కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, యువజన సంక్షేమ– క్రీడాభివద్ధి, విద్యాశాఖ, శిశు సంక్షేమ, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌న్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంగారెడ్డి, నారాయణఖేడ్ స్టేడియంలలో కొనసాగుతున్న మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. స్టేడియం మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సంగారెడ్డిలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ప్రారంభానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుద్దీకరణ, చిన్నపాటి మరమ్మతులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ లలిత కుమారి, సీపీఓ బాలశౌరి, స్పోర్ట్స్ అథారిటీ అధి కారి అఖిలేష్ రెడ్డి, అదనపు డీఆర్‌డీఓ బాలరాజ్, డీఈఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ ఏపీడి సూర్యరావు, ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమంతో పాటు ఆర్థికాభివృద్ధి కొరకు నిర్ణయించే లక్ష్య సాధనకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో వ్యవసాయ, ఉద్యానవన, డీఆర్‌డీఏ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో రైతుల ఆదాయం పెంపు, వ్యవ సాయ ఉత్పాదకతలో గణనీయమైన వృద్ధి సాధించేందుకు ఫార్మ్ మెకనైజేషన్, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి, తేనెటీగల పెంపకం పథకాలను అమలు చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటా యించిన ఫార్మ్ మెకనైజేషన్ లక్ష్యాలను వేగంగా సాధించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించాలని, రైతులను యాంత్రీకరణ వైపు మరింతగా ప్రోత్స హించాలని సూచించారు.ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా మినీ ట్రాక్టర్లు, పవర్ వీడర్స్, పవర్ టిల్లర్స్, బ్రష్ కట్టర్స్, పవర్ స్ప్రేయర్స్ వంటి యంత్రాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, జిల్లాలో ఇప్పటివరకు 97 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు.
ప్రజావాణిలో 49 దరఖాస్తులు
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌తో పా టు అదనపు కలెక్టర్ పాండు, సబ్ కలెక్టర్ ఉమా హా రతి కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన 49 దరఖాస్తులను స్వీకరించారు.


