నాలుగు జిల్లాల నుంచి తరలివచ్చిన రైతులు మండలి చైర్మన్, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీ కితాబు
నంగునూరు(సిద్దిపేట): వ్యవసాయ ఆధారిత పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవకు అనూహ్య స్పందన లభించింది. గురువారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేటలో నిర్వహించిన రైతు మహోత్సవం ఏర్పాటు చేశారు. నాలుగు జిల్లాల రైతులు తరలివచ్చి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా చూశారు. వ్యయసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, ఇరిగేషన్, మార్కుఫెడ్, మత్స్యశాఖ, యంత్ర పరికరాలు, విత్తనాలు కలిపి మొత్తం 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో స్టాల్ వద్ద ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఆయిల్‌పామ్ పంటలను ఆసక్తిగా గమనిస్తూ పంట సాగు, లాభాలు, తమ ప్రాంతంలో పంట అనుకూలంగా ఉంటుందా అంటూ ఆరా తీశారు.
ఆదర్శ రైతుకు సన్మానం
నంగునూరు మండలం అక్కేనపల్లిలో మొదట పామాయిల్ పంట సాగు చేసి, మొట్ట మొదట నర్మేట ఫ్యాక్టరీలో అమ్మిన మహిళా రైతు భాగ్యలక్ష్మి, నాగేంద్రం లను మండలి చైర్మన్, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. తాను ఇప్పటి వరకు రూ.13 లక్షల లాభ గడించానని చెప్పడంతో స్పందించిన తుమ్మల నాగేశ్వర్‌రావు.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి పంట సాగు చేయాలని చెప్పమనడంతో నవ్వులు విరిశాయి.
అనూహ్య స్పందన


