పాపన్నపేట(మెదక్): అనుమతుల్లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను సీజ్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం మెదక్ నుంచి బొడ్మట్‌పల్లి వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్ డ్రైవర్ వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
యంత్రానికి నిర్లక్ష్యపు తుప్పు
శివ్వంపేట(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాల్లో ఏర్పా టు చేసిన ప్యాడీ క్లీనర్ భద్రపరచకపోవడంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తుప్పు పట్టి పోతుంది. కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు రైతులు ధాన్యాన్ని జల్లడ పట్టేందుకు దీనిని ఉపయోగిస్తారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన అనంతరం భద్రపరచాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో యంత్రం పనికిరాకుండా పోతుంది.
ఇరువర్గాల మధ్య ఘర్షణ
నర్సాపూర్ రూరల్: స్థల వివాదంలో ఇరుపార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడిన సంఘటన మండలంలోని రుస్తుంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ స్థలం విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సర్పంచ్ వర్ష భర్త సుదీప్‌కుమార్‌కు గాయాలైనట్లు తెలిసింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


