బరువు తగ్గి పీసీఓఎస్‌ని తిప్పికొట్టింది..! అలాగే ఆ సమస్యలు.. | Weight Loss Helped This Dubai Woman Reverse PCOS to skin health | Sakshi
Sakshi News home page

బరువు తగ్గి పీసీఓఎస్‌ని తిప్పికొట్టింది..! అలాగే ఆ సమస్యలు..

Mar 27 2026 5:47 PM | Updated on Mar 29 2026 2:53 PM

Weight Loss Helped This Dubai Woman Reverse PCOS to skin health

బరువు తగ్గడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చొ తెలిస్తే విస్తుపోతారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గితే ఎంత మెరుగైన మార్పులు సొంతం చేసుకోవచ్చో అనేందుకు ఈ మహిళే ఉదాహరణ. తాను వెయిట్‌లాస్‌తో ఎన్ని లాభాలు పొందిందో సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడమే కాదు..బాడీ మార్పుల తాలుకా ఫోటోలను కూడా షేర్‌ చేసుకుందామె.

ఆ మహిళే దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త నికితా ఫుల్వానీ. చాలామంది బరువు తగ్గడాన్ని రూపానికి సంబందించిదిగా భావిస్తారు.కానీ ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గితే హార్మోన్ల సమతుల్యత నుంచి చర్మ ఆరోగ్యం వరకు ప్రతిదానిపై ప్రభావం ఉంటుందని చెబుతుంది. తాను బరువు తగ్గడం వల్ల ముందుగా తన నెలసరి సమస్యలను పరిష్కారమయ్యాయని, ఆ తర్వాత తన చర్మం నిగారింపు సంతరించుకోవడం మొదలైందని చెబుతోంది. 

అలాగే ముఖంపై రోమాలు కూడా తగ్గాయని చెప్పుకొచ్చింది. తాను ఎక్కువగా నీరు తాగడం, మంచి ఆహారపు అలవాట్లతో  అధిక బరువుని సునాయాసంగా తగ్గించుకున్నట్లు వెల్లడించింది. తన ఆరోగ్య సమస్యలు ఎలా తగ్గాయో కూడా వివరించింది.  

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం నిగారింపు సంతరించకుందని, అలాగే శరీరం యాక్టివ్‌గా మారిందని అంటోంది. అలాగే చర్మంపై ఇదివరకు ఉన్న మచ్చలు కూడా తగ్గాయని, మేకప్‌ లేకుండా సౌకర్యవంతంగా ఉండగలుగుతున్నానని అంటోంది. 

అధిక చక్కెర తీసుకోవడంతో నోటి చుట్టూ, మెడ చుట్టూ నలుపు ఎక్కువగా ఉండేదని పేర్కొంది. అయితే ఎప్పుడైతే ప్రాసెస్‌  చేసిన పదార్థాలకు, చక్కెరకు దూరంగా ఉందో ఆ సమస్య చాలమటుకు తగ్గిందని అంటోంది. 

అలాగే పాదాల సైజు నుంచి మణికట్టు సైజు  అన్నింటిలో శరీర మార్పుని చవిచూశానంటోంది. కానీ బరువు తగ్గితే శరీరం ఎంతగా రూపాంతరం చెందుతుందో, మనలో ఎంతటి అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయో స్పష్టంగా తెలిసిందని అంటోంది. 

ప్రస్తుతం తనను చూస్తే..జస్ట్‌ 25 లేదా 27 ఏళ్లు అని మాత్రమే అనుకుంటారని అంటోంది. కచ్చితంగా బరువు తగ్గితే అక్షరాల యవ్వనంగా మారిపోతామని, మన చర్మకాంతి పెరుగుతుందని చెబుతోంది ఫుల్వానీ. మన జీవనశైలి బాగుంటే అందం, ఆరోగ్యం రెండు మన సొంతం అవుతాయని చెబుతోంది.

 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: తొలి ట్రాన్స్‌జెండర్‌ ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌..!)

 

Advertisement
 
Advertisement
Advertisement