చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని రుద్రారంలో ఆదివారం యారియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో యూరియా వచ్చిందని తెలుసుకొని బుక్ చేసుకునే లోపే యాప్ బుకింగ్ క్లోజ్ అయిందని రైతులు వాపోయారు. కళ్లముదు యూరియా ఉన్న ఇతర గ్రామాల వారు వచ్చి తీసుకెళ్తున్నారని, తమకు దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు యూరియా అందించేందుకు చర్యలు తీసుకుకోవాలని కోరారు. దీంతో పోలీస్‌లు గ్రామానికి చేరుకుని రైతులను సముదాయించారు. ఏఓ ప్రవీణ్‌తో మాట్లాడి విషయం వివరించగా.. సోమవారం గ్రామ రైతులకు యూరియా అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.


