ఎన్నో రకాల శిల్పులను చూశాం. అతి సూక్ష్మమైన వాటిని తయారు చేసేవారు, గోటితో, ముక్కుతో పలు రకాల ఆర్ట్‌లను ప్రదర్శించారు. కానీ దంతాలతో ఆర్ట్ గురించి విన్నారా..?. ఔను మీరు వింటోంది నిజమే..ఈ కళను చైనా మహిళ ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.
చైనాలోని హుబే ప్రావిన్స్‌కు చెందిన 25 ఏళ్ల చెన్ క్విన్ తన అసాధారణ ప్రతిభకు సంబంధించిన వీడియోలను పంచుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. కేవలం తన పళ్లతో సూక్ష్మమైన శిల్పాలు చెక్కుతూ లక్షలాది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమె వాటన్నింటిని క్యారెట్లతో చేయడం విశేషం. క్యారెట్లను కొరుకుతూ అద్భుతమైన కళాఖండాలుగా మలుస్తుందామె.

చిన్న జంతువుల బొమ్మల నుంచి వివిధ సంక్లిష్టమైన నిర్మాణాల వరకు చాలా కళాఖండాలను రూపొందించింది. అందులో అత్యంత ఆకర్షణీయమైన చైనా మహా కుడ్యg, ఎల్లో క్రేన్ టవర్ ప్రతిరూపాలు, ఫీనిక్స్ కిరీటాలు, మియావో ప్రజలు ధరించి వెండి టోపీలు తదితరాల కూడా ఉన్నాయి.
ఇదెలా మొదలైందంటే..
క్యారెట్‌ని తింటున్నప్పుడూ ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. తొలుత సరదాగా చిన్న చిన్న ఆకృతులను తయారు చేసింది. దానికి మరింత మెరుగులు పెట్టి అందంగా శిల్పాలు చెక్కడం ప్రారంభించింది. అలా ఇప్పటి వరకు సుమారు వందకు పైగా క్యారెట్ శిల్పాలు రూపొందించిందట. ఆ క్యారెట్లన్నీ ఆమె పొలంలో పండినవేనట. పైగా క్విన్ తనను తాను దంత శిల్పిగా అభిర్ణించకుంటోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(చదవండి: Kavitha Vasupalli: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీని తలపించే స్టోరీ..! ప్రాణాలు పణంగా పెట్టిన డాక్టర్..)


