనే చెప్పాలి. 2025 ఫిబ్రవరిలో 13.25 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రం 10.67 మీటర్లలో ఉన్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 2.58 మీటర్ల పైనే భూగర్భజలాలు ఉన్నాయి.మెదక్‌లో పైన.. తూప్రాన్‌లో అడుగున!మండుతున్న ఎండలు ఒకవైపు, నిరంతరం బోరు మోటార్లు నడుస్తుండటంతో భూగర్భ జలాలు రోజు రోజుకు పడిపోతున్నాయి మరోవైపు. ప్రతి నెల సగటున మీటరున్నర లోతుకు వెళ్తున్నాయి. ఏప్రిల్, మేలో మరింత దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సగటున ఫిబ్రవరికి సంబంధించి 10.67 మీటర్ల లోతులో ఉన్నాయి. కానీ గతేడాదితో పోలిస్తే మాత్రం 2 మీటర్ల పైన ఉన్నటు లెక్కలు చెబుతున్నాయి. మెదక్‌జోన్: -
అదుపుతప్పి ఆటో బోల్తా
శివ్వంపేట(నర్సాపూర్): అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ సంఘటన తూప్రాన్– నర్సాపూర్ హైవేపై సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా... తూప్రాన్ నుంచి నర్సాపూర్‌కు ఐస్‌క్రీమ్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ ఆటో అదుపుతప్పి కుడివైపునకు వెళ్లి రాజన్నవాగు బ్రిడ్జిపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఎదురుగా ఇతర వాహనాలు రాకపోడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రెవర్‌తో పాటు ఆటోలో మరో వ్యక్తి ఉన్నా వారికి ఎలాంటి గాయాలు కాలేదు. బ్రిడ్జిపై బోల్తాపడటంతో ఇతర వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లెలగడ్డలో పాలవ్యాన్.. హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో సోమవారం పాలవ్యాన్ బోల్తా పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం... సిద్దిపేట నుంచి హుజురాబాద్‌కు వెళ్తున్న పాల వ్యాన్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. అందులో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు కావడంతో వారిని ప్రైవేటు వాహనంలో హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
చేర్యాల(సిద్దిపేట): మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని శభాష్‌గూడెంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, కొమురవెల్లి పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఉల్లంపల్లి గణేశ్(29) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాగుడుకు బానిసైన అతడు పని చేయగా వచ్చిన డబ్బులు మొత్తం మద్యానికి ఖర్చు చేస్తుండటంతో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గణేశ్ సోమవారం బావి వద్ద ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్దలతో.. జిన్నారం (పటాన్చెరు): భార్యాభర్తల మధ్య మనస్పర్దలతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం... గుమ్మడిదలకు చెందిన పోచగారి రాజిరెడ్డి (43) యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన కవితతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి బాబు, పాప సంతానం. కాగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తతో గొడవపడిన కవిత సొంతూరుకు వెళ్లింది. మనస్తాపం చెందిన భర్త సంజీవరెడ్డి సోమవారం స్థానిక బావి వద్ద విద్యుత్ హైటెన్షన్ స్తంభానికి చీరతో ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
బలవంతపు వసూళ్లు చేయొద్దు
పాపన్నపేట(మెదక్): ట్రాన్స్జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ ప్రసన్నకుమార్ హెచ్చరించారు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ట్రాన్స్జెండర్లు..మండల వాసులతో అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ సమాజంలో ట్రాన్స్జెండర్లు అంటే అందరికీ సానుభూతి, గౌరవం ఉంటుందన్నారు. అందువల్ల ప్రజలతో మమేకమై, హుందాగా బతుకాలని పిలుపునిచ్చారు. సీఐ జార్జ్ మాట్లాడుతూ.. శుభకార్యాలకు వచ్చే ట్రాన్స్ జెండర్లు ఇష్టంతో ఇచ్చే డబ్బులను సంతోషంగా స్వీకరించాలని చెప్పారు. అనవసరంగా శాపాలు పెడుతూ, ఇబ్బంది పెట్టొద్దన్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు సమాజంలో భాగమమేనన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి వివాహాలు చేస్తుంటే, వారి నుంచి బలవంతంగా వసూళ్లు చేయడం తగదన్నారు. ట్రాన్స్‌జెండర్స్ జిల్లా ప్రతినిధి అంజలి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు కూడా మనుషులేనన్నారు. వారి పట్ల సమాజంలోని కొంత మంది ప్రవర్తిస్తున్న తీరు బాధగా ఉంటుందన్నారు. తాము కూడా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టిందని జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ హేమభార్గవి అన్నారు. ట్రాన్స్జెండర్ల వేధింపులపై తమకు తరచుగా ఫిర్యాదులు అందుతున్నాయని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ట్రాన్స్జెండర్లకు డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచన -
మొగులు.. గుబులు
భయపెడుతున్న అకాల వర్షాలు ● వాతావరణ మార్పులతో రైతుల్లో కలవరం ● పాలు పోసుకునే దశలో వరిచేలుజహీరాబాద్లో..కన్‌సాన్‌పల్లిలో కురిసిన వడగళ్లు దుబ్బాక: రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. 20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలో పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఈదెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ వాతావరణంలో మార్పులు అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈనెల 20 వరకు గాలివానతో కూడిన భారీ వర్షాలు, వడగళ్లు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి గాలిదుమారంతో పాటు చిరు జల్లులు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో వడగళ్లు పడుతాయన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంటలకు తీవ్ర నష్టం 20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలోని వివిధ మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, బీర్నీస్, కూరగాయ, మామిడి తోటలకు భారీగా నష్టం ఏర్పడింది. ఆ నష్టం నుంచి కోలుకోకముందే మళ్లీ వర్షాలు పడుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు కలవరపాటుకు గురవుతున్నారు. అందోల్, జహీరాబాద్‌లో వడగళ్లు వట్పల్లి(అందోల్)/జహీరాబాద్‌టౌన్: అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి, రాంసాన్పల్లి, నేరడిగుంట తదితర గ్రామాల్లో జహీరాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వడగళ్ల వాన దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు ఎండ కాచి సాయంత్రానికి వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఇంటి వాకిలిలో పడ్డ వడగండ్లను కొంతమంది ఏరుకుని తిన్నారు. నీళ్లు ఇంకిన బోరుబావులకు, వాడిపోతున్న వరి పంటకు ఈ వర్షం మేలు చేకూర్చగా..ఈదురుగాలులకు మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఇక వడగళ్ల వానకు మామిడి కాత నేలరాలింది. గత 15 రోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న ఆయా గ్రామాల ప్రజానీకానికి ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఖేడ్‌లో ఈదురుగాలులతో వర్షం నారాయణఖేడ్:ఖేడ్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసింది. కురిసిన వర్షం మనూరులో 24.2 మి.మీలు, సిర్గాపూర్‌లో1.8, ఖేడ్, నాగల్గిద్దలో 0.8 మి.మీల చొప్పున, కంగ్జిలో 0.4 మి.మీలుగా నమోదైంది. బలంగా వీచిన ఈదురు గాలులకు సిర్గాపూర్ మండలం చందర్ నాయక్ తండా పంచాయతీ పరిధి లోని వాలునాయక్ తండాలో శంకర్‌కు సంబంధించిన రేకుల ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో కుటుంబీకులు నిరాశ్రయులయ్యారు. సర్పంచ్ రుక్మిణిపూల్సింగ్, పంచాయతీ కార్యదర్శి రఫీక్ ఇంటిని సందర్శించారు. నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించి పరిహారం అందించేలా కృషి చేస్తామని సర్పంచ్ హామీనిచ్చారు. గాలులకు ఖేడ్ డివిజన్ పరిధిలోని పలుచోట్ల మామిడి కాయలు రాలిపడటంతో నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.