ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు..
సంగారెడ్డి జోన్: పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని చిన్నారుల ఆరోగ్య సంరక్షణ చర్యలో భాగంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అంగన్ వాడి కేంద్రాలలో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నుంచి ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. మే నెలలో పూర్తిగా సెలవులు ప్రకటించాయి. ఒంటిపూట తరగతుల్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు. దీంతో ఆయా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు వేసవి నుంచి ఉపశమనం కలుగనుంది. కేంద్రాల నిర్వహణలో సమయం మారినప్పటికీ, పిల్లలకు, గర్భిణిలు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారంలో ఎలాంటి మార్పు ఉండదు.
నెలరోజుల పాటు సెలవులకు చాన్స్
అంగన్ వాడి కేంద్రాల సంబంధిత సంఘాల సభ్యులు ఒంటిపూట తరగతులతో పాటు వేసవి సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు నిర్వహించి అనంతరం నెల రోజులపాటు వేసవి సెలవులు రానున్నాయి.
జిల్లా వ్యాప్తంగా ఉన్న
ప్రాజెక్టులు
జిల్లాలోని అంగన్ వాడి
కేంద్రాలు
కేంద్రాల్లో హాజరయ్యే
చిన్నారులు
వేలకు పైగా..
పెరుగుతున్న వేసవి దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం
నెల రోజులపాటు సెలవులు
టేక్ హోమ్ ద్వారాఇంటికే సరుకులు
సెలవుదినాల్లో ఇంటికే పౌష్టికాహారం
జిల్లా వ్యాప్తంగా ఐదు ప్రాజెక్టు పరిధిలో 1504 అంగన్వాడి కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాలలో 96 వేలకు పైగా చిన్నారులు ప్రతి రోజు హాజరవుతుంటారు. వేసవి సెలవుల్లో పౌష్టికాహారం పంపిణీ నిలిచిపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే టేక్ హోమ్ రేషన్ ద్వారా ఇంటికే పంపించేందుకు రూపకల్పన చేస్తున్నారు. పెరుగుతున్న ఎండల తీవ్రత వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్రం నిర్వాహకులతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
5
1504
96


