సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి
చిన్నకోడూరు(సిద్దిపేట): మెనూ ప్రకారం విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. ఆదివారం మండల పరిధిలోని అల్లీపూర్‌లోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. భోజనాన్ని పరిశీలించి, బియ్యం, కూరగాయల నాణ్యత ఎలా ఉందని ఆరా తీశారు. విద్యార్థినులను ఆప్యాయంగా పలకరించారు. నాణ్యమైన ఆహార పదార్థాలను వాడుతూ రుచికరంగా వండాలని సూచించారు. విద్యార్థినులు కడుపునిండా తినాలని, బాగా తింటేనే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని చెప్పారు. ఏమైనా లోటు పాట్లు ఉంటే ఎస్‌ఓ దృష్టికి తీసుకురావాలన్నారు. కలెక్టర్ వెంట పాఠశాల ఎస్‌ఓ, ఉపాధ్యాయులు ఉన్నారు.


