ప్రభుత్వ ఉద్యోగుల్లో నిరాశ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగుల్లో నిరాశ

Mar 21 2026 6:41 AM | Updated on Mar 21 2026 6:41 AM

సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్‌

హత్నూర(సంగారెడ్డి): రేవంత్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2026–27 ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా నిరాశ పరిచిందని ఎస్‌జీటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్‌ తెలిపారు. హత్నూరలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ..గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్‌లో 33,043 కోట్లు (11.34%) పెరిగినప్పటికీ, తెలంగాణ ఉద్యోగులు ఎదురుచూసిన పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏలు ఇతర పెండింగ్‌ బకాయిలు లేకపోవడం బాధాకరమన్నారు. విద్యారంగానికి రూ.26,674కోట్లు మాత్రమే కేటాయించారని ఇది బడ్జెట్‌లో కేవలం 8.2% మాత్రమేనని..రేవంత్‌ సర్కార్‌ ఇప్పటివరకు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్‌లలో ఈ రంగానికి కనీసం 10% నిధులు కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement