కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

Mar 30 2026 12:04 PM | Updated on Mar 30 2026 12:04 PM

మెదక్‌ కలెక్టరేట్‌: కరాటే పోటీల్లో మెదక్‌ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు కరాటే మాస్టర్‌ దినకర్‌ తెలిపారు. ఆదివారం రెంజుకి షోటోకాన్‌ కరాటే మాస్టర్‌ నగేశ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని జీకేఆర్‌ గార్డెన్‌లో పోటీలు నిర్వహించగా 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మెదక్‌ పట్టణానికి చెందిన 114 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి చాంపియన్‌గా నిలిచినట్లు తెలిపారు. బాలికల విభాగంలో దక్షిక, సహస్ర, సాయిశమీక్ష, అనన్య, జయశ్రీ, సాన్విక, విలసిని, బాయ్స్‌ విభాగంలో విహాన్‌, ఈశ్వర్‌ చంద్ర, నాగాక్షిత్‌, కతిక్‌, కౌషిక్‌, శ్రీయస్‌, శివాన్‌న్ష్‌, త్రీజల్‌, రణవీర్‌, సాయి చరణ్‌, విహాన్‌ మొత్తం 20 గోల్డ్‌ మెడల్స్‌ సాధించినట్లు తెలిపారు. వీరిని కరాటే మాస్టర్‌ అభినందించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement