మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు సినీగీత రచయిత సాయిసిరికి రాష్ట్రస్థాయి గురుబ్రహ్మ ఉగాది జీవిత సాఫల్య పురస్కారం వరించింది. తెలుగు సాంస్కృతిక గీతాలను రాసి తెలుగు భాష సాంస్కృతిక వైభవ వారధిగా నిలిచినందుకు విశాఖపట్నానికి చెందిన మదర్ థెరిసా సామాజిక సేవ సంస్థ 2026 సంవత్సరానికి గాను గురుబ్రహ్మ ఉగాది జీవిత సాఫల్య పురస్కారం అందించారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ పురస్కారం అందుకున్నట్లు సాయిసిరి తెలిపారు.


