ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన అనిమేషకు కేంద్ర సాహిత్య పురస్కారం వరించడం అంటే తెలంగాణ మట్టి సాహిత్యానికి వరించిన పురస్కారం లాంటిదని, మంజీర రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రంగాచారి, సిద్దంకి యాదగిరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంజీర రచయితల సంఘం సభ్యులు సోమవారం జిల్లా కేంద్రంలో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ‘‘అనిమేష’’ కావ్యం సమకాలీన భావజాలాన్ని ప్రతిబింబిస్తూ మానవ అనుభూతులను లోతుగా ఆవిష్కరించిన ప్రాముఖ్యమైన కృతి అన్నారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అభివృద్ధికి విశేష సేవలు అందించిన మహత్తర సాహితీవేత్త అని పేర్కొన్నారు. సంఘం సభ్యులు తోట అశోక్, భగవాన్ రెడ్డి, పప్పుల రాజిరెడ్డి, పొన్నాల బాలయ్య, పాపయ్య, కొమురవెల్లి అంజయ్య, రాజు, అలాజ్ పూర్ శ్రీనివాస్, తైదల అంజయ్య, తిరుపతిరెడ్డి, బుచ్చి రాజ్యం రెడ్డి పాల్గొన్నారు.


