ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనను నిరసిస్తూ బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ నాయకులు మాట్లాడుతూ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడం సరే, మరి సిద్దిపేట నియోజకవర్గానికి రావాల్సిన నిధుల సంగతేంటని వారు ప్రశ్నించారు. గత ప్రభుత్వం సిద్దిపేటకు కేటాయించిన నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. సిద్దిపేట అభివృద్ధి పట్ల వివక్ష చూపిస్తే సహించేది లేదని, వెంటనే నిధులను విడుదల చేయాలన్నారు.


