ఎమ్మెల్యేకు అమీన్‌పూర్ వాసుల వినతి
పటాన్‌చెరు: అమీన్‌పూర్‌లో స్యూవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను వెంటనే ఆపాలని స్థానికులు డిమాండ్ చేశారు. అమీన్‌పూర్‌లోని పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ సంఘాల ప్రతినిధులు ఆదివారం సమావేశం అయ్యారు. కాలనీలకు సమీపంలో మురుగు శుద్ధిని చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. సర్వే నంబర్ 993 గుట్టల్లో చక్కని పచ్చదనం ఉందని, అమీన్‌పూర్ జీవవైవిధ్యమున్న ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ ప్రదేశంలో పర్యావరణ అనుమతుల్లేకుండా ఎస్‌టీపీ నిర్మాణం చేయడం విడ్డూరంగా ఉందని వివిధ కాలనీల సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ తిరుమల్‌రెడ్డి, మోడీ కాలనీ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రమేశ్, ఇతర కాలనీ సంఘాల ప్రతినిధులు అరుణ్, విష్ణు, రవి, జయరామ్, వెంటరెడ్డి, విజయ్ పాల్గొన్నారు.


