ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఉత్తరాఖండ్ బృందం
జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం డివిజన్ పరిధిలోని బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలను సోమవారం విద్యా పరిశోధన, శిక్షణ మండలి సంస్థ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయ బృందం సందర్శించింది. పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న వసతులపై ఆరా తీశారు. ఉచిత యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, విద్యా బోధన, మధ్యాహ్న భోజనం వంటి అంశాలను తెలుసుకున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బృందం సభ్యులు డాక్టర్ డీఎస్ లింగ్వాల్, శివకుమార్, భరద్వాజ్, హరిశంకర్, కిమోతి, మంతారాన, శివాని తదితరులు పాల్గొన్నారు.
బురదలో కూరుకుపోయాయ్
జహీరాబాద్ టౌన్: పట్టణం నుంచి అల్లనా వెళ్లే రోడ్డులో రెండు రోజుల నుంచి వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. ఆదివారం లోడుతో వెళ్తున్న లారీ బురదలో దిగపడగా.. సోమవారం కారు చిక్కుకుంది. దీంతో ఈ రోడ్డు వెంట ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గతంలో రూ. 33 లక్షలతో ర్‌అడ్‌బీ అధికారులు రోడ్డుపై బ్రిడ్జిని నిర్మించారు. కానీ రోడ్డు పనులు పూర్తి చేయలేదని విమర్శలు చేస్తున్నారు. అయితే రోడ్డుపై మొరం పోయడంతో ఇటీవల కురిసిన వర్షానికి బురదగా తయారై వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. ఇప్పటికై నా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
తీరు మారకపోతే చర్యలు
గజ్వేల్: కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్‌లోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వార్డు లను కలియ తిరిగారు. అటెండెన్స్ రిజిష్టర్‌ను పరి శీలించారు. అనుమతి లేనిదే ఎవరూ సెలవు తీసు కోవద్దన్నారు. గర్భిణుల్లో మనోధైర్యం నింపు తూ మంచి ఆహారపు నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.


