ఆయురారోగ్యాలతో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఆయురారోగ్యాలతో ఉండాలి

Mar 20 2026 10:05 AM | Updated on Mar 20 2026 10:05 AM

ఆయురారోగ్యాలతో ఉండాలి

మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి,

ఎమ్మెల్సీ అంజిరెడ్డి

రామచంద్రాపురం (పటాన్‌చెరు): పరాభవనామ సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని రాష్ట్ర శాసన మండలి మాజీప్రోటెమ్‌ చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి ఆకాంక్షించారు. రామచంద్రాపురం డివిజన్‌ పరిధిలోని పాతరామచంద్రాపురం హనుమాన్‌ ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా గురువారం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి మాజీప్రోటెమ్‌ చైర్మన్‌ వి.భూపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రాజేశ్వర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు అంజయ్య, బి.పుష్ప, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కో ఆర్టినేటర్‌ వి.ఆదర్శ్‌రెడ్డి, నాయకులు కుమార్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, దిలీప్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement