దరఖాస్తు చేసుకునే విధానం
సంగారెడ్డి జోన్: కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లకు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోటీ ప్రపంచంలో కార్పొరేట్ స్థాయిలో అధునాతన సాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ సిలబస్‌ను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ద్వారా అందిస్తుంది.
నోటిఫికేషన్ విడుదల
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలతో పాటు రెండు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 19న నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు అర్హుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. 3, 4, 5వ తరగతులకు ఏప్రిల్ 2 వరకు, 2, 6, 7, 8, 9 తరగతులకు వచ్చే నెల 2 నుంచి 8వ తేదీ వరకు సంబంధిత విద్యాలయంలో ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకటో తరగతిలో సెక్షన్‌కు 40 మంది చొప్పున 80 మందికి ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. మిగతా తరగతులలో ఆయా తరగతుల ఖాళీల లభ్యత ఆధారంగా భర్తీ చేయనున్నారు.
ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యం
మొదట కేంద్ర, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు ప్రాధాన్యత కల్పిస్తారు. ఇందులో ఎస్సీ కుటుంబాల పిల్లలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27శాతం, దివ్యాంగులకు మూడు శాతం, ఇతరులకు మిగతా సీట్లు కేటాయిస్తారు. జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం, వాటి మార్గదర్శకాలను అనుసరిస్తూ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.
ఉమ్మడి జిల్లాలో రెండు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండల పరిధిలోని మాచ్నూర్, ఓడీఎఫ్ ఎద్దు మైలారంలో ఉంది. వీటిలో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో సీట్లకు పోటీ ఉంటుంది. అన్ని రకాల వసతులతో నాణ్యమైన విద్య, క్రమశిక్షణ కలిగి ఉండటంతో ప్రాధాన్యత నెలకొంది.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో స్వీకరణ
ఏప్రిల్ 2వరకు చివరి గడువు
2 నుంచి 9 తరగతులకు ప్రవేశాలు
ఖాళీల ఆధారంగా భర్తీ
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ జారీ చేసిన ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. httpr//admirrion.kvr.gov.in, htt pr//jhararanfam.kvr.ac.in వెబ్ సైట్ ద్వారా నిర్ణీత తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలి.
నిబంధనల మేరకు ప్రవేశాలు
1వ తరగతితో పాటు మిగితా తరగతులలో ప్రవేశాలకు నోటిఫికేన్ విడుదలైంది. అర్హులైన వారు గడువు తేదీలను గమనించి దరఖాస్తు చేసుకోవాలి. కేవీ నిబంధనల మేరకు ప్రవేశాలు కల్పిస్తాం. సద్వినియోగం చేసుకోవాలి.
–మహేశ్, కేవీ ప్రిన్సిపాల్,
గ్రామం మాచ్నూర్, ఝరాసంగం


