సంగారెడ్డి జోన్: నిమ్జ్ ప్రాజెక్టులో మౌలిక వసతులు ప్రణాళికబద్ధంగా చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకత్, అధికారులతో కలిసి టీజీఐఐసీ భూములు, నిమ్జ్, ఎన్‌ఐసీడీసీ పరిధిలోని భూముల అభివృద్ధి, సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు లేఅవుట్ అభివృద్ధి కోసం త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈమేరకు రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సర్వే పనులు వేగవంతం చేసేందుకు రెవెన్యూ, సర్వే, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కొలతలతో సర్వే పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి పాల్గొన్నారు. అలాగే జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్


