రైతు మహోత్సవానికి పోటెత్తిన అన్నదాతలు
కూరగాయలతో సబ్బులు
నంగునూరు(సిద్దిపేట): నర్మేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో నిర్వహిస్తున్న రైతు మహోత్సవానికి శనివారం పది జిల్లాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జనగాం, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల నుంచి సుమారుగా 10 వేల మంది రైతులు హాజరయ్యారు. మహోత్సవానికి వస్తున్న రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు భోజన వసతి, మంచి నీటి సౌకర్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలతో పాటు యువ రైతులు వచ్చి అన్ని స్టాళ్లలో తిరుగుతూ విత్తనాలు, తేనె, కూరగాయలు, పండ్లు, పువ్వులతో తయారు చేసిన సబ్బులు, సెంటు, కొనుగోలు చేయడంతో స్టాల్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యానవన, ఇరిగేషన్, పట్టు పరిశ్రమ, పశుసంవర్థక శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు.
ఆకట్టుకున్న యంత్రాలు
స్టాల్‌లో వివిధ ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యయసాయ యంత్రాలు, మినీ వరి కోత మిషన్లు, ట్రాక్టర్లు, స్ప్రే చేసే వాహనాలు రైతులను ఆకట్టుకున్నాయి. యంత్రం ద్వారా ఐదు మీటర్ల వరకు పురుగుల మందు పిచికారీ చేసే పని తీరును ఆసక్తిగా గమనించారు. అలాగే డ్రైవర్ లేకుండా కొత్త టెక్నాలజీతో ముందుకు, వెనకకు నడిచే ట్రాక్టర్‌ను చూస్తూ పని తీరును నిర్వాహకుడు న్యాలకొండ శ్రీనివాస్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
నూతన వంగడాలు, కూరగాయల స్టాల్ వద్ద మహిళలు
తేనె ఉత్పత్తులను
పరిశీలిస్తున్న రైతులు
పది జిల్లాల నుంచి 10 వేలకు పైగా హాజరు
స్టాల్స్ సందర్శించి వివరాలు తెలుసుకున్న రైతులు
కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ రైతులను ఆకట్టుకుంది. పువ్వులు, పండ్లు, కూరగాయలతో తయారు చేసిన సబ్బులు, సెంటు, వైన్, జ్యూస్, అగరుబత్తులు, చర్మ వ్యాధులు, నొప్పుల నివారణ మందులు ప్రదర్శించారు. వీటి తయారీ విధానంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకరస్వామి అవగాహన కల్పించారు. ఉత్పత్తులకు రైతులు, మహిళల నుంచి మంచి స్పందన రావడంతో కొనుగోలు చేశారు.
తేనె
ఉత్పత్తిపై
అవగాహన
అపీస్ కల్చర్ జాతీయ తేనె ఉత్పత్తి కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌కు మంచి ఆదరణ లభించింది. కంపెనీ ఆధ్వర్యంలో తేనె టీగల పెంపకం, నాణ్యమైన తేనె ఉత్పత్తి విధానంపై అవగాహన కల్పించారు. రోజ్, గ్రీన్, ఆమ్లా ప్లేవర్లతో తేనె తయారు విధానాన్ని నిర్వాహకులు వివరించారు. దీంతో చాలా మంది రైతులు కొనుగోలు చేశారు.


