జేఈఈ మెయిన్స్, నీట్‌కు కార్పొరేట్ తరహా కోచింగ్
● మెదక్, సంగారెడ్డి జిల్లాలో కేజీబీవీల ఎంపిక
● ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశాలు
● ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు
రెండు జిల్లాల్లో 6 కేజీబీవీల ఎంపిక
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో మూడు కేజీబీవీలను శిక్షణకు ఎంపిక చేశారు. మెదక్‌లోని కేజీబీవీలో ఐఐటీ, జేఈఈ, నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తి కేజీబీవీలో నీట్, అల్లాదుర్గ్ మండలం కేంద్రంలోని కేజీబీవీలో న్యాయవిద్య(క్లాట్)లో శిక్షణ ఇవ్వనున్నారు. సంగారెడ్డి జిల్లాలో మూడు కేజీబీవీలను ఎంపిక చేయగా... జిన్నారంలో జెఈఈ, నీట్, సదాశివపేట్‌లో ఐఐటీ, అందోల్‌లో క్లాట్‌లో విద్యార్థినులకు శిక్షణ ఇవ్వనున్నారు.


