జిల్లా యువజన అధికారి రంజిత్‌రెడ్డి
చేర్యాల(సిద్దిపేట): యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, యువత సన్మార్గంలో నడిస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని ఉమ్మడి జిల్లా యువజన అధికారి రంజిత్‌రెడ్డి అన్నారు. ఆది వారం మేరా యువ భారత్ సిద్దిపేట జిల్లా అనుబంధ వివేకానంద విజ్ఞాన్ సొసైటీ తాడూర్ ఆధ్వర్యంలో యువ మండల వికాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చేర్యాల, కొమురవెల్లి మండలాలకు చెందిన యువజన సంఘాల సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ చురుకుగా ఉన్న యువజన సంఘాలకు క్రీడా సామగ్రి అందించారు. ఈ కార్యక్రమంలో తాడూరు సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, ప్రోగ్రాం అధికారి కిరణ్ కుమార్, బాల భాస్కర్, ఉపసర్పంచ్ నరేశ్, ఈరు పవన్, రాజశేఖర్ రెడ్డి, రాజు, స్వామి, సుజిత్, బాబు, రాజేశ్ పాల్గొన్నారు.


