సంగారెడ్డి క్రైమ్: చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్ సాగర్ చెరువులో ఈ నెల 21వ తేదీన శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో గుర్తుతెలియని మహిళ(45) మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద పలు రకాల పాసుపోర్టు సైజ్ ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