పొట్టకొచ్చిన వరి జిల్లాలో 60 శాతానికి పైగా వరి పంటలు పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఇప్పుడు గాలివాన, వడగళ్లు పడితే తీవ్ర నష్టం వాటిళ్లే అవకాశం ఉంది. జిల్లాలో ఈయాసంగిలో 5 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఇందులో 3.53 లక్షల ఎకరాల్లో వరిని వేశారు. జిల్లాలో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్ జలశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో రైతులు వరి సాగు చేశారు. రైతులు రూ. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు వేసుకోగా, తీరా చేతికొచ్చే దశలో ప్రకృతి ఆగం జేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఆద్యంతం.. భక్తి పారవశ్యం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజామున వరకు ఈ కార్యక్రమం ఉత్కంఠ భరితంగా సాగింది. మల్లన్న నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. భారీ సంఖ్యలో భక్తులు అగ్నిగుండాలను దాటారు. స్వామివారి కల్యాణ వేదిక ప్రాంగణంలో ఆదివారం రాత్రి 7.15 గంటలకు వీరభద్ర ప్రస్థానం, భద్రకాళి పూజ, 9 గంటలకు బియ్యం సుంకు పట్టుట. 12 గంటలకు అగ్నిగుండాల ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు గురుపూజ, బలిహరణ, అగ్నిగుండాల ప్రవేశం, విజయోత్సవం, 11 గంటలకు స్వామి అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకం, మహామంగళహారతి, మంత్రపుష్పం.. అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అగ్నిగుండాల కార్యక్రమం శివశంకర శివాచార్య మహాస్వామి సేడం పీఠాధీశుల ఆధ్వర్యంలో కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, ఏఈఓలు సుదర్శనం, బుద్ధి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం
రూ.47 కోట్లువసూలైందిరూ.111 కోట్లుసంగారెడ్డి జోన్: జిల్లాలోని మున్సిపాలిటీలలో ఈ ఆర్థిక ఏడాది పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు మరో 16 రోజులు మాత్రమే గడువు మిగిలిఉంది. కాగా, ఇప్పటివరకు జిల్లాలో 50% మాత్రమే పన్ను వసూలైంది. సమయం తక్కువగా ఉండటంతో ఆ శాఖ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూళ్లు వేగిరం చేస్తున్నారు. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో అంతలోపు పన్ను వసూళ్లు 100% పూర్తవుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఉన్న 11 మున్సిపాలిటీలలో ఈ ఆర్థిక ఏడాదికిగాను రూ.111.55 కోట్ల మేర వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సోమవారం వరకు జిల్లావ్యాప్తంగా రూ.47.04లక్షలు మాత్రమే వసూలైంది. గడ్డపోతారం మున్సిపాలిటీలో అత్యధికంగా వసూలు కాగా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో అతి తక్కువగా పన్ను వసూలైంది. ఐదు మున్సిపాలిటీలలో 50% వసూలు కాగా మిగతా 6 మున్సిపాలిటీలలో సగం కూడా పూర్తి కాలేదు. ఇంటి పన్నుతోపాటు నీటి, వృత్తి వ్యాపార పన్ను వసూళ్లలో వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు ఇంటింటికి తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. పన్ను చెల్లించిన వారికి అక్కడే రశీదును అందిస్తున్నారు. ఇక పన్ను చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా పన్ను చెల్లించాలనుకునేవారికి http://cdma.telanga na.gov.in వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించారు. వసూలైన పన్ను మొత్తాన్ని ఏరోజుకారోజు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీల అభివృద్ధికి వివిధ రకాల నిధులు మంజూరు చేస్తుంటాయి. వీటితోపాటు స్థానిక వనరులతో ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. వివిధ రకాల పేర్లతో వసూలైన పన్నులతో ఆయా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తిరిగి ఖర్చు చేస్తుంటారు. -
