సీఎం సభ ఏర్పాట్లపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

సీఎం సభ ఏర్పాట్లపై సమీక్ష

Mar 21 2026 6:41 AM | Updated on Mar 21 2026 6:41 AM

భద్రతా ఏర్పాట్లు చేయాలని అదనపు డీజీపీ ఆదేశం

అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్‌

నంగునూరు(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా నర్మెటలో ఈనెల 22న సీఎం రేవంత్‌రెడ్డి ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాళ్లను పరిశీలించి బహిరంగ సభా వేదిక, హెలీప్యాడ్‌, వీఐపీ పార్కింగ్‌, భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ హైమావతి, పోలీస్‌ కమిషనర్‌ రష్మీ పెరుమాళ్‌, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డితోపాటు పలువురు అధికారులతో ఆరా తీశారు. సీఎం పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల ని అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో హాజరయ్యే రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, పార్కింగ్‌, ట్రాఫిక్‌ ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.అనంతరం కలెక్టర్‌ రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, టాయిలెట్లు తదితర పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement