రామకోటి రామరాజుకు అందించిన బాలాజీ ఆలయ బాధ్యులు
దుబ్బాక: భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల కల్యాణానికి దుబ్బాక నుంచి గోటి తలంబ్రాలు అందించారు. ఆదివారం దుబ్బాక బాలాజీ ఆలయంలో శ్రీరామకోటి రామరాజుకు భక్తులు రామ నామస్మరణ చేస్తూ గోటితో ఒలిచిన తలంబ్రాలను అందజేశారు. దుబ్బాకతో పాటు పలు గ్రామాల నుంచి వచ్చిన తలంబ్రాలకు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ.. రామయ్య కల్యాణానికి తెలంగాణ నుంచి ఈ సారి 3 క్వింటాళ్ల గోటి తలంబ్రాలను అందించాలన్న సంకల్ప దీక్షతో చేపట్టి దిగ్విజయంగా చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. భక్తులు భద్రాచలం వెళ్లలేకపోయిన తాము గోటితో ఒలిచిన తలంబ్రాలు రామయ్య కల్యాణానికి వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయం చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, అర్చకులు అచ్చి లక్ష్మినర్సింహ ఆచార్య, చింత నాగేందర్, సీబీ శ్రీనివాస్, రాజమౌళి తదితరులు ఉన్నారు.


