రూ. 3 లక్షలు ఆస్తి నష్టం
చిలప్‌చెడ్(నర్సాపూర్): కిరాణ షాపు దగ్ధమై ఆస్తి నష్టం సంభవించింది. ఈ సంఘటన మండలంలోని జగ్గంపేటలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆదివారం బాధితుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బొలిశెట్టి ప్రభు జగ్గంపేటగేట్ వద్ద కిరాణషాపు నడుపుతున్నాడు. రోజుమాదిరిగా శనివారం రాత్రి షాపు బంద్ చేసి షాపుపై అంతస్తులో పడుకున్నాడు. అర్ధరాత్రి కిరాణాషాపులో మంటలు రావడంతో ఇరుగుపొరుగు సహాయంతో ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివరికి అగ్నిమాపక అధికారులు వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే షాపులోని సామగ్రితోపాటు పట్టాదారు పాస్‌బుక్కు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మూడు లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.


