మెదక్‌జోన్: పాతనేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సీఐ మహేశ్ కేసు వివరాలు వెల్లడించారు. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పద స్థితిలో కనిపించిన పాతనేరస్తుడు వడ్డెర కాలనీకి చెందిన వల్లెపు గోపాల్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో రెండు బైకులను దొంగిలించినట్లు నేరం ఒప్పుకున్నాడు. అతడిపై కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోరీ కేసులు ఉన్నాయి. బైకులను స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు పంపించారు.


