ఆ బ్యూటీ చూపించిన తెగువకి మాటల్లేవ్‌ అంతే..! | Miss Grand Thailand's Teeth Fall Off On Stage Goes Viral | Sakshi
Sakshi News home page

హఠాత్పరిణామాన్ని ఎంత అందంగా ప్రదర్శించింది..! ఆ టైంలో కనబర్చిన..

Mar 27 2026 5:11 PM | Updated on Mar 27 2026 5:26 PM

Miss Grand Thailand's Teeth Fall Off On Stage Goes Viral

అందాల పోటీల్లో ఒక్కోసారి అనూహ్య పరిణామాలు చేసుకుంటాయి. మనం అనుకున్నట్లుగా ప్లాన్‌ ప్రకారంగా జరిగిపోవు. ఒక్కోసారి ఊహించని ఝలక్‌లు ఎదురవ్వుతాయి. ఆ సమయంలో మనం ఎలా బ్యాలెన్స్‌గా ఉన్నాం అన్నదే మేటర్‌. అలాంటప్పుడే అసలైన టాలెంట్‌ బయటకొస్తుంది. అందుకు ఈ అందాల భామే ఉదాహరణ.

ఇటీవల బుధవారం జరిగి మిస్‌ గ్రాండ్‌ థాయ్‌లాండ్‌ అందాల పోటీలో ఓ బ్యూటీకి అనూహ్య పరిణామం ఎదురైంది. అయితే ఆ లోపాన్ని ధైర్యంగా ఎదుర్కొందే తప్ప ఆందోళనకు తావి ఇవ్వకపోవడం విశేషం. మిస్‌గ్రాండ్‌ పతుమ్‌ థాని కమెల్వాన్‌ చనాగో బ్యూటీ తనను తాను పరిచయం చేస్తుండగా అకస్మాత్తుగా కట్టుడు పళ్లు ఊడిపోయాయి. 

కానీ ఆమె సమయస్పూర్తితో స్పందించి..ఆ వేదిక మీదే వెనుతిరిగి సరిచేసుకుని ఆ వెనువెంటనే ఆత్మవిశ్వాసంతో ర్యాంప్‌ వాక్‌  కొనసాగించింది. ఆ ఆకస్మిక ఘటనకు కించెత్తు టెన్షన్‌ పడకుండా వెంటనే వెనుకకు తిరిగి సరిచేసుకుని, నవ్వుతూ ర్యాంప్‌ వాక్‌ చేసింది. పైగా మెరిసే గౌనుతో కెమరాకు అందంగా ఫోజులు కూడా ఇస్తూ..తన పళ్లను మరోసారి ప్రదర్శించింది. 

అయితే ఆ క్షణంలో ఆమె ప్రదర్శించిన ప్రశాంతత, ధైర్యం ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేశాయి. పొరపాటు సైతం ఆమెను అడ్డుకోలేకపోయిం, వెనక్కి మరల్చలేకపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం ఆమె దృఢనిశ్చయానికి కేరాఫ్‌ అడ్రస్‌ అంటూ ప్రశంసల వర్ష కురిపిస్తూ పోస్టులు పెట్టారు.

(చదవండి: దంతాలతో కళాఖండాలు..! ఆమె టాలెంట్‌కి ఫిదా అవ్వాల్సిందే)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement