జహీరాబాద్ టౌన్: స్కూటీని అపహరించిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. శనివారం జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ.వినయ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. పట్టణ సమీపంలో గల బాబుమోహన్ కాలనీకి చెందిన వినోద్ తన ఫోన్ చోరీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఈ నెల 18న టీజీ 15 ఏ9672 నంబర్ గల స్కూటీపై స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసు స్టేషన్‌లో సమీపంలో పార్కు చేసి ఫిర్యాదు చేసి వచ్చే లోపు వాహనం మాయమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి కదలికను కనిపెట్టారు. శనివారం బీదర్ చౌరస్తాలో స్కూటీపై వెళ్తున్న దొంగను పట్టుకున్నారు. నిందితుడు మండలంలోని సత్వార్‌కు చెందిన ఏర్పుల శ్రీనివాస్‌గా గుర్తించారు. అతని వద్ద ఉన్న స్కూటీని స్వాధీనం చేసుకొని కోర్టులో రిమాండ్ చేశారు. వాహనాలు పార్కింగ్ చేసే సమయంలో డబుల్ లాక్ లేదా అలారం సిస్టంను ఏర్పాటు చేసుకోవాలన్నారు.


