మండలంలో శనగ పంట కోత పనులు తుది దశలో కొనసాగుతున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో పనులు సాగలేదు. దీంతో రెండు రోజుల నుంచి రైతులు శనగ పంట కోత పనులు, రాసులు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలో సుమారు 5,800 ఎకరాల్లో పంట సాగు చేశారు. ఎకరాకు 7 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలు శనగలకు ప్రభుత్వం రూ.5,850 మద్దతు ధరను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. త్వరలో రాయికోడ్‌లో గల శనగల కొనుగోలు కేంద్రంను ప్రారంభించనున్నారు.
రాయికోడ్(అందోల్):


