తొగుట(దుబ్బాక): యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని ఘణపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవికాంత్‌రావు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పులగూర్ల మల్లారెడ్డి కుమారుడు నరేందర్ (33) కు ఏప్రిల్ 2న వివాహం నిశ్చయమైంది. కాగా ఈ నెల 23న తొగుటకు చెందిన యువతితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ క్రమంలో పెళ్లి పనుల కోసం 27న అన్న నాగరాజుతో కలిసి సిద్దిపేటకు వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి 9.30 గంటలకు పశువులకు మేతవేసి వస్తానంటూ ఇంట్లో చెప్పి బావి వద్దకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో అర్ధరాత్రి వరకు కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం తెల్లవారు జామున కుటుంబీకులు వెళ్లి చూడగా ఎడల దుర్గయ్య బావి వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. పెళ్లి విషయంలో మనస్తాపానికి గురై ఉరేసుకున్నట్లు తెలిపారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఆత్మహత్య చేసుకున్న యువకుడు


