అంతా రామమయం
శ్రీ రామనవమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి రామ మందిరంలో మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కల్యాణం కనుల పండువగా జరిగింది. సంగారెడ్డి రామ్ మందిర్ ఆలయానికి రూ.2.50 కోట్ల విలువ చేసే ఆభరణాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు సమర్పించారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవంలో ఎమ్మెల్యే గూడెం యాదమ్మ మహిపాల్‌రెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


