మాధవానంద సరస్వతి స్వామి
తొగుట(దుబ్బాక): మండలంలోని పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాంపురం కోటిలింగాల దేవాలయంలో ఆలయ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ధర్మానికి కట్టుబడిన మహానుభావుడని కొనియాడారు. సత్యం, కర్తవ్యమే పరమావధి అని చాటిన ఆదర్శరాజు శ్రీరాముడని చెప్పారు. ప్రతిఏటా నిర్వహించే సీతారాముల కల్యాణం ఆధ్యాత్మిక ఉత్సవమని తెలిపారు. ప్రజలు భక్తి నైతిక విలువులు ధర్మబద్దత పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం స్వామి వారి పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు.
5న హిందూ సమ్మేళన్
తాండూరు టౌన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాల విజయగాథను గుర్తు చేసుకునేందుకు ఏప్రిల్ 5న పట్టణంలోని ఆదర్శ తులసీ నగర్, సాయిపూర్‌లలో హిందూ సమ్మేళన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు ముదెళ్లి అశోక్ తెలిపారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. హిందూ సమాజం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకితభావం వంటివి వికసించేందుకు హిందూ బంధువులందరినీ సమ్మేళనం చేస్తున్న ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా తరలిరావాలని కోరారు. 5వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి పాతకుంటలోని పెద్ద పార్కుల స్థలంలో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.
బైక్‌పై వెంబడించి..
గోవులను కాపాడి
షాద్‌నగర్‌రూరల్: అక్రమంగా గోవులను తరలిస్తు న్న కంటైనర్లను హిందూవాహిని, బజరంగ్‌దళ్ సభ్యులు పట్టుకున్నారు. బైక్‌పై వెంబడించి గోవు లను అక్రమంగా తరలిస్తున్న మూడు కంటైనర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. శ్రీరామనవమి సందర్భంగా హిందూవాహిని సభ్యులు గురువారం అర్థరాత్రి పట్టణంలోని ముఖ్యకూడలిలో తోరణాలు కడుతున్నారు. అదే సమయంలో మూడు కంటైనర్లు వెళ్తున్నాయి. అనుమానం వచ్చిన వారు కంటైనర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా డ్రైవర్లు వాహనాలను ఆప కుండా అతివేగంగా వెళ్లారు. దీంతో అనుమానం వచ్చిన హిందూవాహిని, బజరంగ్‌దళ్ సభ్యులు ద్విచక్రవాహనాలతో వెంబడించి రెండు కంటైనర్లను పట్టుకోగా ఒక కంటైనర్ వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. పట్టుకున్న రెండు కంటైనర్లలో చూడగా అందులో 48 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. గోవులను వెంటనే చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలోని శ్రీకృష్ణ గోశాలకు తరలించారు. విషయం తెలియడంతో మరో వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు గోశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ సీతారాం తెలిపారు.
హత్నూర(సంగారెడ్డి): ప్రమాదవశాత్తు చెరువులో పడి మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన హత్నూరలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామే సత్యనారాయణ (46) బుధవారం సాయంత్రం గ్రామ శివారులోని చాకిచెరువు వద్ద చేపల కావలికి వెళ్లాడు. గురువారం తిరిగి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం తెల్లవారుజామున చాకిచెరువులో సత్యనారాయణ శవమై తేలాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు.


