అదుపుతప్పి ఆటో బోల్తా | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి ఆటో బోల్తా

Mar 17 2026 8:45 AM | Updated on Mar 17 2026 8:45 AM

శివ్వంపేట(నర్సాపూర్‌): అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ సంఘటన తూప్రాన్‌– నర్సాపూర్‌ హైవేపై సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా... తూప్రాన్‌ నుంచి నర్సాపూర్‌కు ఐస్‌క్రీమ్‌ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ ఆటో అదుపుతప్పి కుడివైపునకు వెళ్లి రాజన్నవాగు బ్రిడ్జిపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఎదురుగా ఇతర వాహనాలు రాకపోడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రెవర్‌తో పాటు ఆటోలో మరో వ్యక్తి ఉన్నా వారికి ఎలాంటి గాయాలు కాలేదు. బ్రిడ్జిపై బోల్తాపడటంతో ఇతర వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

జిల్లెలగడ్డలో పాలవ్యాన్‌..

హుస్నాబాద్‌రూరల్‌: హుస్నాబాద్‌ మండలం జిల్లెలగడ్డలో సోమవారం పాలవ్యాన్‌ బోల్తా పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం... సిద్దిపేట నుంచి హుజురాబాద్‌కు వెళ్తున్న పాల వ్యాన్‌ అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. అందులో డ్రైవర్‌, క్లీనర్‌కు స్వల్ప గాయాలు కావడంతో వారిని ప్రైవేటు వాహనంలో హుస్నాబాద్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement