మట్టి కుండ..
ఎన్నో ప్రయోజనాలు
మట్టి కుండలోని నీరు, ఆహారం శ్రేయస్కరమైనది జగమెరిగిన సత్యం. పుట్టిన ప్రతి జీవికి ఆహారం అందించేది నేల తల్లి. అలాంటి నేలతల్లి నుంచి సేకరించిన మట్టితో తయారుచేసిన కుండలకు ఆయుష్‌ను సైతం పెంచే శక్తి ఉంది. ఒకవైపు వేసవి తాపం రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో మట్టికుండలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం వివాహాలు బోనాలు, వ్రతాలు, కార్యాలయాలు, ఆలయాల్లో వాడకం కోసం కుండల వాడకం పెరుగుతుంది. చిన్న కుండ రూ. 200 నుంచి 300, పచ్చడి కుండ రూ. 150 నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. ప్రతి రోజు 20 నుంచి 30 కుండలపైగా అమ్మకాలు జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
సంగారెడ్డి క్రైమ్/ హత్నుర(సంగారెడ్డి): మట్టి కుండలకు రాను రాను డిమాండ్ పెరుగుతోంది. అనాదిగా మనిషి జీవన విధానంతో ముడిపడిన కుండలను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయడం ఆనాయితీగా వస్తుంది. ఎండాకాలం వచ్చిందంటే చల్లదనం ఇచ్చే కుండను జనం కొనుగోలు చేస్తారు. ఇలా కొనే కుండలను ఉగాది కొత్త కుండ అని పిలుచుకుంటారు. పచ్చడితో పాటు పాలు, పెరుగు పెట్టుకోవడం కోసం ఏడాది మొత్తం ఉపయోగించుకుంటారు. ఇన్నిరకాల వంట పాత్రలు వచ్చినప్పటికీ తిరిగి ప్రాచీన కాలం నాటి మట్టి పాత్రలకే ప్రస్తుతం గిరాకీ పెరిగింది. రోడ్ల పక్కన ఇతర రాష్ట్రాల నుంచి తయారుచేసిన మట్టి పాత్రను సైతం జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన రహదారుల వెంబడి విక్రయిస్తున్నారు. వీటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. మట్టి కుండలో నీరు తాగడం మట్టి పాత్రలో వంట చేసుకోవడం ఎంతో శ్రేయస్కరమని పురాణాలు చెబుతున్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మట్టి పాత్రలకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోయింది.
ఉగాది పచ్చడితో మొదలు.. వేసవి మొత్తం వాడకం
పెరుగుతున్న విక్రయాలు


