వాహనాలు, ఇసుక డంపులు సీజ్
తూప్రాన్: అక్రమంగా కొనసాగుతున్న ఇసుక ఫిల్టర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్‌ఐ గంగరాజు కథనం ప్రకారం... అక్రమంగా ఇసుక ఫిల్టర్లు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కిష్టాపూర్ శివార్లలో 2 ట్రాక్టర్లు, గౌడిగూడెం శివార్లలో ట్రాక్టర్, జేసీబీ యంత్రంను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే ఇసుక డంపులను గుర్తించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా కృత్రిమ ఇసుక తయారు చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


