న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026
సంగారెడ్డిలోని టీటీడీ కల్యాణ మండపంలో కళాభారతి సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన చేనేత హస్తకళ మేళాకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మేళాలో కొండపల్లి, వేటికొప్పాక బొమ్మలు, నిర్మల్ హైదరాబాద్ మంచి ముత్యాలు, మైసూర్ రోజ్‌వుడ్, సహారన్ పూర్ ఫుడ్ కార్వింగ్, వరంగల్ చెవర్, జూట్ బ్యాగులు, బంజారా ఎంబ్రాయిడరీ, బెంగాల్ జ్యూరీ బ్యాక్స్‌లు ప్రదర్శనకు ఉంచారు. వీటితోపాటు పోచంపల్లి, నారాయణపేట, వరంగల్, ఉప్పాడ, కంది, ధర్మవరం, సిద్దిపేట, పొందూరు, వెంకటగిరి, మంగళగిరి చీరలు, చేనేత కాటన్, పట్టువస్త్రాలు, టవల్స్, చేనేత దుప్పట్లు, కర్టెన్లు, ఖాదీ మెటీరియల్స్ కూడా అమ్మకానికి ఉంచారు.
–సంగారెడ్డి