ఉద్యమాలను ఆపలేరు
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావుపటాన్చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్ వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ సందర్భంగా ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నా జయప్రదం కోసం వెళ్తున్న సీఐటీయూ నాయకులను, అంగన్వాడీ టీచర్ల హెల్పర్లను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ...అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రశాంతంగా చలో హైదరాబాద్‌కు వెళ్తుంటే అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చినా అరెస్టు చేయడం దారుణమన్నారు. బడ్జెట్ సమావేశాలలో ఐసీడీఎస్ పరిరక్షణ కోసం తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మంజుల, విజయలక్ష్మి, అనిత, రాణి, లక్ష్మి, గాయత్రి, అక్షద, కృష్ణవేణి, స్వరూప, మందాకిణి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి మండలంలోని శిశు మందిర్ పాఠశాలలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయఅవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, ధర ప్రమాణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. వస్తువులో నాణ్యత లోపించినప్పుడు ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నరసింహగౌడ్, కూనవేణు గోపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణిలో 57 అర్జీలు
సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి 57 అర్జీలు వచ్చినట్లు అదనపు కలెక్టర్ పాండు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి హాజరైన ప్రజల నుంచి అదనపు కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్‌కలెక్టర్ ఉమాహారతి దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పాండు ఆదేశించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ ఉమాహారతి తదితరులు పాల్గొన్నారు. ఖేడ్‌లో ఇఫ్తార్ విందునారాయణఖేడ్: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ఖేడ్‌లో ప్రభుత్వపరంగా ముస్లింలకు రెహమాన్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, తహశీల్దార్ హసీనాబేగమ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు రషీద్, తాహెర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముంతాజ్, నాయకులు వినోద్‌పాటిల్, వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు వివేకానంద్, రాజు, సుబూర్, మహేశ్, లక్ష్మణ్, నాయకులు పండరీరెడ్డి, మైనొద్దీన్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. కోదండ రామాలయ ఉత్సవ కమిటీ నియామకంజిన్నారం(పటాన్చెరు): జిన్నారం పట్టణ కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో రానున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ప్రకటించారు. ఉత్సవ కమిటీ చైర్మన్‌గా ఎర్రంతగారి ఆంజనేయులు యాదవ్, సభ్యులుగా చేరికారి గోవర్ధన్‌రెడ్డి, గోకర్ వెంకటేశంగౌడ్, లక్ష్మీ సంజీవ, అర్చకులు లక్ష్మణాచార్యులు నియామకమయ్యారు. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ తన నివాసంలో ఉత్సవ కమిటీ నియామక పత్రాన్ని చైర్మన్‌కు అందజేశారు. నూతన కమిటీని ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, పుట్టా నర్సింగరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాతృమూర్తికి హరీశ్‌రావు పరామర్శపటాన్చెరు: కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న ఎమ్మెల్యే గూడెం మహి పాల్‌రెడ్డి మాతృమూర్తి గూడెం మాణెమ్మని సోమ వారం ఉదయం మాజీమంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హరీశ్‌రావుతోపాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యేతోపాటు వారి కుటుంబ సభ్యులకు హరీశ్‌రావు సూచించారు. -
రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు సదాశివపేట రూరల్(సంగారెడ్డి): గ్రామీణ పేద ప్రజల పొట్ట కొట్టే వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, ఎంపీడీఓ లక్ష్మికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత 20 ఏళ్లుగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం దుర్మార్గమన్నారు. దీంతో కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఈ పథకానికి దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, మండల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
అన్నదాతకు భరోసా
● 22 నుంచి పెట్టుబడి సాయం ● మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ మెదక్ అర్బన్: అన్నదాతల ఎదురుచూ పులు ఫలించే వేళ ఆసన్నమైంది. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదటి విడత రైతు భరోసా విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలో సుమా రు 2,62,043 రైతులకు గానూ రూ.220.84 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఎకరానికి రూ.6 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మూడు సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించారు. 2023–24 యాసంగి సీజన్లో ఎకరానికి రూ. 5 వేలు, 2024–25 యాసంగిలో రూ. 5 వేలు, 2025–26లో వానాకాలం సీజన్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, రైతు భరోసా నిధులు జమ చేయలేదు. సాగులో 2,86,225 ఎకరాలు జిల్లాలో యాసంగికి సంబంధించి 2,86,225 ఎ కరాల్లో పంటలు వేశారు. సుమారు 2,62,043 రైతులు ఉన్నారు. గత వానాకాలం లెక్కలకు సంబంధించి అప్పట్లో రైతు భరోసా కింద రూ.220,84,32,452 నిధులు విడుదలయ్యాయి. ఈసారి నిధులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధుల జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 22న ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరు లోపు మూడో విడతగా మొత్తం మంది రైతులకు భరోసా నిధులు జమచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ను వివరణ కోరగా తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని తెలిపారు. -
నమ్మించి బంగారు గొలుసు తస్కరణ
చిలప్‌చెడ్(నర్సాపూర్): వృద్ధులను నమ్మించిన ఓ దుండగుడు రెండున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. ఈఘటన మండలంలోని చిట్కుల్ శివారులో జరిగింది. ఎస్ఐ నర్సింహులు కథనం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన గాజం హిమగిరి, భర్త సుధాకర్ దంపతులు దుండిగల్‌లో వారి కూతురితో కలిసి ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం పూర్తయ్యాక గుర్తు తెలియని వ్యక్తి వారికి పరిచయమై ఆయన కారులో వారిని మండలంలోని చాముండేశ్వరి ఆలయానికి తీసుకువచ్చాడు. దర్శనం అనంతరం ఎనగండ్ల రహదారి వైపు తీసుకెళ్లి హిమగిరి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని కారుతో పారరయ్యాడు. ఈ విషయమై బాధితులు ఎస్ఐకి ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు. -
కూల్.. కూల్
మట్టి కుండ..ఎన్నో ప్రయోజనాలు మట్టి కుండలోని నీరు, ఆహారం శ్రేయస్కరమైనది జగమెరిగిన సత్యం. పుట్టిన ప్రతి జీవికి ఆహారం అందించేది నేల తల్లి. అలాంటి నేలతల్లి నుంచి సేకరించిన మట్టితో తయారుచేసిన కుండలకు ఆయుష్‌ను సైతం పెంచే శక్తి ఉంది. ఒకవైపు వేసవి తాపం రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో మట్టికుండలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం వివాహాలు బోనాలు, వ్రతాలు, కార్యాలయాలు, ఆలయాల్లో వాడకం కోసం కుండల వాడకం పెరుగుతుంది. చిన్న కుండ రూ. 200 నుంచి 300, పచ్చడి కుండ రూ. 