గజ్వేల్‌రూరల్: భద్రాచలంలోని సీతారాముల కల్యాణోత్సవంలో వినియోగించే గోటి తలంబ్రాలను భక్తులు సిద్ధం చేశారు. గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్తసమాజం వ్వవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ఈ బృహత్కర కార్యానికి శ్రీకారం చుట్టగా గోటి తలంబ్రాల దీక్షలో వేలాది మంది భక్తులు పాల్గొని రామనామ స్మరణతో భక్తులు గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గజ్వేల్–ప్రజ్ఞాఫూర్ మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భక్తులు గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్నారు. సోమవారం పట్టణంలోని మురళీకృష్ణాలయం నుంచి భద్రాచలంలోని సీతారాముల దేవస్థానంలో గోటి తలంబ్రాలను తరలించనున్నారు. ఈమేరకు రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాల కలశాలతో అందజేశారు.


