వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కూరగాయల పంటలను స్టాల్‌లో ఏర్పాటు చేశారు. అలాగే వాటి నుంచి సేకరించిన విత్తనాలను తక్కువ ధరకు అమ్మారు.
యంత్రాల పనితీరుపై..
స్టాల్‌లో వివిధ కంపెనీల అందిస్తున్న అధునాతన యంత్రాలు, ట్రాక్టర్లు, రొటోవేటర్లు, పిచికారీ యంత్రాలను ప్రదర్శించారు. డ్రిప్, స్పీంక్లర్ల ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలో ఆయా కంపెనీల ప్రతినిఽధులు రైతులకు వివరించారు.
ఆకట్టుకున్న విదేశీ కోళ్లు
పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దేశవాళి ఆవులు, గేదెలు, గొర్రెలు, విదేశీ కోళ్ల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అందిస్తున్న సబ్సిడీలను వివరించారు. పేడతో జీవామృతం, బీజామృతం, సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలో వివరించారు.
ఆయిల్‌పామ్ సాగు..
ఆయిల్‌ఫెడ్ అధికారులు ఆయిల్‌పామ్ మొక్కలు, గెలలు, గింజలు, వాటి నుంచి వచ్చిన నూనె, పిప్పిని స్టాల్‌లో ప్రదర్శించారు. తెలంగాణ లోని అన్ని జిల్లాల నుంచి క్రూడ్ ఆయిల్‌ను సేకరించి విజయ బ్రాండ్ పేరిట నూనె ప్యాకెట్లు తయారు చేస్తామని రైతులకు వివరించారు. అలాగే ఆయిల్ తీసిన తరువాత వచ్చిన పిప్పితో ఫ్యాక్టరీకి అవసరమయ్యే విద్యుత్‌ను ఏలా ఉత్పత్తి చేస్తారో వివరించారు.