150 నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. ప్రతి రోజు 20 నుంచి 30 కుండలపైగా అమ్మకాలు జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సంగారెడ్డి క్రైమ్/ హత్నుర(సంగారెడ్డి): మట్టి కుండలకు రాను రాను డిమాండ్ పెరుగుతోంది. అనాదిగా మనిషి జీవన విధానంతో ముడిపడిన కుండలను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయడం ఆనాయితీగా వస్తుంది. ఎండాకాలం వచ్చిందంటే చల్లదనం ఇచ్చే కుండను జనం కొనుగోలు చేస్తారు. ఇలా కొనే కుండలను ఉగాది కొత్త కుండ అని పిలుచుకుంటారు. పచ్చడితో పాటు పాలు, పెరుగు పెట్టుకోవడం కోసం ఏడాది మొత్తం ఉపయోగించుకుంటారు. ఇన్నిరకాల వంట పాత్రలు వచ్చినప్పటికీ తిరిగి ప్రాచీన కాలం నాటి మట్టి పాత్రలకే ప్రస్తుతం గిరాకీ పెరిగింది. రోడ్ల పక్కన ఇతర రాష్ట్రాల నుంచి తయారుచేసిన మట్టి పాత్రను సైతం జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన రహదారుల వెంబడి విక్రయిస్తున్నారు. వీటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. మట్టి కుండలో నీరు తాగడం మట్టి పాత్రలో వంట చేసుకోవడం ఎంతో శ్రేయస్కరమని పురాణాలు చెబుతున్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మట్టి పాత్రలకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోయింది.ఉగాది పచ్చడితో మొదలు.. వేసవి మొత్తం వాడకం పెరుగుతున్న విక్రయాలు -
● రైతుల ‘యాప్’సోపాలు
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని రుద్రారంలో ఆదివారం యారియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో యూరియా వచ్చిందని తెలుసుకొని బుక్ చేసుకునే లోపే యాప్ బుకింగ్ క్లోజ్ అయిందని రైతులు వాపోయారు. కళ్లముదు యూరియా ఉన్న ఇతర గ్రామాల వారు వచ్చి తీసుకెళ్తున్నారని, తమకు దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు యూరియా అందించేందుకు చర్యలు తీసుకుకోవాలని కోరారు. దీంతో పోలీస్‌లు గ్రామానికి చేరుకుని రైతులను సముదాయించారు. ఏఓ ప్రవీణ్‌తో మాట్లాడి విషయం వివరించగా.. సోమవారం గ్రామ రైతులకు యూరియా అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
ఇసుక టిప్పర్ సీజ్
పాపన్నపేట(మెదక్): అనుమతుల్లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను సీజ్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం మెదక్ నుంచి బొడ్మట్‌పల్లి వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్ డ్రైవర్ వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యంత్రానికి నిర్లక్ష్యపు తుప్పు శివ్వంపేట(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాల్లో ఏర్పా టు చేసిన ప్యాడీ క్లీనర్ భద్రపరచకపోవడంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తుప్పు పట్టి పోతుంది. కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు రైతులు ధాన్యాన్ని జల్లడ పట్టేందుకు దీనిని ఉపయోగిస్తారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన అనంతరం భద్రపరచాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో యంత్రం పనికిరాకుండా పోతుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ నర్సాపూర్ రూరల్: స్థల వివాదంలో ఇరుపార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడిన సంఘటన మండలంలోని రుస్తుంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ స్థలం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సర్పంచ్ వర్ష భర్త సుదీప్కుమార్కు గాయాలైనట్లు తెలిసింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మినీ బస్టాండ్ మంజూరు చేయండి
కొండపాక(గజ్వేల్): మండలంలోని చిన్నకిష్టాపూర్ క్రాస్ వద్ద మినీ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి ఎంపీ కోటాలో నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆదివారం బీజేపీ నాయకులు ఎంపీ రఘనందన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ త్వరలో నిధులు మంజూరు చేసి పనుల ప్రారంభానికి వస్తానంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అనుముల సంపత్‌రెడ్డి, తన్నీరు యాదగిరి, రెడ్డమైన పర్శ రాములు, సదానందగౌడ్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వేలాది కోళ్లు మృత్యువాత! చుక్కలనంటుతున్న చికెన్ ధరలు పాపన్నపేట(మెదక్): మండలంలో నెల రోజులుగా గుర్తుతెలియని వ్యాధితో వేలాది కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. దీంతో కోళ్ల ఫాంలు వెలవెలబోతున్నాయి. మండలంలో సుమారు 50 వరకు కోళ్ల ఫాంలు ఉన్నాయి. లింగాయపల్లి శివారులోని ఓ ఫాంలో నెల రోజుల క్రితం వేలాది కోళ్లు మృతి చెందినట్లు తెలిసింది. అలాగే పాపన్నపేటలో కూడా వందల సంఖ్యలో కోడి పిల్లలు మృత్యువాత పడ్డట్లు సమాచారం. దీంతో మండలంలోని కోళ్లఫాం యజమానులు సంబంధిత కంపెనీల నుంచి కోడి పిల్లలు తీసుకోవడానికి సాహసించడం లేదు. ఇదే సమయంలో రోజు రోజుకు చికెన్ రేట్లు పెరుగుతున్నాయి. స్కిన్లెస్ కిలోకు రూ. 340, స్కిన్‌తో కలిపి కిలో రూ.320కి అమ్ముతున్నారు. ఇదే విషయమై జిల్లా పశువైధ్యాధికారి వెంకటయ్యను వివరణ కోరగా.. ఎక్కువ మొత్తంలో కోళ్లు చనిపోతే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని ల్యాబ్‌కు పంపడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తామని చెప్పారు. లారీ ఢీకొని యువకుడి మృతి మరొకరి పరిస్థితి విషమం మనోహరాబాద్(తూప్రాన్): ఓవర్టేక్ చేసే క్రమంలో కంటైనర్ వేగంగా వెళ్లి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. తూప్రాన్ మండలం ఇమాంపురానికి చెందిన అల్లా డి నిఖిల్ (20) మండలంలోని లింగారెడ్డిపేట్‌కు చెందిన మన్నె స్వామి ఇద్దరు స్నేహితులు. ఆదివారం ఉప్పల్‌లో పరీక్ష రాయడానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో దండుపల్లి వద్దకు రాగానే వెనకాల వేగంగా వచ్చిన కంటైనర్ వీరి ఢీకొట్టింది. ఈఘటనలో నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సత్యనారాయణ పిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. రుస్తుంపేట టర్నింగ్ వద్ద..నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై రంజిత్‌రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని బ్యాతోల్ గ్రామానికి చెందిన కొండిగళ్ల జంగయ్య (45) బైక్‌పై నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం రుస్తుంపేట టర్నింగ్ వద్ద జంగయ్య ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మరొకరు..సంగారెడ్డి టౌన్: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిర్గాపూర్ మండలం ఖాజాపూర్‌కు చెందిన చింతల సురేశ్ (25) వెల్నెస్ సెంటర్లో టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం ఉదయం స్టాఫ్ రూమ్‌లో పడుకున్న సురేశ్ నిద్ర లేవకపోవడంతో సిబ్బంది కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరూ రాకుండానే ఎలా తరలిస్తారని కుటుంబీకులు, ఆందోళన చేపట్టారు. -
నేటి బాలలే రేపటి పౌరులు
రామాయంపేట(మెదక్): శిశు మందిరాలు మన సంస్కృతికి నిలయాలని వీహెచ్‌పీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యంజీ పేర్కొన్నారు. పట్టణంలోని అశోక్ సింఘాల్ శిశుమందిర్ పాఠశాల నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. విశ్వభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంయేజక్ హరిస్మరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. అమ్మ ఒడి, చదువుల బడి, దేవుని గుడి బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. మన పిల్లలకు చిన్ననాటి నుంచే మంచి సంస్కారాలు నేర్పిస్తే వారిలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందుతుందని అన్నారు. శిశుమందిర్ సంస్థాపకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో లోపం వల్లే దేశంలో నేరాల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో చదువుతో పాటు దేశభక్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా విద్యార్థుల నృత్యాలు, దేశభక్తి గేయాల ఆలాపన ఆకట్టుకున్నాయి. వీహెచ్‌పీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నరసింహామూర్తి, జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యం, పాఠశాల ప్రధానాచార్యులు కవిత, ఇతర ప్రతినిధులు సంగమేశ్వర్, పండరినాధ్, రమణ తదితరులు పాల్గొన్నారు.వీహెచ్‌పీ తెలంగాణ, ఏపీ కార్యదర్శి సత్యంజీ -
