సిద్దిపేటఎడ్యుకేషన్: తప్పులు లేకుండా జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలని డీఐఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో ఆదివారం ప్రారంభం అయింది. ఈసందర్భంగా ఎగ్జామినర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూల్యాంకన కేంద్రం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉందని, ఇంటర్ బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అధ్యాపకులు సమయపాలన తప్పని సరిగా పాటించాలని, విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని సూచించారు. మొబైల్ ఫోన్‌లు చీప్ ఎగ్జామినర్‌ల వద్ద ఉంచాలని, తప్పనిసరి అయితే తప్ప వాడరాదన్నారు. కొత్తగా మూల్యాంకనం చేసేవారు మొహమాట పడకుండా సీనియర్స్ వద్ద అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు. బోర్డు అబ్జర్వర్ విజయ్‌శేఖర్ మాట్లాడుతూ.. ఓవర్, అండర్ వాల్యుయేషన్ లేకుండా విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా మూల్యాంకనం చేయాలన్నారు. కార్యక్రమంలో క్యాంపు అధికారులు సత్యనారాయణరెడ్డి, చెన్నోజు శ్రీనివాస్, సీసీఓ కూచంగారి శ్రీనివాస్, ఏసీఓలు దేవస్వామి, శివకోటి, లలిత, విషయనిపుణులు శశిధర్‌రెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
డీఐఈఓ రవీందర్‌రెడ్డి


