నమ్మించి బంగారు గొలుసు తస్కరణ | - | Sakshi
Sakshi News home page

నమ్మించి బంగారు గొలుసు తస్కరణ

Mar 16 2026 8:58 AM | Updated on Mar 16 2026 8:58 AM

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): వృద్ధులను నమ్మించిన ఓ దుండగుడు రెండున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. ఈఘటన మండలంలోని చిట్కుల్‌ శివారులో జరిగింది. ఎస్‌ఐ నర్సింహులు కథనం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన గాజం హిమగిరి, భర్త సుధాకర్‌ దంపతులు దుండిగల్‌లో వారి కూతురితో కలిసి ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం పూర్తయ్యాక గుర్తు తెలియని వ్యక్తి వారికి పరిచయమై ఆయన కారులో వారిని మండలంలోని చాముండేశ్వరి ఆలయానికి తీసుకువచ్చాడు. దర్శనం అనంతరం ఎనగండ్ల రహదారి వైపు తీసుకెళ్లి హిమగిరి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని కారుతో పారరయ్యాడు. ఈ విషయమై బాధితులు ఎస్‌ఐకి ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement