చేగుంట(తూప్రాన్): ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించినందుకు గాను చేగుంటకు చెందిన లింగమూర్తి లయన్స్ ఎక్సలెంట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అవార్డు అందుకున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. గజ్వేల్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం లయన్స్ సిద్దిపేట రీజియన్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో లింగమూర్తికి అవార్డును మెదక్ ఎంపీ రఘునందన్‌రావుతో పాటు లయన్స్ ప్రతినిధులు సంజయ్‌గుప్తా, బాబూరావు, అమర్‌నాథ్‌రావు, విజయలక్ష్మి చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు.