లింగమూర్తికి ఎక్సలెంట్ అవార్డు
చేగుంట(తూప్రాన్): ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించినందుకు గాను చేగుంటకు చెందిన లింగమూర్తి లయన్స్ ఎక్సలెంట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అవార్డు అందుకున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. గజ్వేల్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం లయన్స్ సిద్దిపేట రీజియన్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో లింగమూర్తికి అవార్డును మెదక్ ఎంపీ రఘునందన్‌రావుతో పాటు లయన్స్ ప్రతినిధులు సంజయ్‌గుప్తా, బాబూరావు, అమర్నాథ్రావు, విజయలక్ష్మి చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు. -
మూల్యాంకనంలో తప్పులొద్దు
సిద్దిపేటఎడ్యుకేషన్: తప్పులు లేకుండా జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలని డీఐఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో ఆదివారం ప్రారంభం అయింది. ఈసందర్భంగా ఎగ్జామినర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూల్యాంకన కేంద్రం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉందని, ఇంటర్ బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అధ్యాపకులు సమయపాలన తప్పని సరిగా పాటించాలని, విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు చీప్ ఎగ్జామినర్ల వద్ద ఉంచాలని, తప్పనిసరి అయితే తప్ప వాడరాదన్నారు. కొత్తగా మూల్యాంకనం చేసేవారు మొహమాట పడకుండా సీనియర్స్ వద్ద అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు. బోర్డు అబ్జర్వర్ విజయ్‌శేఖర్ మాట్లాడుతూ.. ఓవర్, అండర్ వాల్యుయేషన్ లేకుండా విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా మూల్యాంకనం చేయాలన్నారు. కార్యక్రమంలో క్యాంపు అధికారులు సత్యనారాయణరెడ్డి, చెన్నోజు శ్రీనివాస్, సీసీఓ కూచంగారి శ్రీనివాస్, ఏసీఓలు దేవస్వామి, శివకోటి, లలిత, విషయనిపుణులు శశిధర్‌రెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.డీఐఈఓ రవీందర్‌రెడ్డి -
నేటి నుంచి ఒంటిపూట బడులు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంన్యాల్కల్ (జహీరాబాద్): ఎండల తీవ్రత అధికమవుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికశాతం పాఠశాలల్లో ఫ్యాన్లు పాడైపోవడంతో ఉక్కపోతకు విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని అనంతరం మధ్యాహ్నం భోజనం పెట్టి వదిలి పెట్టాలని సూచించింది. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో విద్యార్థులకు ఎండల నుంచి కొంత మేర ఉపశమనం లభించింది. -
భళా.. హస్తకళ మేళా
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026సంగారెడ్డిలోని టీటీడీ కల్యాణ మండపంలో కళాభారతి సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన చేనేత హస్తకళ మేళాకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మేళాలో కొండపల్లి, వేటికొప్పాక బొమ్మలు, నిర్మల్ హైదరాబాద్ మంచి ముత్యాలు, మైసూర్ రోజ్‌వుడ్, సహారన్ పూర్ ఫుడ్ కార్వింగ్, వరంగల్ చెవర్, జూట్ బ్యాగులు, బంజారా ఎంబ్రాయిడరీ, బెంగాల్ జ్యూరీ బ్యాక్స్‌లు ప్రదర్శనకు ఉంచారు. వీటితోపాటు పోచంపల్లి, నారాయణపేట, వరంగల్, ఉప్పాడ, కంది, ధర్మవరం, సిద్దిపేట, పొందూరు, వెంకటగిరి, మంగళగిరి చీరలు, చేనేత కాటన్, పట్టువస్త్రాలు, టవల్స్, చేనేత దుప్పట్లు, కర్టెన్లు, ఖాదీ మెటీరియల్స్ కూడా అమ్మకానికి ఉంచారు. –సంగారెడ్డి


