కౌడిపల్లి(నర్సాపూర్): రాములోరి పల్లకీసేవను కనుల పండువగా నిర్వహించారు. మండల కేంద్రం కౌడిపల్లిలోని శ్రీఅభయ సీతారామాలయం 33వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం పల్లకీసేవ గ్రామ సర్పంచ్, జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాకారులు వివిధ రూపాల్లో నిర్వహించిన కళాప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్వేతమల్లికార్జున్‌గౌడ్, శ్రీనివాస్‌గుప్తా, ఆలయ కమిటీ సభ్యులు, భజన మండల సభ్యులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.


